News


బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ షేర్లపై బ్రోకరేజ్‌ సంస్థలు బుల్లిష్‌

Saturday 18th May 2019
Markets_main1558176933.png-25822

ముంబై: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో పలు బ్రోకరేజ్‌ సంస్థలు బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లకు టార్గెట్‌ ధరను పెంచాయి. మార్చి త్రైమాసిక కాలంలో అన్ని అంశాల్లో మంచి రాణించడంతో కంపెనీ లాభం 32శాతం పెరిగి రూ.839 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదాయం సైతం 44శాతం పెరిగి రూ.12,995 కోట్లకు చేరింది. కొత్త వినియోగదారులు పెరగడం, స్థిరంగా రుణ వృద్ధిని సాధించడం, ఆదాయాలు, ఆదాయ వృద్ధి గణనీయంగా పెరగడం తదితర కారణాలు ప్రీమియం వాల్యూషన్లకు మద్దతినిస్తాయని బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి. మెరుగైన ఆస్తుల నాణ్యత కొనసాగించడం, ఆదాయ వృద్ధి అనుకున్న దానికన్నా వేగంగా పెరగడం కంపెనీకి కలిసొచ్చే అంశాలు. మరో రెండేళ్లలో ఆదాయ అంచనాలు 8శాతం పెరుగుతాయయని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనావేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో నెలకొన్న ద్రవ్యలోటు సంక్షోభ పరిస్థితుల్లో కంపెనీ 40శాతం ఏయూఎం పెరిగిందనే అంశాన్ని బ్రోకరేజ్‌ సం‍స్థలు గుర్తుచేస్తున్నాయి. రేటింగ్‌ మిశ్రమంగా ఉన్నప్పటికీ, టార్గెట్‌ ధరలు అన్ని బ్రోకరేజ్‌ సంస్థలు పెంచాయి. 

ఎంకాయ్‌ గ్లోబల్‌: గతంలో కేటాయించిన బై రేటింగ్‌ను కొనసాగిస్తుంది. టార్గెట్‌ ధరను మాత్రం రూ.3,665లకు పెంచింది.
జెప్ఫారీస్‌:- బై రేటింగ్‌ను కొనసాగిస్తుంది. టార్గెట్‌ ధరను రూ.3,600లకు పెంచింది. 
మెర్గాన్‌ స్టాన్లీ:- ఈక్విల్‌ - వెయిట్‌ రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్‌ ధరను రూ.2,950లకు పెంచింది
డచ్‌ బ్యాంక్‌:- హోల్డ్‌ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్‌ ధరను రూ.2,400ల నుంచి రూ.2,700లకు పెంచింది. 
క్రిడెట్‌ శాష్యూ:- అండర్‌ఫర్‌ఫామ్‌ రేటింగ్‌ కేటాయించింది. టార్గెట్‌ ధరను రూ.1,660ల నుంచి రూ.1,930లకు పెంచింది. 

 


 



You may be interested

మధ్యప్రాచ్యమే చమురు మంటకు కారణం!

Saturday 18th May 2019

జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ ట్రేడ్‌వార్‌ కన్నా మధ్యాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలే చమురు ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ అనలిస్టు హరీశ్‌ అభిప్రాయపడ్డారు. ఈవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మూడు శాతం మేర పెరిగాయి. మధ్యప్రాచ్యంలో యూఎస్‌, ఇరాన్‌, సౌదీ, ఇతర గల్ఫ్‌ దేశాల మధ్య నెలకొన్న టెన్షన్లు చమురు ధరను మండిస్తున్నాయి. గతవారంలో సౌదీ ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. ఈ దాడులు ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన

ట్రేడ్‌ వార్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పే

Saturday 18th May 2019

అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌  క్రిస్టీనా లగార్డే ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధానికి తర్వలోనే తెరపడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు డౌన్‌సైడ్ ముప్పు తప్పదని ఆమె హెచ్చరించారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం, ఈ ఏడాది ప్రథమార్థం నుంచి అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్‌ వార్‌ అంశాలు అంతర్జాతీయ వృద్ధి రేటుపై తీవ్ర

Most from this category