నేడు మార్కెట్లకు సెలవు
By Sakshi

మొహర్రం సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్ ప్రారంభవుతోంది. స్టాక్ మార్కెట్ తిరిగి యథావిధిగా బుధవారం (10న) ప్రారంభమవుతుంది. ఇక ఆర్థిక మందగమన పరిస్థితులను చక్కదిద్దే మరిన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టనున్నదన్న అంచనాలతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్ రెండోరోజూ లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు కొనుగోళ్ల వద్ద లభించడటంతో సెన్సెక్స్ 37000 స్థాయిపైన 37,145.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి వారం రోజుల తరువాత నిఫ్టీ ఇండెక్స్ తొలిసారి 11000పైన 11,003 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ 11000 పైన ముగిసిన నేపథ్యంలో షార్ట్‌టర్మ్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందనీ, 11180 స్థాయిని పరీక్షిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
You may be interested
ఆంధ్రాబ్యాంక్ విలీనానికి యూనియన్ బ్యాంక్ బోర్డ్ ఓకే
Tuesday 10th September 2019రూ.17,200 కోట్ల పెట్టుబడుల సమీకరణకు కూడా సోమవారం నాటి సమావేశంలో ఆమోదం తెలిపిన బోర్డ్ న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని
ఎఫ్ఐఐలు ఇప్పుడప్పుడే మళ్లీ తిరిగి వస్తారా...?
Tuesday 10th September 2019ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక రంగం పుంజుకునేందుకు గాను పలు చర్యలను ప్రకటించినా కానీ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) మాత్రం భారత్ పట్ల ఇంకా ఆందోళనతోనే ఉన్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి వారి పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోవడం అదే సూచిస్తోంది. భారత ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడమే వారి ప్రధాన ఆందోళనకు కారణం. ముఖ్యంగా ఆర్థిక రంగ