News


నేడు మార్కెట్లకు సెలవు

Monday 2nd September 2019
Markets_main1567399018.png-28137

వినాయక చవితి సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్ర సమయంలో ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా మంగళవారం (3న) ప్రారంభమవుతుంది.  బ్యాంక్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మధ్యాహ్న నష్టాలు రికవరీ కావడంతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. ప్రస్తుత మందగమనం చక్రీయ వృద్ధిలో ఒక భాగమని, ఇది స్వల్ప మందగమనమేనని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో తేల్చేయడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరగలదన్న అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, ముడి చమురు ధరలు స్వల్పంగానైనా తగ్గడం  కలసివచ్చాయి. రోజంతా 568 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 264 పాయింట్ల లాభంతో 37,333 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,023 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 632 పాయింట్లు, నిఫ్టీ 194 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఈ రెండు సూచీలు చెరో 1.7 శాతం  ఎగిశాయి. 7 ట్రేడింగ్‌ సెషన్ల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడం విశేషం. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1శాతం, స్మాల్ క్యాప్‌ ఇండెక్స్‌ 0.80శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీ డైలీ ఛార్ట్‌లో హార్మర్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. అప్‌ట్రెండ్‌ కొనసాగితే 11,111 వద్ద, అటు పైన 11141 వద్ద నిరోధ స్థాయిలు కలిగి ఉన్నాయి. అలాగే డౌన్‌సైడ్‌ ట్రెండ్‌లో 10,950 వద్ద, ఈ స్థాయిని కోల్పోతే 10,880 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. 



You may be interested

ర్యాలీ కొనసాగేనా..?

Monday 2nd September 2019

స్థూల ఆర్థికాంశాలే ఈవారంలో కీలకం అమెరికా-చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం కేవలం 5 శాతంగా నమోదైన దేశ క్యూ1 జీడీపీ ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం వినాయక చవితి సందర్భంగా సోమవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనానికి గడిచిన వారంలో అడ్డుకట్ట పడింది. అంతక్రితం రెండు వారాల వరుస నష్టాల నుంచి కోలుకుని, లాభాల బాట పట్టిన ప్రధాన సూచీలు.. దాదాపు 1.79 శాతం లాభపడి ఏకంగా మూడు నెలల గరిష్టస్థాయిని

ఈ స్టాక్స్‌తో మీ నోరు తీపి..!

Sunday 1st September 2019

చక్కెర రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పూర్తి మద్దతు... ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటోంది ఐసీఐసీఐ డైరెక్ట్‌. ఎందుకంటే ఒక వైపు చక్కెరకు మద్దతు ధరలు ప్రకటించడంతోపాటు, మరోవైపు ఎగుమతులకు సబ్సిడీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంకోవైపు పెట్రోల్‌లో ఎథనాల్‌ బ్లెండింగ్‌ను 2022 నాటికి 10 శాతానికి, ఆ తర్వాత 2030 నాటికి 20 శాతానికి పెంచాలని కేంద్రం

Most from this category