News


మారుతీ సుజుకీ.. మరింత డౌన్‌సైడ్‌!

Friday 25th October 2019
Markets_main1571986080.png-29139

బ్రోకరేజ్‌ల అంచనాలు
సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు మారుతీ సుజుకీ షేరుపై పాత అభిప్రాయాన్నే కొనసాగిస్తున్నాయి. క్యు2లో కంపెనీ అనలిస్టుల అంచనాలకన్నా మిన్నగానే ఫలితాలు చూపింది. కానీ ఫలితాలు రికవరీని సూచించడం లేదంటూ చాలా బ్రోకరేజ్‌లు షేరుపై బేరిష్‌ అంచనాలనే కొనసాగిస్తున్నాయి. 
- మారుతీపై యూబీఎస్‌ అమ్మొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ధరను రూ. 5700గా నిర్ణయించింది. తాజా ఫలితాలు అంచనాలను మించినా, వాల్యూషన్లు ఇంకా ఖరీదుగానే ఉన్నాయని తెలిపింది. 
- షేరుకు క్రెడిట్‌సూసీ అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌ను, రూ. 6330 టార్గెట్‌ను ఇచ్చింది. కంపెనీ రాబోయే సంవత్సరాల ఈపీఎస్‌ను 5 శాతం మేర పెంచింది. డిమాండ్‌ మందగమనం కారణంగా ఇప్పట్లో రికవరీ అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. 
- కంపెనీ వరుసగా ఐదో త్రైమాసికం కూడా నష్టాలు ప్రకటించిందని గోల్డ్‌మన్‌సాక్స్‌ వ్యాఖ్యానించింది. అయితే ఎబిటా మార్జిన్లు బాటమ్‌అవుట్‌ అయ్యాయని తెలిపింది. షేరుపై కొనొచ్చు రేటింగ్‌ను రూ. 7669 టార్గెట్‌ను నిర్ణయించింది. 
మారుతీ మాతృసంస్థ సుజుకీ మోటర్స్‌ సైతం భారత్‌లో ఆటో మార్కెట్‌ మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని తన ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించుకుంది. తాజా ఫలితాలు బాగున‍్నట్లు కనిపించినా ఇందుకు ప్రధాన కారణం ఇతర ఆదాయాలు పెరగడం, తక్కువ టాక్స్‌రేటు కారణాలని, అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌లో పెద్ద పాజిటివ్‌ మార్పులు ఆశించలేమని సుజుకీ భావించింది. అందుకే ఎర్నింగ్స్‌ అంచనాలను, గైడెన్స్‌ను తగ్గించుకుంది. ప్రస్తుత వాల్యూషన్ల వద్ద మారుతీ ఇంకా ఖరీదుగానే కనిపిస్తోందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. 



You may be interested

అనూహ్య అమ్మకాలు: నష్టాల్లోకి సూచీలు

Friday 25th October 2019

ఉదయం నుంచి రిలీఫ్‌ ర్యాలీ చేస్తున్న సూచీలు... మిడ్‌సెషన్‌ ఒక్కసారి మొదలైన అమ్మకాలతో అనూహ్యంగా నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలతో పాటు బ్యాంకింగ్‌, ఫార్మా రంగ షేర్లల్లో ఒక్కసారి అమ్మకాలు నెలకొనడంతో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకోవడటంతో ఉదయం

ఫలితాల ప్రభావం: ఇండిగో షేరు క్రాష్‌ల్యాండింగ్‌

Friday 25th October 2019

ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను తీవ్ర నిరాశపరచడంతో శుక్రవారం ఇండిగో షేర్లు కుప్పకూలాయి. కంపెనీ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం ఈ ఆర్థిక సంవత్సరపు క్యూ2(జులై-సెప్టెంబర్‌)లను విడుదల చేసింది. క్యూ2లో రూ. 1062 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది గతేడాది క్యూ2లో రూ. 652 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 31 శాతం ఎగసి రూ. 8105

Most from this category