News


రిలయన్స్‌పై విదేశీ బ్రోకరేజిల మాట!

Tuesday 13th August 2019
Markets_main1565677724.png-27734

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆయిల్‌ టూ కెమికల్స్‌(ఓటీసీ) వ్యాపారంలో, 20 శాతం వాటాను సౌదీ ఆరాంకో కొనుగోలుచేయడంతో ఆర్‌ఐఎల్‌ జీరో డెట్‌ కంపెనీగాగా మారెందుకు  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత మూడు నెలలో రుణాలు, ప్రతికూల నిధుల ప్రవాహాం వలన ఇబ్బందులు పడిన ఆర్‌ఐఎల్‌, సౌదీఆరాంకోతో కుదుర్చుకున్న రూ. లక్ష కోట్ల డీల్‌తో మంగళవారం సానుకూలంగా  ట్రేడవుతోంది. ఈ స్టాకుపై రాత్రికి రాత్రే అనేక విదేశి బ్రోకరేజిలు సానుకూల రేటింగ్‌లను ఇవ్వడం గమనార్హం. ఈ స్టాకుపై కొన్ని బ్రోకరేజిల అంచనాలు..
   ‘ఈ లావాదేవీ మార్చి 2020 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్‌ఐఎల్‌ పెట్రోకెమికల్‌/రిఫైనింగ్‌ ఎబిట్డాలో 20 శాతం వాటా ఆరాంకోకు అపాదించడంతో, ఆర్‌ఐఎల్‌ ఆర్థిక సంవత్సరం 21 స్టాండ్‌ ఎలోన్‌ ఈపీఎస్‌(షేరు పై ఆదాయం) విలువ 6 శాతం తగ్గుతుందని సుమారుగా అంచనా వేశాం’ అని నోమురా ఇండియా తెలిపింది. ఈ లావాదేవి వలన ఆర్‌ఐఎల్‌ రుణ స్థాయిలపై ఆందోళనగా ఉన్నా.. ఈ కంపెనీ ఇన్వెస్టర్ల భయాలు తొలుగుతాయని అభిప్రాయపడింది. ఈ లావాదేవి వలన ఆర్‌ఐఎల్‌ నికర అప్పు సుమారుగా 1500 కోట్ల డాలర్ల మేర తగ్గనుంది. రిలయన్స్ నికర రుణం ఆర్థిక సంవత్సరం 2019  చివరినాటికి సుమారుగా 2200 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ కంపెనీ స్టాకు టార్గెట్‌ ధరను నోమురు రూ. 1,600 గా నిర్ణయించింది. ఒక వేళ ఈ లక్ష్యాన్ని ఈ స్టాకు చేరుకున్నట్టయితే, రూ. 8 లక్షల కోట్లకు దిగువన ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ .10 లక్షల కోట్లకు చేరుకుంటుంది. 
   మూలధన వ్యయాల క్రమశిక్షణను పాటించడంతో పాటు, బ్యాలెన్స్‌ షీట్‌లను సరియైన రీతిలో ఆర్‌ఐఎల్‌ నిర్వహిస్తోందని విదేశి బ్రోకరేజి సంస్థ, యుబీఎస్ తెలిపింది. రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీలను మార్కెట్లలో నమోదు చేయనున్న ప్రణాళికను పరిగణలోకి తీసుకొని​ఈ కంపెనీ స్టాకు టార్గెట్‌ ధరను రూ. 1,500గా ఈ బ్రోకరేజి సంస్థ నిర్ణయించింది.
    బలహీనంగా ఉ‍న్న రిఫైనింగ్‌, కెమికల్‌ మార్జిన్‌ల వలన ఆర్‌ఐఎల్‌ స్టాకు గత మూడు నెలలో 12 శాతం మేర పతనమయ్యిందని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ప్రస్తుతం ఈ స్టాకును పరిశీలించవలసిన సమయం వచ్చిందని వివరించింది. ఈ స్టాకు టార్గెట్‌ ధరను రూ. 1,349 గా నిర్ణయించి, ఈ స్టాకు రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’ నుంచి ‘ఓవర్‌ వెయిట్‌’కు మోర్గాన్‌ స్టాన్లీ నవీకరించింది. రిఫైనింగ్ మార్కెట్ రీబ్యాలెన్సింగ్, చౌకైన క్రూడ్‌ ఈథేన్ ఈ స్టాక్‌ పీఈ నిష్పత్తి పెరగడానికి సహాయపడగలదని తెలిపింది. 
    ఈ స్టాకుపై ఉన్న బుల్లిష్‌ వార్తల ప్రవాహాన్ని అనుసరించి బ్రోకరేజి సంస్థ మాక్వేరీ, ఆర్‌ఐఎల్‌ స్టాకు రేటింగ్‌ను నవీకరించింది. టార్గెట్‌ ధరను రూ. 1,370 గా నిర్ణయించి, రేటింగ్‌ను ‘ఔట్‌ఫెర్ఫార్మ్‌’ కు పెంచింది. కానీ నగదు ప్రవాహా ఆందోళనల వలన ఈ స్టాకుపై జాగ్రత్తగా ఉన్నామని తెలిపింది. 
    క్రెడిట్ సూసీ, ఈ స్టాకుపై ‘అండర్ఫార్మ్’ రేటింగ్‌ను కొనసాగించింది. కానీ ఈ స్టాకు టార్గెట్ ధరను మాత్రం రూ .995 నుంచి రూ. 1,028 కు పెంచింది. ‘సౌదీ అరాంకోతో కుదుర్చుకున్న నాన్‌ బైండింగ్‌ ఎల్‌ఓఐ(లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌), 7,500 కోట్ల డాలర్ల విలువైన ఎంటర్‌ప్రైజెస్‌లో సౌదీ ఆరాంకోకు 20 శాతం వాటాను గురించి తెలియజేస్తోంది. ఇది మా మార్కెట్‌ క్యాప్‌ కంటే అధికం. ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ లక్ష్యాన్ని పెంచాం’ అని తెలిపింది. కాగా గత మూడు నెలల్లో స్టాకుపై ‘బై’ కాల్‌లు 10 నుంచి తొమ్మిదికి పడిపోయాయి. ఈ స్టాకుకు ‘ఔట్‌ ఫెర్ఫార్మ్‌’ ఇచ్చిన బ్రోకరేజిల సంఖ్య 14 నుంచి 11 తగ్గిపోయాయి.You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ : లోయర్‌ సర్క్యూట్‌!

Tuesday 13th August 2019

రుణ సంక్షోభంలో కూరుపోయిన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్‌ దాఖలు చేయడం లేదని వేదాంతా రిసోర్సెస్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ స్పష్టం చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 44.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం వోల్కన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ఈఓఐ

ముకేశ్‌.. మెగా డీల్స్‌

Tuesday 13th August 2019

కంపెనీలోకి రూ. 1.15 లక్షల కోట్లు చమురు రిఫైనరీ, రిటైల్‌లో వాటా విక్రయం సౌదీ ఆరామ్‌కో చేతికి 20 శాతం వాటా ఇంధన రిటైలింగ్‌లో బ్రిటన్‌ బీపీకి 49 శాతం ఏడాదిన్నరలో రుణ రహిత కంపెనీగా ఆవిర్భావం సెప్టెంబర్‌ 5 నుంచి జియో ఫైబర్‌ సేవలు  అయిదేళ్లలో ఐపీవోకి జియో, రిటైల్‌ చమురు నుంచి టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మరిన్ని భారీ వ్యాపార ప్రణాళికలు ప్రకటించింది. ఏడాదిన్నర వ్యవధిలో

Most from this category