News


కోటక్‌ బ్యాంకుపై బ్రోకరేజ్‌ల మిశ్రమ స్పందన

Wednesday 23rd October 2019
Markets_main1571815957.png-29081

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై బ్రోకరేజ్‌లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి. క్యు2లో బ్యాంకు బలమైన ప్రాఫిట్‌గ్రోత్‌ నమోదు చేసినా, ఆస్తుల నాణ్యత మాత్రం క్షీణించింది.

ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి...
- క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1450. బ్యాంకు ఎర్నింగ్స్‌ వృద్ధి మందగించింది. ఎన్‌ఐఎం పెరగడం పాజిటివ్‌ అంశం. ప్రస్తుతం తన ఫార్వర్డ్‌ పీబీ విలువకు 3.9 రెట్ల వాల్యూషన్‌ వద్ద షేరు ట్రేడవుతోంది. 
- ఎమ్‌కే  గ్లోబల్‌: హోల్డ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1720. ఆర్‌బీఐతో ప్రమోటర్ల తకరారు ఇంకా ముగియకపోవడం, వాల్యూషన్లు ఎక్కువగా ఉండడం షేరు రేటింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి.
- యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1725. బ్యాంకు బలమైన కోర్‌ ఎర్నింగ్స్‌ ప్రదర్శన చూపుతోంది. సమీప భవిష్యత్‌లో కొంత కన్సాలిడేషన్‌ ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బ్యాంకు గణనీయమైన మార్కెట్‌ వాటా పొందుతుందని అంచనా.
క్యు2లో బ్యాంకు ఎన్‌ఐఎం 4.61 శాతం వృద్ధి చెందింది. ఇదే సమయంలో స్థూల ఎన్‌పీఏలు 2.32 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు రూ. 407 కోట్లను చేరాయి. 



You may be interested

ఈక్విటీలంటే భయామా..? అయితే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనండి.!

Wednesday 23rd October 2019

భవిష్యత్తులో ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగవచ్చనే ఆందోళన వ్యక్తం చేసే ఇన్వెస్టర్లు సావరిన్‌ పసిడి బాండ్లను కొనుగోలు చేయవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు పసిడి స్పాట్‌, ఫ్యూచర్ల ర్యాలీ నుంచి వచ్చే లాభాల కంటే ఎక్కువ రాబడులను సావరిన్‌ బాండ్లు ఇస్తాయని విశ్లేషకులంటున్నారు. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అతిగా అంచనా వేయబడ్డాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో పసిడిని జోడించుకోవడం మంచిది.’’ అని ఆశికా

ఝున్‌ఝున్‌వాలా వాటాను పెంచుకున్న షేర్లివే!

Wednesday 23rd October 2019

   బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా సెప్టెంబర్‌ నెలలో 5 కంపెనీలలో తన వాటాను పెం‍చుకోగా, 15 కంపెనీలలో తన వాటాను స్థిరంగా ఉంచుకున్నారని ఏసీఈ ఈక్విటీ డేటా పేర్కొంది. ఫెడరల్ బ్యాంక్, వీఐపీ ఇండస్ట్రీస్, అగ్రో టెక్ ఫుడ్స్, ఎన్‌సీసీ, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్ కంపెనీలలో ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌ తన వాటాను పెంచుకున్నారు. కాగా ఈ కంపెనీల షేరు విలువ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9-40

Most from this category