News


వీటికి ‘సెల్‌’ రేటింగ్‌ కొనసాగింపు

Tuesday 12th November 2019
Markets_main1573498532.png-29510

ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం మూడు స్టాక్స్‌కు సెల్‌ రేటింగ్‌ కొనసాగించాయి. కాకపోతే గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరను పెంచడం వీటికి కాస్తంత ఉపశమనం. 

 

ఇప్కా ల్యాబొరేటరీస్‌
సీఎల్‌ఎస్‌ఏ ఈ స్టాక్‌కు విక్రయించండి (సెల్‌) రేటింగ్‌ను కొనసాగించింది. కాకపోతే గతంలో టార్గెట్‌ కింద రూ.810 ఇవ్వగా, తాజాగా దీన్ని రూ.950కు పెంచింది. నిర్వహణ ప్రయోజనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేస్తోంది. కార్పొరేట్‌ పన్ను భారీ తగ్గింపుతో 2020-22 మధ్య ఈపీఎస్‌ అంచనాలు 10-18 శాతం వరకు అదనంగా పెరుగుతాయని పేర్కొంది. అమెరికాలో పరిష్కారం జాప్యం కావడంపై ఆందోళనతోనే ఉన్నట్టు తెలిపింది. ఈ కంపెనీ క్యూ2 కన్సాలిడేటెడ్‌ లాభం 63.3 శాతం వృద్ధితో 193.5 కోట్లకు చేరగా, ఆదాయం 26.9 శాతం వృద్ధితో రూ.1,284కు చేరుకుంది. పన్ను, తరుగుదలకు ముందస్తు ఆర్జన (ఎబిట్డా) 52.5 శాతం పెరిగి రూ.266 కోట్లుగా ఉంది. ఎబిట్డా మార్జిన్‌ 20.7 శాతం. 

 

భారత్‌ ఫోర్జ్‌
కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈ స్టాక్‌కు సెల్‌ రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్‌ను మాత్రం రూ.365 నుంచి రూ.375కు పెంచింది. సైక్లికల్‌ కంపెనీల లాభాలపై ప్రభావం ఉంటుందని.. అవుట్‌లుక్‌ సవాళ్లతో కూడుకుని ఉందని పేర్కొంది. దేశీయ వ్యాపారం, ఆయిల్‌, గ్యాస్‌ విభాగం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించినట్టు తెలిపింది. కంపెనీ ఈపీఎస్‌ అంచనాలను 2020-22 మధ్య 9-11 శాతం మేర తగ్గించింది. సైక్లికల్‌ వ్యాపారంలో భారీ క్షీణతను రిస్క్‌గా పేర్కొంది. రెండో త్రైమాసికంలో కంపెనీ లాభం 7.6 శాతం పెరిగి రూ.245 కోట్లకు చేరగా, ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం తగ్గి రూ.1,259 కోట్లకు పరిమితమైంది. ఎగుమతుల ఆదాయం సైతం వార్షికంగా 18.1 శాతం తగ్గి రూ.772 కోట్లుగా ఉంది.  

 

ఐచర్‌ మోటార్స్‌
ఈ స్టాక్‌కు కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సెల్‌ రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ధరను మాత్రం గతంలో పేర్కొన్న రూ.15,000 నుంచి రూ.17,000కు పెంచింది. అమ్మకాలు బలహీనంగా ఉండడంతో ఎబిట్డా సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 24 శాతం క్షీణించింది. అదే సమయంలో వ్యయాలు గణనీయంగా పెరగడం, ఆర్థిక మందగమనంతో కంపెనీ ఆర్‌ఈ తగ్గినట్టు కోటక్‌ పేర్కొంది. బీఎస్‌-6 ఇంజన్లకు మారుతుండడంతో 2020-21లో అమ్మకాలపై ఒత్తిడి ఉంటుందని, నిబంధనల అమలు వ్యయాలు, డిమాండ్‌ తగ్గడం వంటివి మార్జిన్లపై ఒత్తిళ్లను పెంచుతాయని తెలిపింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ లాభం వార్షికంగా 18.5 శాతం పెరిగి రూ.570 కోట్లుగా ఉంటే, ఆదాయం మాత్రం 9 శాతం క్షీణించి రూ.2,181 కోట్లుగా నమోదైంది. You may be interested

ఈ స్టాక్స్‌ మీకు నచ్చుతాయా..?

Tuesday 12th November 2019

దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల నిర్వహణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ అక్టోబర్‌ మాసంలో ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వరంగ సంస్థలు, ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఐటీసీలో కోటి షేర్లు, అలాగే, ఎన్‌హెచ్‌పీసీలోనూ కోటి షేర్ల చొప్పున కొనుగోలు చేసింది. ఇంకా ఇతర కొనుగోళ్లను పరిశీలించినట్టయితే...   ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా, ఆర్‌ఈసీ, బజాజ్‌ కార్ప్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, నైవేలీ లిగ్నయిట్‌, సిప్లా, అంబుజా సిమెంట్స్‌, ఫెడరల్‌ బ్యాంకు, టెక్స్‌మాకో రైల్‌, టాటా

బ్రోకరేజ్‌ల టాప్‌5 సిఫార్సులు

Monday 11th November 2019

వచ్చే 8 నుంచి 10 నెలల్లో 11-17 శాతం రిటర్న్‌లను ఇవ్వగలిగే టాప్‌ 5 స్టాకులను బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్నాయి. ఆ టాప్‌ 5 స్టాకులు ఇవే....   బ్రోకరేజి: ఆనంద్‌ రాఠి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: కొనచ్చు; టార్గెట్‌: రూ. 1,610; రిటర్న్‌: 11.4 శాతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ వ్యాపారం, గత ఆరేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ ఆదాయం  గత ఆరేళ్లలో ఏడు రెట్లు పెరగగా, లాభం 14 రెట్లు

Most from this category