News


రూ.లక్ష కోట్లతో.. లాభపడే కంపెనీలు

Thursday 2nd January 2020
Markets_main1577989129.png-30625

మౌలిక రంగ ప్రాజెక్టులపై 2024 నాటికి రూ.105 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో మౌలిక రంగంలోని కంపెనీలు సమీప భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను ఇస్తాయనే విశ్లేషణనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని ప్రకటించినప్పటికీ... ఆచరణలో మాత్రం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే వ్యయాలను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

‘‘ప్రభుత్వ లక్ష్యం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. గత పదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాలపై చేసిన ఖర్చు కంటే మూడు రెట్లు పెద్దది. ప్రభుత్వ అంచనాల కంటే తక్కువ ఆదాయం, ద్రవ్యలోటు కఠినంగా ఉండడం, ఇన్‌ఫ్రా రంగానికి బ్యాంకుల రుణ వితరణ బలహీనంగా ఉండడం, ప్రైవేటు రంగం పాత్ర తక్కువగా ఉండడం, ఇన్‌ఫ్రా కంపెనీల భారమైన బ్యాలన్స్‌ షీట్లు ప్రభుత్వ కార్యక్రమానికి కష్టంగా మారొచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరీక్షిత్‌ కండ్‌పాల్‌ సూచించారు. పెద్ద ఎత్తున నిధులు దీనికి అవసరమవుతాయన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గత ఆరేళ్ల ఇన్‌ఫ్రా వ్యయాల కంటే ఇది రెట్టింపు. ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిచ్చేదే. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రభుత్వ ద్రవ్య పరిస్థితులు మెరుగుపడాలి. అలాగే, విదేశీ పెట్టుబడులపైనా ఇది ఆధారపడి ఉంటుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు. 

 

కొనుగోలుకు అవకాశాలు..
లార్జ్‌క్యా్ప్‌ కంపెనీ అయిన ఎల్‌అండ్‌టీ ఎక్కువగా ప్రయోజనం పొందుతుందని నిపుణులు ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. రోడ్డు నిర్మాణ విభాగంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎల్‌అండ్‌టీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, అశోక బిల్డ్‌కాన్‌ కంపెనీలను మోతీలాల్‌ ఓస్వాల్‌ సూచించింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరీక్షిత్‌ కండ్‌పాల్‌ సులభమైన బ్యాలన్స్‌ షీట్లతో ఉన్న ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌, ఏబీబీ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఇన్‌ఫ్రా విభాగంలో పీఎన్‌సీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, కెపాసిట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌, అశోక బిల్డ్‌కాన్‌ను ఆయన సూచించారు. 

 

సిఫారసులు
జియోజిత్‌: కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌, ఏబీబీ, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, కెపాసిట్‌ఇన్‌ఫ్రా, అశోక బిల్డ్‌కాన్‌
మోతీల్‌ఓస్వాల్‌: ఎల్‌అండ్‌టీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, అశోక బిల్డ్‌కాన్‌
కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: ఎల్‌అండ్‌టీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, అశోక బిల్డ్‌కాన్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, కల్పతరు పవర్‌You may be interested

12,300 కీలకం

Thursday 2nd January 2020

శుక్రవారం సెషన్‌లో 12,300 నిఫ్టీకి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్‌ తదుపరి డైరెక్షన్‌కు ఇది కీ పాయింట్‌ అవుతుందంటున్నారు. నిఫ్టీ గురువారం 100 పాయింట్ల వరకు లాభపడినప్పటికీ.. కీలక నిరోధ స్థాయి 12,290ని అధిగమించలేకపోయిందని.. ఈ స్థాయికి పైన నిశ్చయాత్మకంగా క్లోజ్‌ అయితేనే నిఫ్టీ తదుపరి 12,400 మార్క్‌ను చేరుకుంటుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కొనుగోళ్ల మద్దతు రాకపోతే మరికొంత స్థిరీకరణ చెందొచ్చని భావిస్తున్నారు.   ‘‘నిఫ్టీ 12,118-12,293 శ్రేణిలో గత 11 సెషన్లలోనూ

కదంతొక్కిన రియాల్టీ షేర్లు

Thursday 2nd January 2020

రియల్టీ రంగ షేర్ల ర్యాలీ కారణంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గురువారం 1శాతానికి పైగా లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్‌ ఎస్టేట్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు 299.15 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు రియల్టీ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.52శాతం లాభపడి 302.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 0.92శాతం లాభంతో

Most from this category