News


ఈ ఇండెక్స్‌ స్టాక్స్‌ రేటింగ్‌లో మార్పులు

Monday 3rd February 2020
Markets_main1580753830.png-31476

ఇండెక్స్‌ స్టాక్స్‌ అయిన ఐటీసీ, మారుతి సుజుకీ, ఐవోసీ, ఎస్‌బీఐ రేటింగ్‌లను అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు సవరించాయి.

 

ఐటీసీ
ఐటీసీ స్టాక్‌కు ఇప్పటి వరకు కొనసాగించిన ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను జేపీ మోర్గాన్‌ తాజాగా న్యూట్రల్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరగా రూ.235ను పేర్కొంది. సిగరెట్లపై తాజా బడ్జెట్‌లో పన్నును పెంచేయడంతో స్టాక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. బడ్జెట్‌లో పన్నుల పెంపు ఐటీసీ సిగరెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని జేపీ మోర్గాన్‌ తెలిపింది. రానున్న 6-12 నెలలకు ఈ స్టాక్‌ పెరిగేందుకు పరిమిత అవకాశాలే ఉన్నాయని పేర్కొంది.

 

మారుతి సుజుకీ
మారుతి సుజుకీకి సిటీ సంస్థ బై రేటింగ్‌ ఇస్తూ, టార్గెట్‌గా రూ.8,100ను ఇచ్చింది. బీఎస్‌-6కు మారే ప్రభావం కంపెనీపై పరిమితంగానే ఉంటుందని, 2020-21లో మారుతి మార్కెట్‌ వాటాను పెంచుకుంటుందని అంచనా వేసింది. గ్రామీణ డిమాండ్‌ వృద్ధిని అందిపుచ్చుకోగల సత్తా కంపెనీకి ఉందని అభిప్రాయపడింది.

 

ఐవోసీ
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు నోమురా బై రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌గా రూ.160ను పేర్కొంది. బీఎస్‌-6కు మారిన తర్వాత కంపెనీ రిఫైనరీ వ్యాపారం రికవరీ అవుతుందని అంచనా వేసింది. అయితే, 2020-21 సంవత్సరం ఆదాయ అంచనాలను తగ్గించింది.

 

ఎస్‌బీఐ
ఎస్‌బీఐకు అవుట్‌పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్టు క్రెడిట్‌ సూసే తాజాగా ప్రకటించింది. కాకపోతే టార్గెట్‌ ధరను రూ.415 నుంచి రూ.400కు సవరించింది. నిర్వహణ పనితీరు స్థిరంగా ఉంటుందని, ఐబీసీ రికవరీ బ్యాంకు లాభాలను పెంచుతుందని అంచనా వేసింది. అలాగే, రుణ వ్యయాలు మోస్తరుగా ఉండడం రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీని పెంచుతుందని పేర్కొంది. 



You may be interested

బడ్జెట్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు ఇవి..

Monday 3rd February 2020

కేంద్ర బడ్జెట్‌పై అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలకు మంచి విలువ ఉంటుంది. విదేశీ ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టుబడులు ఎలా ఉండొచ్చన్నది వీటి అభిప్రాయాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు.   గోల్డ్‌మ్యాన్‌శాక్స్‌ శనివారం బడ్జెట్‌ ప్రకటన అనంతరం భారత ఈక్విటీలు నష్టాలపాలయ్యాయి. ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణకు 2020-21 సంవత్సరం ఎంతో కీలకమైనదని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ద్రవ్యలోటు స్థిరీకరణ ఉండొచ్చని అంచనా వేసింది. బడ్జెట్‌ ప్రకటనలు వృద్ధి దిశగా ఆర్‌బీఐకి సౌకర్యాన్ని

యస్‌బ్యాంక్‌ స్థానంలోకి శ్రీ సిమెంట్‌..?

Monday 3rd February 2020

నిఫ్టీ 50 నుంచి యస్‌ బ్యాంక్‌ తన స్థానాన్ని కోల్పోనుంది. 2020 మార్చి 31 నుంచి యస్‌బ్యాంక్‌ స్థానంలో శ్రీ సిమెంట్‌ రానుందని ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ అండ్‌ సెక్యూరిటిస్‌ అంచనా వేసింది. నిఫ్టీ50 తరువాతి సమీక్షలో శ్రీ సిమెంట్‌ నిఫ్టీ ఇండెక్స్‌లోకి వస్తుందని, ఎన్‌ఎస్‌ఈ ప్రమాణాలకు లోబడే యస్‌ బ్యాంక్‌ స్థానంలో శ్రీ సిమెంట్‌ వస్తుందని  తెలిపింది. కాగా ఏడాదికి రెండు సార్లు నిఫ్టీ50 సమీక్షలు జరుగుతాయి. ఆరు

Most from this category