News


ఐఓసీపై బ్రోకరేజిల ‘బై’ కాల్‌

Friday 1st November 2019
Markets_main1572591310.png-29285

దేశీయ ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 83 శాతం తగ్గి రూ. రూ.564 కోట్లుగా నమోదైంది. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో ఈ కంపెనీ షేరు శుక్రవారం సెషన్లో 4 శాతం మేర నష్టపోయింది. అయినప్పటికి ఈ కంపెనీ షేరుపై బై కాల్‌ను బ్రోకరేజిలు కొనసాగిస్తున్నాయి. బై కాల్‌ను కొనసాగిస్తున్న విదేశీ బ్రోకరేజిలు..
నోమురా: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 170
క్యూ 2లో కంపెనీ రిఫైనింగ్‌ మార్జిన్‌ తగ్గింది. దీని ప్రభావం క్యూ3లో కూడా ఉండవచ్చు. కానీ ఐఎంఓ 2020 గడువుతేది దగ్గరకొస్తుండడంతో, కంపెనీ రిఫైనింగ్‌ మార్జిన్‌ రికవరి అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలలోని తన వాటాను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ కంపెనీ లాభపడే అవకాశం ఉంది.
జెఫ్ఫరీస్‌: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 215 నుంచి టార్గెట్‌ ధరను రూ. 200 కు తగ్గించింది. 
ఆర్థిక సంవత్సరం 19-21 ఎబిట్డా అంచనాలను జెఫ్ఫరీస్‌ 6-8 శాతం వరకు తగ్గించింది. కంపెనీ నిల్వలు అంచనాల కంటే అధికంగా ఉన్నప్పటికి, ఇతర ఆదాయం తగ్గడం, వడ్డీ ఖర్చులు అంచనాల కంటే అధికంగా ఉండడం వంటి అంశాలు ఈ కంపెనీకి ప్రతికూలంగా ఉన్నాయని తెలిపింది. 
మధ్యాహ్నం 12.14 సమయానికి ఐఓసీ(ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌) షేరు విలువ 2.3 శాతం నష్టపోయి రూ. 143.00 వద్ద ట్రేడవుతోంది.  



You may be interested

3ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం

Friday 1st November 2019

నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 3ఏళ్ల గరిష్టానికి చేరింది. ఈ అక్టోబర్‌లో నిరుద్యోగిత రేటు 8.50శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఇందుకు కారణమైనట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 7.2శాతంగా ఉంది. ఇదే సెప్టెంబర్‌లో మౌలికరంగంలో 5.2శాతం క్షీణించింది. దశాబ్ధ కాలంలో ఇదే అత్యంత క్షీణత కావడం గమనార్హం. ఎనిమిది మౌలిక రంగాల్లో ఏడు ప్రతికూల వృద్ధిని

రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ ఎఫెక్ట్‌: యస్‌బ్యాంక్‌ 7శాతం డౌన్‌

Friday 1st November 2019

నేడే క్యూ2 ఫలితాల ప్రకటన  ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ యస్‌బ్యాంక్‌ షేరుపై అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను కేటాయించడంతో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 7శాతం నష్టపోయింది. యస్‌ బ్యాంకు నేడు బీఎస్‌ఈలో రూ.71.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నేడు(నవంబర్‌ 01) బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల కానునుండటం కూడా షేరు ట్రేడింగ్‌పై ఒత్తిడిని పెంచింది.

Most from this category