News


ఈ లార్జ్‌క్యాప్స్‌ మీ పోర్టుఫోలియోలో ఉన్నాయా??

Thursday 20th February 2020
Markets_main1582191400.png-31964

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కొన్ని లార్జ్‌క్యాప్స్‌ను ప్రముఖ బ్రోకరేజ్‌లు తమ టాప్‌ పిక్స్‌గా పేర్కొన్నాయి. అలాంటి టాప్‌ లార్జ్‌క్యాప్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి...
మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సులు
1. హెచ్‌యూఎల్‌: క్యు3లో కంపెనీ రూ. 1616 కోట్ల లాభం నమోదు చేసింది. కమోడిటీల వ్యయాలు తగ్గడం కలిసివచ్చింది. స్థూల ఆర్థిక వాతావరణం ఇంకా మెరుగుపడకున్నా కంపెనీ మాత్రం మంచి పనితీరునే కొనసాగిస్తుందని అంచనా.
2. హెచ్‌డీఎఫ్‌సీ: కంపెనీ లాభం గృహ్‌ ఫైనాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌ విలీన కారణంగా ఒక్కమారుగా 296 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో 15 శాతం ఏయూఎం వృద్ధిని కంపెనీ అంచనా వేస్తోంది.
3. ఇన్ఫోసిస్‌: క్యు3 ఫలితాల సందర్భంగా భారీ డీల్స్‌ గెలుచుకోబోతున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. బీఎఫ్‌ఎస్‌ఐ మినహా ఇతర రంగాల పనితీరు బాగానే ఉంది. వ్యయనియంత్రణలు ఫలితాలనిస్తున్నాయి. 
4. ఐసీఐసీఐ బ్యాంకు: డిసెంబర్‌లో ఆల్‌టైమ్‌హై ప్రాఫిట్స్‌ ప్రకటించింది. అన్ని విభాగాల్లో లోన్‌గ్రోత్‌ బాగుంది. రాబోయే రోజుల్లో అధిక పీసీఆర్‌, మొండిపద్దులు తగ్గడం కారణంగా వడ్డీవ్యయాలు నియంత్రణలోనే ఉంటాయని అంచనా. రిటైల్‌ రుణాలు సహా అన్ని రంగాల్లో వృద్ధి బలంగా కనిపిస్తోంది.
5. భారతీ ఎయిర్‌టెల్‌: తాజాగా ధరలు పెంచడం క్యు3లో ఎబిటా పెరుగుదలకు దోహదం చేసింది. కంపెనీ ఎఫ్‌సీఎఫ్‌ పాజిటివ్‌గా ఉంది. క్యాపెక్స్‌ తగ్గడం, ఎబిటా పెరగడం.. క్రమంగా వాల్యూషన్‌ మెరుగుపరుస్తాయి.
6. ఎస్‌బీఐ: ఎన్‌సీఎల్‌టీ రికవరీలతో బలమైన ఫలితాలు ప్రకటించింది. హెచ్‌ఎఫ్‌సీ అకౌంటు, ఆర్‌బీఐ నిబంధనల కారణంగా స్లిపేజ్‌లు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. అయినా భవిష్యత్‌ బాగుంటుందని బ్రోకరేజ్‌ అంచనా.
7. మారుతీ సుజుకీ: పండుగ సీజన్‌ డిస్కౌంట్‌లు కలిసివచ్చాయని క్యు3 ఫలితాలు చూపుతున్నాయి. కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరం క్యు1 నుంచి రికవరీ బాటపట్టొచ్చని అంచనా. ఈపీఎస్‌ అంచనాలు బలంగా ఉన్నాయి.
8. ఎల్‌అండ్‌టీ: పన్నులు తగ్గడంతో లాభంలో దాదాపు 15 శాతం వృద్ధి నమోదయింది. దేశీయంగా మంచి పేరు, బలమైన పద్దు పుస్తకం, మంచి గైడెన్స్‌, స్థిరమైన ఆర్డర్లు.. కంపెనీకి పాజిటివ్‌గా మారాయి.
9. హెచ్‌సీఎల్‌ టెక్‌: అంచనాలను మించిన ఫలితాలను క్యు3లో ప్రకటించింది. అయితే గైడెన్స్‌ను మాత్రం కాస్త తగ్గించింది. జోరు మీదున్న కొత్తడీల్స్‌ కుదుర్చుకోవడం కొనసాగుతుందని తెలిపింది. 
10. అల్ట్రాటెక్‌ సిమెంట్‌: కంపెనీ ఫలితాలు పెద్దగా బాగాలేవు. అంచనాలకన్నా తక్కువగా ఉన్నాయి. కానీ రాబోయే ఏడాది, ఏడాదిన్నరలో కంపెనీ వ్యయనియంత్రణ చర్యలు ఫలితాలు ఇస్తాయని, డిమాండ్‌పెరిగి కంపెనీ జోరు చూపుతుందని బ్రోకరేజ్‌ భావిస్తోంది.
ఎడెల్‌వీజ్‌ సిఫార్సులు
నెస్లె ఇండియా. పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌; డాబర్‌ ఇండియా, టైటాన్‌ కంపెనీ, టాటా గ్లోబల్‌ కంపెనీలు క్యు3లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయని, అందువల్ల దీర్ఘకాలానికి వీటిని పరిశీలించవచ్చని తెలిపింది. You may be interested

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల నుంచి 4 స్టాక్‌ రికమెండేషన్లు

Thursday 20th February 2020

పరిమితి శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా గురువారం సూచీలు లాభ, నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఓ నాలుగు షేర్లను రికమెండ్‌ చేస్తున్నాయి.  1.బ్రోకరేజ్‌ సంస్థ: బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ షేరు పేరు: అరబిందో ఫార్మా రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.634 విశ్లేషణ: అరబిందో ఫార్మాకు చెందిన యూనిట్‌-VI యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి  వాలంటరీ యాక్షన్ ఇనిషియేటెడ్ హోదాతో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (EIR) ను అందుకోవడం కలిసొచ్చే అంశమని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది.

ఈ మూడు చిన్న షేర్లకూ రెక్కలు!

Thursday 20th February 2020

థామస్‌ కుక్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ జూమ్‌ ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మూడు స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. జాబితాలో థామస్‌ కుక్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చోటు చేసుకున్నాయి., వివరాలు చూద్దాం..  థామస్‌ కుక్‌ ఇండియా ఇటీవల కొంత కాలంగా పతన బాటలో సాగిన

Most from this category