రెండు రోజుల పాటు మార్కెట్లో అమ్మకాల వెల్లువ?
By Sakshi

బ్రోకరేజిలు, క్లయింట్ల ఖాతాలలోని షేర్లను బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీ(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లలో తనాఖా పెట్టి మూలధనాన్ని సమకూర్చుకోడాన్ని, ట్రేడింగ్ ఖాతాదారులకు పాక్షికంగ చెల్లించినా.. స్టాకులు కేటాయించడాన్ని నిలుపుదల చేస్తూ సెబి జారీ చేసిన కొత్త నిబంధనలు వచ్చే నెల1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ గడువు తేదీని పొడిగించాలని బ్రోకర్స్ సెబీని కొరినప్పటికి, సెబీ వారి విజ్ఞప్తులను తోసిపుచ్చింది. ఫలితంగా సెప్టెంబర్ 1లోపు బ్రోకర్స్ తప్పనిసరిగా రూ. 2,500-3,000 కోట్ల విలువైన స్టాకుల విక్రయానికి పూనుకుంటారని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త నిబంధనలు...
వినియోగదారుల సెక్యురిటీలు, నిధులను బ్రోకరేజిలు ఉపయోగించుకోవడంలో నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ ఈ ఏడాది జూన్‌లో కఠినతరం చేసింది. సెబీ నిర్ణయించిన ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుండగా, ఈ తేదిని పొడిగించాలనే బ్రోకరేజిల విజ్ఞప్తులను సెబీ పట్టించుకోలేదు. దీని ప్రభావంతో బుధవారం పాజిటివ్‌లో ప్రారంభమైన సెన్సెక్స్ కొద్ది సమయంలోనే 189 పాయింట్లను కోల్పోయిన విషయం గమనార్హం. ఇదే ధోరణి గురువారం కూడా కనిపించింది. సెబీ కొత్త నిబంధనల ప్రకారం ట్రేడింగ్ మెంబర్(టీఎం) లేదా క్లియరింగ్ మెంబర్(సీఎం) ఆధీనంలో ఉన్నట్లువంటి క్లయింట్ అనుషంగిక(కొలేటరల్) ఖాతా, క్లయింట్ మార్జిన్ ట్రేడింగ్ సెక్యూరిటీల ఖాతా, క్లయింట్ పాక్షికంగా చెల్లించిన సెక్యూరిటీల ఖాతాలు, సభ్యుల నిధుల సేకరణ కోసం తనఖా పెట్టడానికి, బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలకు బదిలీ చేయడానికి వీలుండదు.
సాధరణంగా బ్రోకింగ్ ఇండస్ట్రీలో బ్రోకర్స్, తమ వినియోగదారులలో కొంత మందికి పాక్షిక చెల్లింపులకే స్టాకులను కేటాయిస్తుంటాయి. మరల ఆ వినియోగదారుడు ఆ స్టాకులకు సంబంధించి పూర్తి చెల్లింపులు చేసేంతవరకు ఆ స్టాకులు బ్రోకర్స్ ఆధినంలో ఉంటాయి. కొత్త నిబంధనల ప్రకారం ఈ స్టాకులను సెప్టెంబర్ 1 తర్వాత నుంచి తనఖా పెట్టడం వంటివి బ్రోకరేజిలు చేయడానికి వీలుండదు. పూల్ ఖాతా మినహా టీఎం లేదా సీఎం తెరిచిన అన్ని క్లయింట్ సెక్యూరిటీ ఖాతాలను, క్లయింట్ మార్జిన్ ట్రేడింగ్ సెక్యూరిటీల ఖాతాలను, క్లయింట్ అనుషంగిక ఖాతాల విషయంలో ఆగస్టు 31 న లేదా అంతకన్నా ముందే బ్రోకర్లు జాగ్రత్తపడాలి. ఇప్పటికింకా సెబీ నిబంధనలను పాటించని బ్రోకర్లు, తమ ఖాతాదారులు పూర్తి చెల్లింపులు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. చెల్లింపులు పూర్తయ్యాక ఆ స్టాకులను వినియోగదారుల డీమాట్ ఖాతాలోకి బదిలీ చేస్తారు. మార్జిన్ ట్రేడింగ్ సౌకర్యాన్ని వినియోగించుకొని కొనుగోలు చేసిన షేర్ల కోసం బ్రోకర్లు ‘క్లయింట్ మార్జిన్ ట్రేడింగ్ సెక్యురిటీస్ ఖాతా’ అనే ప్రత్యేక ఖాతాను నిర్వహించాలని సెబీ తెలిపింది. అంతేకాకుండా క్లయింట్లు పాక్షికంగా చెల్లించిన సెక్యూరిటీల కోసం ప్రత్యేకంగా ‘క్లయింట్ చెల్లించని సెక్యూరిటీ ఖాతా’ ను తెరవమని సెబీ కోరింది. క్లయింట్ సెక్యూరిటీలు తనఖాకు అందుబాటులో లేకపోవడం, ఈ వారం షేర్ మార్కెట్లలో లిక్విడిటీని తగ్గించి, ఒత్తిడిని పెంచుతుందని మార్కెట్లో పాల్గొనేవారు తెలిపారు.
You may be interested
మాంద్యాన్ని మార్కెట్ ఎక్కువకాలం ఎదుర్కోలేదు!
Thursday 29th August 2019ఆర్థిక మందగమ ప్రభావాన్ని దీర్ఘకాలం ఎదుర్కోనే సామర్థ్యం స్టాకుల లేదని ప్రముఖ అనలిస్టు రోనోజోయ్ మజుందార్ అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ మూడురోజుల లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. గతనెలలో దేశ ఆర్థిక కార్యకలాపాల్లో బలహీనత పెరిగిందన్న వార్తలు మార్కెట్‌ను కుంగదీశాయి. ఈ నేపథ్యంలో ఎకానమీ, మార్కెట్లు తదితర అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... మందగించిన ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గత శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించిన ఉద్దీపన
‘ఆర్వీ 400’ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది..!
Thursday 29th August 2019వాయిదా పద్దతిలో కొనుగోలుకు అవకాశం నెలకు రూ. 3,499 న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ ఇంటెల్లీకార్ప్.. తన తొలి ఈ-మోటార్‌సైకిల్ ‘ఆర్వీ 400’ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నెలవారీ సులభ వాయిదా పద్ధతిలో ఈ బైక్‌ను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తూ.. స్పెషల్ పేమెంట్ స్కీంను ప్రకటించింది. నెలకు రూ. 3,499 చొప్పున 37 నెలలు చెల్లించే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఈ బైక్ ప్రీ-బుకింగ్స్ జూన్ 25 నుంచి