News


నెలరోజుల్లో బీఎస్‌ఈ-500 టాప్‌టెన్‌ లూజర్లు ఇవే..!

Saturday 14th March 2020
Markets_main1584175177.png-32482

మార్కెట్‌ పతనంలో భాగంగా గడచిన నెలరోజుల్లో బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ ఏకంగా 21.50శాతం నష్టాన్ని చవిచూసింది. పతనమైన షేర్లలో అత్యధికంగా టాటా కెమికల్స్‌ షేరు అత్యధికంగా 63.77శాతం నష్టాన్ని చవిచూసింది. ఇదే సూచీలో ఒక్కషేరు కూడా ఇన్వెస్టర్లకు లాభాల్ని సమకూర్చలేకపోవడం గమనార్హం.

కరోనా వైరస్‌ వ్యాధి భయాలతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐల పెట్టబడుల సంహరణ, దివాళా దిశగా సాగుతున్న యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారిటోరియం లాంటి చర్యలతో మార్కెట్లు భారీగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలరోజుల్లో భారీ పతనాన్ని చవిచూసిన టాప్‌-10 నిఫ్టీ లూజర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం...!

గడిచిన నెలరోజుల్లో బీఎస్‌ఈ-500 సూచీలో భారీ పతనాన్ని చవిచూసిన షేర్లు టాప్‌-10 లూజర్లు
క్రమసంఖ్య షేరు పేరు ప్రస్తుత ధర(3-14-2020 నాటికి 30రోజుల్లో పతనం
1 టాటాకెమికల్స్‌ రూ. 274.20 63.77శాతం
2 గాయిత్రి ప్రాజెక్ట్స్‌ రూ. 59.77 59.42శాతం
3 సద్భవన్‌ ఇంజనీరింగ్‌ రూ. 60.70 55.92శాతం
4 డిష్‌ టీవీ ఇండియా రూ. 12.01 55.04శాతం
5 ఫ్యూచర్‌ రీటైల్‌ రూ. 370 53.86శాతం
6 కార్పోరేషన్‌ బ్యాంక్‌ రూ. 23.25 53.55శాతం
7 వెల్‌స్పన్‌ కార్ప్‌ రూ.211.75శాతం 53.51శాతం
8 ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.339.45  51.85శాతం
9 జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.135.45 51.72శాతం
10 ఇంటలెక్ట్‌ డిజైన్‌ రూ.154.80 50.94శాతం

 



You may be interested

ఎస్‌బీకార్డ్స్‌ లిస్టింగ్‌.. నష్టాలా లాభాలా?

Saturday 14th March 2020

గ్రే మార్కెట్‌ ఏం చెబుతోంది? ఈ నెల మొదట్లో రూ. 350-380 ప్రీమియం తదుపరి రూ.25-50కు దిగివచ్చిన ప్రీమియం శుక్రవారానికల్లా రూ. 25 డిస్కౌంట్‌లోకి కరోనా వైరస్‌ ధాటికి దేశీ స్టాక్‌ మార్కెట్లు కుదేలైన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌ ఎలా ఉండనుందన్న అంచనాలు ఇటీవల ఇన్వెస్టర్లను కుదిపివేస్తున్నాయి. రూ. 755 ధరలో వచ్చిన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో సోమవారం(16న) లిస్ట్‌కానుంది. క్రెడిట్‌ కార్డ్స్‌ మారెట్లో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న

బోర్డునుంచి తప్పుకున్న బిల్‌ గేట్స్‌!

Saturday 14th March 2020

మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ బోర్డునుంచి తప్పుకుంటున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ డైరెక్టర్ల బోర్డు, బర్క్‌షైర్‌ హాతవే బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్‌గేట్స్‌ తెలిపారు.64 ఏళ్ల బిల్‌గేట్స్‌ భార్యతో కలిసి ప్రారంభించిన బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఈ

Most from this category