News


నేడు మార్కెట్లకు సెలవు

Wednesday 25th December 2019
Markets_main1577256511.png-30428

 క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. హోల్‌సేల్‌ కమోడిటీ, మెటల్‌, బులియన్‌ మార్కెట్లు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌, కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లకు కూడా నేడు సెలవు దినం. భారత ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం తీవ్రంగానే ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌) హెచ్చరించడంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం లాంటి అంశాలు సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. సెన్సెక్స్‌ 181 పాయింట్లు పతనమై 41,461 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 12,215 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ముగిశాయి.  ఫార్మా, మెటల్‌ షేర్ల తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఈక్విటీ మార్కెట్లకు క్రిస్మస్‌, కొత్త సంవత్సరపు సెలవు రోజులు. రాబోయే సెషన్లలో కూడా అస్థిరత కొనసాగవచ్చని రిలిగేర్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు అజిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు.



You may be interested

బడ్జెట్‌లోపు నిఫ్టీ 13,000 పాయింట్లకు!

Wednesday 25th December 2019

బుల్లిష్‌ ధోరణి కొనసాగే వీలుంది ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈవో అమిత్‌ గుప్తా అంచనా ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట బుల్‌రన్‌ కనిపిస్తోంది. సాంకేతికంగా ఈ బుల్లిష్‌ ధోరణి ఇకపైనా కొనసాగే అవకాశముందంటున్నారు ట్రేడింగ్‌బెల్స్‌ సహవ్యవస్థాపకులు, సీఈవో అమిత్‌ గుప్తా. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిఫ్టీ కదలికలపై బుల్లిష్‌ అంచనాలు ప్రకటించారు. వివరాలు...... కన్సాలిడేషన్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట బుల్లిష్‌ మొమెంటమ్‌ నెలకొని ఉంది. దీంతో బడ్జెట్‌ కంటే ముందుగానే  ఎన్‌ఎస్‌ఈ ప్రధాన

వచ్చే ఏడాది మిడ్‌ క్యాప్స్‌ హవా: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

Wednesday 25th December 2019

నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌కు డిమాండ్‌  భారీ హెచ్చుతగ్గులకు ఆస్కారం తక్కువే రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌: నవీన్‌ కులకర్ణి వచ్చే ఏడాది(2020)లో మధ్య, చిన్నతరహా కౌంటర్లు వెలుగులో నిలిచే వీలున్నట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి చెబుతున్నారు. అయితే స్మాల్‌ క్యాప్స్‌తో పోలిస్తే మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ త్వరగా జోరందుకోనున్నట్లు అంచనా వేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2020లో మార్కెట్ల గమనం, విభిన్న రంగాల తీరు తదితర

Most from this category