News


ఈ షేర్లను అమ్మకోలేక బ్రోకరేజ్‌ల ఇక్కట్లు

Friday 6th September 2019
Markets_main1567754853.png-28238

పూల్‌ అకౌంట్ల నుంచి క్లయింట్ల అకౌంట్లు వేరు చేయాలన్న సెబి నిర్ణయం బ్రోకరేజ్‌లకు కొత్త తలనొప్పులు తెచ్చింది. ఇప్పటికే కొని పెట్టుకున్న ఎక్చేంజ్‌ల్లో కదలికలులేని షేర్లు(ఇల్లిక్విడేట్‌ షేర్లు- గ్రూప్‌ ఏలో లేని చిన్నా చితకా కంపెనీల షేర్లు), ఇటీవల కాలంలో బాగా పతనమైన మిడ్‌క్యాప్‌ షేర్లను అమ్మాలంటే కొనే నాధుడు లేక పలు బ్రోకరేజ్‌లు ఇక్కట్లు పడుతున్నాయి. ఈ రెండు రకాల షేర్లు ప్రస్తుతం బ్రోకరేజ్‌ల వద్ద దాదాపు రూ. 7800 కోట్ల విలువైనవి ఉన్నాయని తెలిసింది. ఇలాంటి లిక్విడేషన్‌ తక్కువున్న షేర్లను బ్రోకరేజ్‌లు క్లయింట్ల ఖాతాల్లో కొని పెట్టడం జరగుతుంది. ఇలాంటి షేర్లను క్లయింట్లకు అంటగట్టేందుకు బ్రోకరేజ్‌లు రెండు రకాల మార్గాలు అవలంబించేవి. కొనుగోలు విలువలో కొంత మొత్తం తాము భరించి క్లయింట్‌ ఖాతాలోకి ఇలాంటి షేర్లను తీసుకోవడం, లేదా క్లయింట్లకు తమ ఎన్‌బీఎఫ్‌సీ విభాగంతో రుణం ఇప్పించి కొనుగోలు చేయించడం అనే మార్గాలు బ్రోకరేజ్‌లు వాడేవి. కొంత మొత్తం తాము భరించి కొనుగోలు చేసిన షేర్లను నిర్ధిష్ట సమయం తర్వాత క్లయింట్‌ పూర్తి మొత్తం చెల్లించకుంటే బ్రోకింగ్‌సంస్థే అయినకాడికి అమ్మేసేది. ఇలాంటి వ్యవహారాలన్నింటికీ చెక్‌ చెబుతూ సెబి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇవి అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటికల్లా బ్రోకరేజ్‌లు ఇలాంటి షేర్లన్ని విక్రయించి క్లయింట్‌ ఖాతాలను పూల్‌ ఖాతాల నుంచి వేరు చేయాల్సిఉంటుంది. దీంతో ఈ షేర్లను వదిలించుకుందామని బ్రోకరేజ్‌లు భావిస్తున్నా, లిక్విడేషన్‌ లేకపోవడం ఒకపట్టాన వాటి విక్రయాలు జరపలేకపోతున్నాయి. వీటిని తాకట్టులో పెడదామంటే రుణదాతలు సదరు షేర్ల అసలు ధరపై భారీ తగ్గింపుతో రుణాలిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో అటు అమ్మలేక, ఇటు వీటితో రుణం తెచ్చుకోలేక పలు బ్రోకరేజ్‌లు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంతో డెడ్‌లైన్‌ నాటికి బ్రోకరేజ్‌లు ఎలా బయటపడతాయో ఆసక్తికరంగా మారింది.



You may be interested

డీఎల్‌ఎఫ్‌ 7శాతం డౌన్‌..!

Friday 6th September 2019

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీతో సంబంధాలున్నాయనే ఆరోపణలను ఖండించినప్పటికీ.., రియల్లీ దిగ్గజం కంపెనీ డీఎల్‌ఎఫ్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 7శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.159.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఇండియన్‌ బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ పిల్‌లో ఇండియన్‌బుల్స్‌ గ్రూప్‌తో  డీఎల్‌ఎఫ్‌కు వున్న సంబంధాలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణలు గత కొన్ని నెలల క్రితం కూడా వ్యాపించాయి. డీఎల్‌ఎఫ్ గ్రూప్

బ్యాంక్‌ నిఫ్టీ జంప్‌

Friday 6th September 2019

ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 26,986.50    వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఒకదశలో 333 పాయింట్లు(1.25శాతం) పెరిగి 27,252.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(26,919.70)తో పోలిస్తే 268 పాయింట్లు(1శాతం)

Most from this category