News


నేడు మార్కెట్లకు సెలవు

Monday 28th October 2019
Markets_main1572236258.png-29174

దిపావళి బలిప్రతిపాద సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. ఈక్విటీ మార్కెట్‌తో పాటు కమోడిటీ మార్కెట్‌ కూడా ఈ రోజు పనిచేయదు. ఎంసీఎక్స్‌లో మాత్రం ఈ రోజు సాయంత్రం ట్రేడింగ్‌ జరుగుతుంది. దీపావళి రోజున ముహూరత్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రత్యేక ట్రేడింగ్‌ను స్టాక్‌ఎక్చేంజ్‌లు నిర్వహిస్తాయి. దీపావళి మరుసటి రోజు సెలవు ఇస్తారు. ఈ దఫా ముహూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు పాజిటివ్‌గా క్లోజయ్యాయి. దీంతో మార్కెట్‌ సంవత్‌ 2076ను పాజిటివ్‌గా ఆరంభించినట్లయింది. నిఫ్టీ 11627 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 39250 పాయింట్ల వద్ద ముగిశాయి. మిడ్‌క్యాప్‌ 0,69 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 1.2 శాతం లాభపడ్డాయి. మార్కెట్లో అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌గా ముగియడం విశేషం. మూరత్‌ ట్రేడింగ్‌లో టాటామోటర్స్‌, యస్‌బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫీ, వేదాంత టాప్‌గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్లో స్పష్టమైన పాజిటివ్‌ మార్పు కనిపిస్తోందని, ఇకపై సూచీలు మరింత ముందడుగు వేయవచ్చని ఈ సందర్భంగా మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 



You may be interested

ఐసీఐసీఐ బ్యాంకుపై బుల్లిష్‌!

Monday 28th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం ఐసీఐసీఐ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. క్యు2లో బ్యాంకు అనేక అంశాల్లో పాజిటివ్‌ గణాంకాలు నమోదు చేసింది. దీంతో బ్యాంకు షేరు టార్గెట్‌ను సైతం బ్రోకరేజ్‌లు పెంచాయి. క్యు2లో బ్యాంకు రూ. 655 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఒకదఫా చెల్లించాల్సిన పన్ను మొత్తం కారణంగా లాభం తగ్గిందని, ఈ పన్ను లేకుంటే లాభం రూ. 3575 కోట్లుండేదని బ్యాంకు పేర్కొంది.  - ఎమ్‌కే గ్లోబల్‌:

మురిపించిన ముహూరత్‌ ట్రేడింగ్‌..!

Sunday 27th October 2019

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం గంటసేపు పాటు జరిగిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌‌ మురిపించింది. పండుగ సందర్భంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు లాభాల పంట పండించాయి.  సెన్సెక్స్‌ 192.14 పాయింట్లు పెరిగి 39,250.20 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 11,628.00 వద్ద ముగిశాయి. యస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం నుంచి అరశాతం వరకు పెరగడంతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 103.60

Most from this category