News


బ్రోకరేజ్‌లు టార్గెట్‌ పెంచిన షేర్లివే..!

Wednesday 16th October 2019
Markets_main1571210829.png-28922

అమెరికా - చైనాల వాణిజ్య ఒప్పందం, ఆర్థిక రంగంలోని అనిశ్చితి, మార్కెట్‌ వర్గాలు ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్దీపన చర్యలు ఆశించడటం లాంటి ప్రతికూలాంశాలు నెలకొన్న నేపథ్యంలో దేశీయ కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలకు విడుదలకు సిద్ధమైమయ్యాయి. ఈ తరుణంలో క్యూ2 ఫలితాలు ఎలాంటాయోనని​మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కంపెనీల ఆదాయాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎఫ్‌ఎంజీసీ రంగానికి చెందిన అవెన్యూ సూపర్‌ మార్ట్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఐటీ సేవల రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను ప్రకటించాయి. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఆయా కంపెనీ షేర్ల కొనుగోలు ధరను పెంచాయి.
ఇన్ఫోసిస్‌:- త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 5.9శాతం వృద్ధి చెంది రూ.4,109 కోట్లను ఆర్జించింది. ఆదాయం 3.8శాతం పెరిగి రూ.22,629 కోట్లను నమోదు చేసింది. డాలర్ల రూపంలో ఆదాయం కూడా 2.5శాతం పెరిగి 3,210 మిలియన్‌ డాలర్లను సాధించింది. 
కేఆర్‌ చౌక్సీ అంచనా:- ఇన్ఫోసిస్‌ క్యూ2 ఫలితాలు అంచనాలను రానున్న రోజుల్లో కంపెనీ ఇదే మూమెంట్‌ను కనబరుస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనాల వేస్తుంది. డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటి వంటి రంగాలలో డిజిటల్ విభాగాన్ని విస్తరించడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. అప్‌సైడ్‌ పొటెన్షియల్‌ 10శాతం వృద్ధికి అవకాశం ఉందనే అంచనాలతో షేరు టార్గెట్‌ ధరను పెంచింది. గతంలో కేటాయించిన రూ.792ల రేటింగ్‌ను రూ.893లకు పెంచింది. 
ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా:- ఆదాయ వృద్ధి అప్పర్‌ గైడెడ్‌ బాండ్‌ను ఇన్ఫోసిస్‌ మధ్యస్తంగా అధిగమిస్తుంది. మార్జిన్లు ఇక్కడ నుండి మెరుగుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2021లో మార్జిన్లు 23 శాతానికి పెరుగుతాయని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి గతంలో కేటాయించిన హోల్డ్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు టార్గెట్‌ ధరను రూ.885లకు పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 47.54శాతం పెరిగి రూ.322.63 కోట్లను ఆర్జించింది. ఆదాయం 22.26శాతం పెరిగి రూ.5,998.90 కోట్లుగా నమోదైంది. ఇబిటా 32.3శాతం పెరిగి రూ.515.4 కోట్లను సాధించింది. ఎబిటా మార్జిన్‌ 8.66శాతం పెరిగింది. 
ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా:- దేశీయ కంపెనీల కార్పోరేట్‌ పన్ను తగ్గింపును నేపథ్యంలో కంపెనీ ఆదాయ అంచనాలను 15 శాతం పైకి సవరించింది. గతంలో తాము తగ్గించిన షేరు టార్గెట్‌ ధర రూ.1,450ల నుంచి రూ.1,700లకు పెంచుతున్న బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.
హిందూస్థాన్‌ యూనీలివర్‌:- ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,848 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ2లో ఆర్జించిన నికర లాభం(రూ.1,525 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించింది. ఇదే క్యూ2లో నిర్వహణ లాభం 21 శాతం వృద్దితో రూ.2,443 కోట్లకు పెరిగింది. గత క్యూ2లో 23.7 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ ఈ క్యూ2లో 24.8 శాతానికి పెరిగింది.
ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా:-  గతంలో కేటాయించిన హోల్డ్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు టార్గెట్‌ ధరను రూ.2,075లకు పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 5 శాతం వాల్యూమ్ వృద్ధి ఉన్నప్పటికీ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2020, 21 ఈపీఎస్‌లను 1.1 శాతం, 2.6 శాతం తగ్గించింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వాణిజ్య మార్గాల్లో ద్రవ్య కొరత సమస్యలున్నప్పటీకీ., కంపెనీ ఆశించిన స్థాయిలో మార్జిన్ల సాధించింది. 



You may be interested

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 11 శాతం క్రాష్‌..!

Wednesday 16th October 2019

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు బుధవారం 11శాతం నష్టపోయాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.189.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీలో తలెత్తిన పాలనాపరమైన సమస్యల కారణంగా ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ సంస్థ మూడీస్‌ ఐబీహెచ్‌ఎఫ్‌ కంపెనీకి చెందిన సీఎఫ్‌ఆర్‌(కార్పోరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌), ఫారెన్స్‌-కరెన్సీ సీనియర్‌ సెక్యూర్డ్‌ రేటింగ్‌ను బీఎ2 నుంచి బీ2కు కుదించింది. ఫలితంగా నిన్న ట్రేడింగ్‌ కంపెనీ షేర్లు 4.50శాతం నష్టపోగా, నేటి ట్రేడింగ్‌లో కూడా అమ్మకాల

బడా షేర్లపైనే ఇన్వెస్టర్ల దృష్టి!

Wednesday 16th October 2019

ప్రస్తుత ఒడిదుడుకుల మార్కెట్లో ఆయా రంగాల్లో టాప్‌ స్టాకులను మాత్రమే ఇన్వెస్టర్లు నమ్ముకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువకు, దాని తర్వాత రెండో స్థానంలో ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువకు మధ్య వ్యత్యాసం గత రెండేళ్లలో మరింత పెరుగుతూ వస్తోందని వివరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రిస్కీ మార్కెట్లో కేవలం అగ్రస్థానంలో ఉన్న కంపెనీల షేర్లపై మాత్రమే ఇన్వెస్టర్లు భరోసా

Most from this category