News


డాక్టర్‌ రెడ్డీస్‌పై బ్రోకింగ్‌ సంస్థలు బుల్లిష్‌

Tuesday 28th January 2020
Markets_main1580196289.png-31267

క్యూ3 ఫలితాల నేపథ్యం
టార్గెట్‌ ధరలు పెంపు

ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది(2019-20) మూడో త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు సాధించిన నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ కౌంటర్‌పట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి.ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 570 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నువరింగ్‌సహా కొన్ని ప్రొడక్టులకు సంబంధించి రూ. 1320 కోట్లమేర ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు(నష్టం) నమోదుకావడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలియజేసింది. అయితే మొత్తం ఆదాయం 14 శాతం పెరిగి రూ. 4384 కోట్లను తాకింది. నిర్వహణ మార్జిన్లు 2 శాతం పుంజుకుని 24 శాతాన్ని అధిగమించాయి. దేశీ అమ్మకాలు 13 శాతం బలపడగా.. యూరోపియన్‌ మార్కెట్ల నుంచి 52 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో రీసెర్చ్‌ సంస్థలు డాక్టర్‌ రెడ్డీస్‌ కౌంటర్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

డాక్టర్‌ రెడ్డీస్‌ షేరుకి గతంలో ఇచ్చిన కొనుగోలు రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు యాంబిట్‌ పేర్కొంది. టార్గెట్‌ ధరను రూ. 3217 నుంచి రూ. 3615కు పెంచింది. రానున్న రెండేళ్లలో కంపెనీ సాధించన్ను ఈపీఎస్‌ అంచనాలను 15 శాతంవరకూ పెంచింది.
కొత్త ప్రొడక్టుల విడుదల, నిర్వహణ సామర్థ్యం కారణంగా డాక్టర్‌ రెడ్డీస్‌ మార్జిన్లు మెరుగుపడినట్లు హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. దీంతో షేరు టార్గెట్‌ ధరను రూ. 3230 నుంచి రూ. 3430కు పెంచుతున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ తాజాగా తెలియజేసింది.
సుబోగ్జోన్‌ విక్రయాలు పుంజుకోవడంతో అమెరికాలో అమ్మకాలు స్థిరత్వం సాధించాయని, జూన్‌లో ప్రీట్రయిల్‌ చేపట్టనున్న రెవ్‌లిమిడ్‌ జనరిక్‌ ఔషధం ఇకపై డాక్టర్‌ రెడ్డీస్‌ కౌంటర్‌కు జోష్‌నిచ్చే వీలున్నదని క్రెడిట్‌ స్వీస్‌ పేర్కొంది. వెరసి రూ. 3235 టార్గెట్‌ ధరతో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేసింది. 
పటిష్ట నిర్వహణ కారణంగా డాక్టర్‌ రెడ్డీస్‌ మెరుగైన పనితీరును సాధిస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. కంపెనీ తిరిగి వృద్ధి బాటలో సాగనున్నట్లు అంచనా వేసింది. దీంతో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరుకి ఈక్విల్‌ వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ. 2804 నుంచి రూ. 3236కు పెంచింది. 
డాక్టర్‌ రెడ్డీస్‌ షేరుకి గతంలో ఇచ్చిన బయ్‌ రేటింగ్‌ను ఔట్‌పెర్ఫార్మ్‌గా సవరిస్తున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఇండియాసహా వర్ధమాన మార్కెట్లపై దృష్టిపెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరుకి రూ. 3450 టార్గెట్‌ ధరను ప్రకటించింది.



You may be interested

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌: చైనా మార్కెట్‌ సోమవారం వరకూ బంద్‌..!

Tuesday 28th January 2020

జీజింగ్‌/షాంఘై:- చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ఉధృతితో అక్కడి ప్రభుత్వం లునార్‌ వేడుక సెలవులను మరో 3రోజుల పాటు పొడిగించింది. ప్రభుత్వ ప్రకటనతో బుధవారం(జనవరి 29న) ప్రారంభం కావాల్సిన షాంఘై స్టాక్‌ ఎక్చ్సేంజీ ట్రేడింగ్‌ సోమవారంవరకూ మొదలుకాదు. లునార్‌ వేడుకల సందర్భంగా ఎక్చ్సేంజీకి జనవరి 24 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2003 ఏడాదిలో, సార్స్‌ వ్యాధి వ్యాప్తి సంభవించినపుడు మే డే హాలిడేను 4రోజులు పాటు పొడిగించారు. కరోనా

హెచ్‌డీఎఫ్‌సీ షేరు టార్గెట్‌ పెంపు!

Tuesday 28th January 2020

క్యూ3 ఫలితాల నేపథ్యం బ్రోకింగ్‌ సంస్థల తాజా అంచనాలు మార్టిగేజ్‌ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఈ ఏడాది(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ కౌంటర్‌పట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి. కంపెనీ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన నాలుగు రెట్లు అధికంగా రూ. 8372 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు గృహ ఫైనాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌ మధ్య విలీనంకారణంగా లభించిన రూ. 9020

Most from this category