News


నేడు మార్కెట్లకు సెలవు

Monday 12th August 2019
Markets_main1565581638.png-27696

బక్రీద్‌ సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. అందుచేత బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు.  అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్సే​ంజ్‌లు మాత్రం మధ్యాహ్నం పనిచేయవు. సాయంత్ర సమయంలో యధావిధిగా పనిచేస్తాయి. ఇక స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా మంగళవారం (13న) ప్రారంభమవుతుంది. గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం మార్కెట్‌ వరుసగా రెండోరోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 254.55 పాయింట్ల లాభంతో 37,581.91 వద్ద నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 11,109.70 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌ ప్రతిపాదించిన సూపర్‌ రిచ్‌ పన్ను ఎత్తివేయవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్ట్లర్లు సెకండరీ మార్కెట్లో  29 ట్రేడింగ్‌ సెషన్ల అనంతరం శుక్రవారం తొలిసారి కొనుగోళ్లు చేశారు. సుమారు రూ.204 కోట్ల విలువైన షేర్లను కొనుగోళ్లు చేశారు. అదే రోజు దేశీయ సంస్థలు రూ.607 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.



You may be interested

స్థిరంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Monday 12th August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 9:15 ని.సమయంలో 7  పాయింట్ల నష్టంతో 11,116.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11123 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి.  మరోవైపు ఆసియా ప్రధాన సూచీలు లాభనష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం కూడా నష్టపోయాయి.    మిశ్రమంగా ఆసియా

మందగమనంలోనూ జోరు మీదున్న వైట్‌గూడ్స్‌

Monday 12th August 2019

మందగమనం... నేడు కార్పొరేట్‌ సమూహంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇటువంటి పరిస్థితుల్లోనూ వైట్‌ గూడ్స్‌ (కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌) పరిశ్రమ జూన్‌ త్రైమాసికంలో ఏకంగా 30 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఆటోమొబైల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు వృద్ధి మందగమనం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కానీ, అటువంటి పరిస్థితులేమీ వైట్‌ గూడ్స్‌ పరిశ్రమలో కనిపించకపోవడం సానుకూలం.    బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ను పరిశీలిస్తే... కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ విభాగం వార్షికంగా అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 31.7

Most from this category