News


రిలయన్స్‌ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌!

Tuesday 22nd October 2019
Markets_main1571717984.png-29044

సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. పలు బ్రోకరేజ్‌లు కంపెనీ షేరు టార్గెట్‌ ధరను పెంచాయి.
ఆర్‌ఐఎల్‌పై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...


1. యూబీఎస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1500. కమోడిటీ తలనొప్పులున్నా, కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించింది. పెట్‌కెమ్‌ ఉత్పత్తి రికార్డు గరిష్ఠాలను తాకింది. జియో ఫైబర్‌ ఇన్‌ఫ్రాపై ఎక్కువ దృష్టి పెడుతోంది.
2. కోటక్‌ సెక్యూరిటీస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1550కి పెంచింది. ఆర్‌జియో, ఆర్‌ రిటైల్‌ భాగస్వామ్యంతోఉ డౌన్‌ట్రెండ్‌లో కూడా బలమైన ప్రదర్శన చూపింది. కొత్త ప్రాజెక్టులు త్వరలో వేగం పుంజుకుంటాయని అంచనా
3. మోతీలాల్‌ఓస్వాల్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1630కి పెంచింది. కన్జూమర్‌ వ్యాపారం ఫలితాలను శాసించింది. జీఆర్‌ఎం బలంగా ఉండడం కలిసివచ్చింది. 
4. సెంట్రమ్‌ బ్రోకింగ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1650కి పెంచింది. ఎర్నింగ్స్‌లో బలం కనిపించడం మరో రెండుమూడేళ్ల పాటు కొనసాగవచ్చు. పెట్రోకెమికల్‌ కంపెనీ నుంచి ఒక బహుళార్ధ కంపెనీగా ఎదుగుతోంది. 
5. యాంటిక్‌ బ్రోకింగ్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 1555కు పెంచింది. కన్జూమర్‌ వ్యాపారంలో వృద్ధి పెట్రో వ్యాపార బలహీనతను కవర్‌ చేసింది. క్రమంగా రుణభారం తగ్గుతోంది. 
6. ఎస్‌బీఐ క్యాప్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1690. రిఫైనింగ్‌ ఎబిటా అంచనాలను అందుకోలేదు. వాల్యూంలు బాగుండడంతో పెట్‌కెమ్‌ ఎబిటా అంచనాలకు అనుగుణంగాఉంది. మూలధన వ్యయాలు తగ్గించుకోనుంది. 
7. ప్రభుదాస్‌ లీలాధర్‌: అక్యుములేట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1395కు పెంచింది. రిఫైనింగ్‌ వ్యాపారంలో బలహీనత ప్రదర్శనపై ప్రభావం చూపింది. 
8. క్రెడిట్‌సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1210. పెట్రోకెమ్‌, రిఫైనింగ్‌ వ్యాపారాలు అంచనాలు మిస్‌ చేసుకున్నాయి. కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం మాత్రమే బలమైన ప్రదర్శన చూపింది. 
9. ఫిచ్‌ రేటింగ్స్‌: రిలయన్స్‌ జియో జైత్రయాత్ర కొనసాగుతుంది. డిసెంబర్‌ నాటికి టెలికం మార్కెట్లో జియో వాటా 40 శాతానికి చేరుతుందని అంచనా.
10. ఎమ్‌కే గ్లోబల్‌: అరామ్‌కో డీల్‌తో దాదాపు రుణభారం తీరుతుంది. ఫైబర్‌ నెట్‌వర్క్‌, జియో, రిటైల్‌ వ్యాపారాలతో పూర్తిగా లాభాల్లోకి మరలుతుంది.
11. బోఫా ఎంఎల్‌: రెండేళ్లలో 20000 కోట్ల డాలర్ల రెవెన్యూ అందుకునే సత్తా ఆర్‌ఐఎల్‌కు ఉంది. 


RIL

You may be interested

24 పైసలు బలపడిన రూపీ

Tuesday 22nd October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్లో 24 పైసలు బలపడి 70.90 వద్ద ప్రారంభమైంది. కాగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పడిపోవడంతో శుక్రవారం సెషన్‌లో రూపీ-డాలర్‌ మారకంలో స్వల్పంగా బలపడి 71.14  వద్ద ముగిసింది. తక్షణ డాలర్‌-రూపీ జంటకు 70.70-70.50 పరిధిలో మద్ధతు లభించే అవకాశం ఉందని, 72 స్థాయి వద్ద నిరోధం ఎదురుకానుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ తెలిపింది. ‘ అక్టోబర్‌ ఆప్సన్‌ పంపిణీ ప్రకారం రూపీకి

ప్రారంభంలో సూచీల హెచ్చుతగ్గులు

Tuesday 22nd October 2019

మార్కెట్‌ ఆరురోజుల వరుస లాభాల ముగింపు పలుకుతూ మంగళవారం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 65 పాయింట్ల నష్టంతో 39,233.40 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,652.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం నష్టపోయి రూ.691.10 వద్ద లోయర్‌ సర్కూ‍్యట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. అనంతరం రిలీవ్‌ అయ్యి భారీ పతనం దిశగా కదులుతున్నాయి. భారత

Most from this category