బ్రోకరేజిలు టార్గెట్ ధరను సవరించిన షేర్లివే
By Sakshi

సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడంతోపాటు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడడంతో కొన్ని స్టాకుల టార్గెట్ ధరలను బ్రోకరేజ్‌లు పెంచాయి. అదే సమయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న కంపెనీల టార్గెట్ ధరలను తగ్గించాయి. సెప్టెంబర్ ఫలితాలు వెలువడిన తర్వాత, బ్రోకరేజిలు అధికంగా ఆస్తి నిర్వహణ కంపెనీలు, ఇన్సురెన్స్, హెల్త్‌కేర్ కంపెనీల టార్గెట్ ధరలు పెంచాయి. కానీ బ్యాంకింగ్, టెలికాం, హౌసింగ్ సెక్టార్లకు సంబంధించిన కంపెనీల టార్గెట్ ధరలను తగ్గించాయి. విశ్లేషకులు టార్గెట్ ధరలను అధికంగా పెంచడం లేదా తగ్గించడం చేసిన టాప్ 10 కంపెనీలు.. హెచ్డీఎఫ్సీ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మణుప్పురం ఫైనాన్స్ నారయణ హృదయాలయా డా. లాల్ పాత్‌ల్యాబ్స్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్బీఎల్ బ్యాంక్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ మహింద్రా లాజిస్టిక్స్ డిష్ టీవీ ఇండియా
ఇండియాలో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ ..హెచ్డీఎఫ్సీ ఏఎంసీ. ఈ కంపెనీ ప్యాట్(పన్ను తర్వాత లాభం) సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 368.3 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది ప్రాతిపదికన 79 శాతం పెరుగుదల. ప్రస్తుతం కంపెనీ ఇష్యుకి వచ్చిన రూ. 1,100 ధరతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ట్రేడవుతోంది. గత కొన్ని వారాల నుంచి ఈ కంపెనీ టార్గెట్ ధరను బ్రోకరేజిలు అధికంగా పెంచాయి. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ షేరు పెరుగుదల స్వల్ప కాలంలో పరిమితంగా ఉన్నప్పటికి, దీర్ఘకాలంలో మంచి వృద్ధి అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ‘హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇండియాలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్‌గా ఉంది.స్వల్పకాలంలో కంపెనీ షేరు పరిమితంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికి, దీర్ఘకాలానికి గాను కంపెనీ వృద్ధి ఆశాజనకంగా ఉంది’ అని ఐఐఎఫ్ఎల్ ఓ నివేదికలో పేర్కొంది.
వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా
వర్ల్‌పూల్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండడంతో విశ్లేషకులు ఈ కంపెనీపై సానుకూలంగా ఉన్నారు. ‘కంపెనీ అమ్మకాలు పండుగ సీజన్ ముందు పుంజుకోవడంతో, కంపెనీ సెప్టెంబర్ ఫలితాలు భారీగా మెరుగయ్యాయి ’ అని ఐఐఎఫ్ఎల్ తెలిపింది. కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 63.8 శాతం పెరిగి రూ. 128.7 కోట్లకు చేరుకుంది. ఫలితాల తర్వాత కంపెనీ షేరు టార్గెట్ ధరను విశ్లేషకులు 26 శాతం మేర పెంచినప్పటికి, కంపెనీ వాల్యుషన్లు ఆర్థిక సంవత్సరం 2021 అంచనాలకు 40 రెట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
కంపెనీ ఏకీకృత లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో(ఏడాది ప్రాతిపదికన) 82 శాతం పెరిగి రూ. 402.3 కోట్లుగా నమోదైంది. ఫలితంగా అనేక బ్రోకరేజిలు ఈ కంపెనీ టార్గెట్ ధరను 20 శాతం మేర పెంచాయి. ‘వచ్చే కొన్ని త్రైమాసికాలలో బంగారంపై రుణాలు పుంజుకుంటాయి. అంతేకాకుండా బంగారం ధరలు అధికంగా ఉండడం, నియంత్రణ వాతవారణం అనుకూలంగా ఉండడం వంటి అంశాలు ఈ స్టాకుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 4 శాతం ప్లస్ పెరుగుతుందని అంచనాలుండడంతో, ఆర్ఓఈ(రిటర్న్ ఆన్ ఈక్విటీ) 20 శాతం ప్లస్ ఇవ్వగలిగే సామర్ధ్యం కంపెనీకి ఉందని నమ్ముతున్నాం’ అని ఐడీబీఐ క్యాపిటల్ పేర్కొంది. కంపెనీ స్టాక్‌పై కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తూ, కంపెనీపై టార్గెట్ ధరను రూ. 195కి పెంచింది.
ఈ హాస్పిటల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాదిప్రాతిపదికన 233.80 శాతం పెరిగి రూ. 45.33 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 13.58 కోట్లుగా నమోదైంది. ‘ఎన్ఏఆర్హెచ్ మంచి స్థాయిలో ఉన్న హాస్పిటల్‌గా కొనసాగుతోంది. గత కొన్ని త్రైమాసికాల నుంచి, హాస్పిటల్ మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. అంతేకాకుండా మరికొంత మూలధన వ్యయానికి హాస్పిటల్ సిద్ధంగా లేదని మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది’ అని జెప్ఫరీస్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ బ్రోకరేజి, ఈ ఆసుపత్రిపై కొనచ్చు రేటింగ్ ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 340గా నిర్ణయించింది.
కంపెనీ ఏకీకృత లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 41.4 శాతం(ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 81 కోట్లుగా నమోదైంది. ‘కంపెనీ వృద్ధి, ఆర్ఓసీఈ(హై రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్) ఆశాజనకంగా ఉండడం, కంపెనీ ప్రీమియం మల్టిపుల్స్‌కు మద్ధతుగా ఉంటుంది’ అని సిటీ గ్రూప్ అంచనావేసింది. అంతేకాకండా ఈ కంపెనీ టార్గెట్ ధరను రూ. 1,475 నుంచి రూ. 1,700కు పెంచింది.
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకీకృత నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 32 శాతం పడిపోయి రూ. 702.18 కోట్లుగా నమోదైంది. మోర్గాన్ స్టాన్లీ ఈ కంపెనీ షేరు టార్గెట్ ధరను 49 శాతం తగ్గించి, రూ. 210 గా నిర్ణయించింది. ఈ స్టాక్ కదలిక, మల్టిపుల్స్ అనిశ్చితిలో ఉండడంతో రిస్క్ రివార్డ్ కూడా అంత ఆశాజనకంగా లేదని ఈ బ్రోకరేజి తెలిపింది. ‘వివాదాల వార్తలు వెలువడుతుండడం, ఆస్తి నాణ్యత, నిధుల సమీకరించుకునే సామర్ధ్యం అనిశ్చితిగా ఉండడంతో ఈ స్టాక్ పడిపోతుందని అంచనావేస్తున్నాం’ అని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.
మొండి బకాయిలు అధికమవ్వడంతో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో(ఏడాది ప్రాతిపదికన) 73 శాతం పడిపోయింది. అంతేకాకుండా ఈ బ్యాంక్ ఆస్తి నాణ్యతపై మరిన్ని ప్రతికూల వార్తలు వచ్చే అవకాశం ఉంది. ‘వచ్చే త్రైమాసికంలో కూడా బ్యాంక్ స్లిప్పేజ్లు ప్రస్తుత త్రైమాసికంలో ఉన్నట్టుగానే ఉంటాయని బ్యాంక్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలనిచ్చింది. అంతేకాకుండా ఎన్బీఎఫ్సీలు, రియల్ఎస్టేట్, నిర్మాణం, పవర్ వంటి ఒత్తిడిలో ఉన్న రంగాల కంపెనీలకు రుణాలివ్వడంతో, మొండి బకాయిలు పరంగా మరింతా రిస్క్ ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో రిస్క్ క్రెడిట్ కార్డు లేదా మైక్రో ఫైనాన్స్ రంగాలపై ఈ బ్యాంక్ అధిక ఎక్స్పోజర్ను కలిగివుంది’ అని అంబిత్ క్యాపిటల్ పేర్కొంది. ఈ బ్రోకరేజి ఈ బ్యాంక్‌పై సెల్ రేటింగ్‌ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 269గా నిర్ణయించింది.
జీ ఎంటర్టైన్మెంట్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు స్తబ్దుగా ఉన్నాయి. ఈ కంపెనీ నికర లాభం క్యూ2లో 6.9 శాతం మాత్రమే పెరిగింది. ‘ఎఫ్ఎంసీజీ, ఆటో ఇతర రంగాలలో డిమాండ్ పుంజుకుంటే, కంపెనీ వృద్ధి కూడా పుంజుకుంటుంది. కంపెనీ వాల్యుషన్లు ఆకర్షణియంగా ఉన్నప్పటికి, ప్రమోటర్ల తనఖా షేర్ల రిజల్యూషన్ పక్రియ, ఈ స్టాక్‌పై తీవ్రంగా ప్రభావం చూపనుంది’ అని ఎడల్వెస్ ఓ నివేదికలో పేర్కొంది. జీ పై ఈ బ్రోకరేజి కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 399గా నిర్ణయించింది.
కంపెనీ ఏకీకృత నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాదిపదికన 41 శాతం తగ్గి రూ. 11.2 కోట్లుగా నమోదైంది. ‘ఆటో సెక్టార్లో వాల్యుమ్లు తగ్గడంతో సమీపకాలంలో సమస్యగా ఉన్నప్పటికి, ఆటోయేతర, గిడ్డంగుల విభాగంలో కంపెనీ వృద్ధి మెరుగ్గా ఉంది. అంతేకాకుండా వినియోగదారులు అదనంగా పెరగడంతో దీర్ఘకాలానికిగాను కంపెనీ వృద్ధి ఆశాజనకంగా ఉంది’ అని బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ కంపెనీ స్టాక్‌పై ఈ బ్రోకరేజి కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 460గా నిర్ణయించింది.
డిష్‌టీవీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 96.4 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. ‘ట్రాయ్ ఎన్టీఓ(న్యూ టారీఫ్ ఆర్డర్), రిలయన్స్ ఆధినంలోని కేబుల్ ఆపరేటర్స్ నుంచి ఈ కంపెనీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ స్టాక్ ఈవీ/ఎబిట్టాకు 3.7 రెట్లు వద్ద ట్రేడవుతోంది. ఇది దీర్ఘకాల సగటు కంటే 60 శాతం నుంచి 70 శాతం తక్కువ కావడం గమనార్హం. ఎం అండ్ ఏ(మెర్జర్ అండ్ ఎక్వింటీస్) ప్రకారం కంపెనీ షేరు ఆకర్షణీయంగా ఉంది’ అని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ఈ కంపెనీపై హోల్డ్ రేటింగ్‌ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 34 గా ఈ బ్రోకరేజి నిర్ణయించింది.
You may be interested
నిఫ్టీలో షార్ట్స్.... టార్గెట్ 11800 పాయింట్లు!
Monday 18th November 2019ఫ్యూచర్స్ ప్రీమియంలో తరుగుదల సోమవారం ఉదయం పాజిటివ్‌గా ఆరంభమైన మార్కెట్లు మధ్యాహ్న సమయానికి నెగిటివ్ జోన్లోకి జారాయి. నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రీమియం శుక్రవారంతో పోలిస్తే దాదాపు పది పదిహేను పాయింట్లు తగ్గింది. నిఫ్టీ తన కీలక నిరోధాన్ని విజయవంతంగా దాటకపోవడం, ఫ్యూచర్స్ ప్రీమియం క్రమంగా తగ్గడం.. సూచీల్లో బలహీనతకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ ఫ్యూచర్స్, స్పాట్ మధ్య తేడా శుక్రవారం దాదాపు 40 పాయింట్లు ఉండగా, సోమవారం ఈ తేడా
టెలికాం కన్సాలిడేషన్‌తో..ఎయిర్‌టెల్‌కు లబ్ది !
Monday 18th November 2019ప్రభుత్వ సాయం అందకపోతే మిగిలేవి రెండే.. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా ఏజీఆర్ బకాయిలు, ఫ్లోర్ ధర, నియంత్రణా జరిమానాలు, స్పెక్ట్రంకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన రూపంలో సాయం అందకపోతే దేశీయ టెలికం పరిశ్రమ మరింత కన్సాలిడేషన్‌కు లోనవుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ప్రభుత్వం ‘నో రిలీఫ్’ అంటే టెలికం పరిశ్రమ నిర్మితే మారుతుందని తెలిపింది. ఏజీఆర్ జరిమానాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎయిర్‌టెల్‌కు గట్టి దెబ్బని కానీ పరిశ్రమలో