News


టాటామోటర్స్‌ టార్గెట్‌ పెంచిన బ్రోకరేజ్‌లు

Tuesday 29th October 2019
Markets_main1572327423.png-29200

సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ప్రదర్శన చూపడంతో బ్రోకరేజ్‌లు టాటామోటర్స్‌ షేరు టార్గెట్‌ను పెంచాయి. అయితే కొందరు నిపుణులు మాత్రం కంపెనీ ఫలితాల్లో ఇంకా మెరుగుదల రావాల్సిఉందని అభిప్రాయపడ్డారు. 

- కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను  రూ. 190 నుంచి 200కు పెంచింది. 
- సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను రూ. 120 నుంచి రూ. 190కు పెంచింది. 
- ఎడెల్‌వీజ్‌: హోల్డ్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ను రూ. 134 నుంచి 140కి పెంచింది. ఒక్క త్రైమాసికంలో మంచి ఫలితాలిచ్చినంత మాత్రాన కంపెనీ పరిస్థితి పూర్తిగా మారిందని భావించలేము. ముఖ్యంగా జేఎల్‌ఆర్‌ గుదిబండ కంపెనీ ఫలితాలపై భారం చూపుతూనే ఉండొచ్చు. 
- యాంబిట్‌ క్యాప్‌: అమ్మొచ్చు రేటింగ్‌. కంపెనీ ఫలితాలపై పాజిటివ్‌గా స్పందించాల్సిన అవసరం లేదు. జేఎల్‌ఆర్‌ పూర్తి లాభాయకతలోకి మారితేనే కంపెనీ పరిస్థితి మారుతుంది. 
- జేపీ మోర్గాన్‌: న్యూట్రల్‌ రేటింగ్‌. జేఎల్‌ఆర్‌కు సంబంధించి నెగిటివ్‌ నిధుల ప్రవాహ ఆందోళన కొనసాగుతోంది. మార్జిన్‌ మెరుగుదల స్థిరంగా కొనసాగితేనే కంపెనీపై పాజిటివ్‌ అభిప్రాయం వస్తుంది. 
క్యు2లో టాటామోటర్స్‌ రెవెన్యూ 8 శాతం పెరిగింది. దీంతో మూరత్‌ ట్రేడింగ్‌లో షేరు దాదాపు 17 శాతం దూసుకుపోయింది. మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో షేరు దాదాపు 13 శాతం లాభంతో ట్రేడవుతోంది. 



You may be interested

1500డాలర్ల దిగువకు పసిడి

Tuesday 29th October 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్న తరుణంలో అంతర్జాతీయం మార్కెట్లో పసిడి ధరలు 1500డాలర్ల దిగువకు చేరుకున్నాయి. ఆసియాలో మంగళవారం ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,494 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అతి తొందరలోనే బీజింగ్, వాషింగ్టన్ మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని ట్రంప్ తెలపడంతో అమెరికా చైనాల మధ్య జరుగుతున్న 16నెలల సుధీర్ఘ వాణిజ్య యు‍ద్ధానికి ముగింపు పడవచ్చనే ఆశావహ అంచనాలతో

11,700 పైకి నిఫ్టీ

Tuesday 29th October 2019

అటో, మెటల్‌ షేర్లకు విరివిరిగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటలోనే నిఫ్టీ ఇండెక్స్‌ 11700 స్థాయిని అందుకుంది. ఒకరోజు విరామం తర్వాత నేడు సెన్సెక్స్‌ 49 పాయింట్ల లాభంతో 39,300 వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 11,644 వద్ద మొదలయ్యాయి. దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లల్లో నెలకొన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు

Most from this category