News


బ్రోకరేజి బై రేటింగ్‌ ఇచ్చిన 10 స్టాకులు

Friday 21st June 2019
Markets_main1561110314.png-26476

సిఫార్సు: యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌
పినిక్స్‌ మిల్స్‌: కొనుగోలు; టార్గెట్‌ ధర: రూ. 800
పినిక్స్‌ మిల్స్‌ లి.(పీఎమ్‌ఎల్‌)కు దేశంలోని రియల్‌ ఎస్టెట్‌ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం  ఉంది. దీంతో పాటు రిటైల్‌ మాల్‌ నిర్వహణలో అతి పెద్దది. రిటైల్‌, ఆఫిస్‌, రెసిడెన్సియల్‌ విభాగాలలో కూడా పనిచేస్తోంది. ఇప్పుడు వార్షిక ఆస్తులకు ఐదు వేరు వేరు పట్టణాలలో 49 లక్షల చదరపు అడుగుల మాల్‌ స్థలాన్ని, 9.6లక్షల చ.అ గల ఆఫిస్‌ స్థలాన్ని కలుపుకోడానికి సిద్దపడుతోంది. దీంతో పాటు 27లక్షల చ.అ రిటైల్‌, ఆఫిస్‌ స్థలం కోసం ప్రణాళికలు రిచిస్తోంది. 
రైట్స్‌: కొనుగోలు; టార్గెట్‌ ధర: రూ.343
 రైట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌) దేశంలోని మైలిక రంగంలో కన్సల్టన్సీ, ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది. కంపెనీ 2018లో జులైలో స్టాక్‌ మార్కెట్‌లో నమోదు చేసుకున్న తర్వాత కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ 35 శాతం పెరిగింది. గత తొమ్మిది సంవత్సరాల నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత పనులు దక్కుతుండడంతో సంస్థ వృద్ధి నిలకడగా ఉంది. కంపెనీ ఆదాయం/లాభాల స్థూల వార్షిక వృద్ధిరేటు(సీఏజీఆర్‌) ఏడాదికి 10/15 శాతంగా ఉంది. 2019 ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి సంస్థ రూ.2,300కోట్ల నికర విలువను కలిగి ఉంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మౌలిక రంగంలో 1.44 లక్షల కోట్లను ఖర్చు పెట్టనుందనే వార్తల నేపథ్యంలో రైట్స్‌కు రైల్వే/మెట్రో/రోడ్డు నిర్మాణాలలో అవకాశం దొరకవచ్చు.
సిపార్సు: ఐడీబీఐ క్యాపిటల్‌ బ్రోకరేజి
జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌: కొనుగోలు; టార్గెట్‌ ధర రూ.620
లైఫ్‌ సైన్సెస్‌, ఏకికృత పార్మా రంగంలో ఉన్న జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ రేడియో పార్మా, అలర్జీ థెరపీలపై దృష్ఠి పెట్టింది. దీంతోపాటు స్టెరైల్‌ ఇంజెక్ట్‌బుల్‌, ఇతర పెరిడిన్‌ ఆధారిత, ఎసిటైల్‌ ఆధారిత ఉత్పత్తులకు చీఫ్‌ మార్కెటైజర్‌గా ఉంది. ఆర్థిక సంవత్సరం 2016-19 మధ్య కాలంలో జనరిక్స్‌ మెడిసిన్‌, ప్రత్యేక ఫార్మ విభాగం, అందుబాటు ధరలలోని రసాయన వ్యాపారాలలో ముఖ్య లభ్ధిదారుగా జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎదిగింది. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికను జారి చేయడంతో ఈ సంస్థ జనరిక్‌ వాపారంలో 7శాతం ఆదాయం తగ్గవచ్చు. వివిధ విభాగాల విశ్లేషణల మొత్తం(ఎస్‌ఓటీపీ) పధ్దతిని అనుసరించి ఈ సంస్థకు ‘కొనుగోలు’ రేటింగ్‌ను , టార్గెట్‌ ధరను రూ. 620గా ఐడీబీఐ క్యాపిటల్‌ నిర్ణయించింది.
సిఫార్సు: పిలిప్‌ క్యాపిటల్‌ ఇండియా బ్రోకరేజి
కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌: కొనుగోలు; టార్గెట్‌ ధర రూ. 670
కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌(కేపీపీ) మౌలిక రంగంలో ముఖ్యమైన సంస్థ. ఈ కంపెనీ మానేజ్‌మెంట్‌కు  కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి లాభాలను , వర్కింగ్‌ క్యాపిటల్‌ను పెంచడంలో సామర్య్ధం ఉంది. కానీ ఈ సం‍స్థ ఎసెట్‌ ఓనర్‌షిప్‌, నాన్‌ కోర్‌ శాఖలలో పెట్టుబడులను విస్తరించడం ఒక పెద్ద ప్రతికూలతగా చెప్పవచ్చు. కంపెనీ 2019-22 ఆర్థిక కాలం సంపాదనలో సీఏజీఆర్‌ 19 శాతం పెరుగుతుందని అంచనా వేశామని పిలిప్‌ క్యాపిటల్‌ ఇండియా తెలిపింది. కేపీపీ  ట్రాన్సిమిషన్‌ అండ్‌ డిస్ట్రీబ్యూషన్‌(టీ అండ్‌ డీ) పరికరాలు, మౌలిక రంగంలో ముఖ్యమైనదిగా భావిస్తున్నమని వివరించింది.
సిఫార్సు: ఐసీఐసీఐ సెక్యూరిటీష్‌ బ్రోకరేజి 
వరుణ్‌ బెవరేజస్‌: కోనుగోలు; టార్గెట్‌ ధర రూ.1,106
సాప్ట్‌ డ్రింక్‌ల విభాగంలో వరణ్‌ బెవరేజస్‌ బలంగా ఉంది. పశ్చిమ, దక్షిణ భారతదేశాలలోని పెప్సికో ప్రాంచైజీలను పొందడంతో సంస్థ ఆర్థిక ఏకికృత సూచిలో లాభపడుతుంది.  పతన్‌కోట్‌ ప్లాంట్‌ లాభాలను, ఆస్థిని పెంచుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీష్‌ తెలిపింది. సీవై(కరెంట్‌ ఇయర్‌) 2018-సీవై21 కాలంలో వరుణ్‌ సీఏజీఆర్‌ సంపాదన 35 శాతం దాటుతుందని అంచనా వేసింది.  డిస్‌కౌంటెడ్‌ క్యాష్‌ ఫ్లో(డీసీఎఫ్‌) పధ్ధతిని అనుసరించి  ‘కొనుగోలు’ రేటింగ్‌ను ఇచ్చి, టార్గెట్‌ ధరను రూ.1,106గా నిర్ణయించింది. 
సిఫార్సు: నిర్మల్‌ బాంగ్‌ బ్రోకరేజి
కాడిలా హెల్త్‌ కేర్‌: కొనుగోలు; టార్గెట్‌ ధర రూ. 395
20 x ఆర్ధిక సంవత్సరం 2021 సంపాదన ఆధారంగా కాడిలా హెల్త్‌ కేర్‌కు కొనుగోలు రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ.395గా నిర్మల్‌ బాంగ్‌ నిర్ణయించింది. సంపాదన వృద్ధి వచ్చే రెండేళ్లలో ఉండకపోయినప్పటికి ఈ స్టాక్‌ తన గరిష్ఠ ధర నుంచి 30శాతం తగ్గించడం వలన కంపెనీ విలువ బాగుందని తెలిపింది.
చాలెట్‌ హోటల్స్‌: కొనుగోలు; టార్గెట్‌ ధర: రూ. 395
అద్దేకికిచ్చే, ఆతిథ్య రంగంలోని ఆస్థుల ఆధారంగా చాలెట్‌ హొటల్స్‌కు కొనుగోలు రేటింగ్‌ను ఇచ్చి, టార్గెట్‌ ధరను రూ.395గా నిర్మల్‌ బాంగ్‌  నిర్ణయించింది. ‘ఈ స్టాక్‌ కు ఉన్న అనుకూలతలు
1)సరియైన డిమాండ్‌-సరఫరాతో హొటల్‌ సెక్టార్‌ వృద్ది చెందుతోంది. ఇది ఆక్యూపెన్సి ధరను, సగటు గది ధరను నడిపిస్తాయి. 
2)ఈ హొటల్‌లు మంచి లొకేషన్‌లలో ఉండడంతో ఆక్యూపెన్సీ పెరగడానికి అవకాశం ఎక్కువ
3) ప్రమోటర్లల నుంచి బలమైన మద్ధతు ఉండడం( కే.రాహేజ అనుభవజ్ఞుడైన రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌)
4)నికర అప్పులు, ఈక్విటీల నిష్పత్తి 0.83x 2019 ఆర్దికసంత్సరం వద్ద బ్యాలెన్స్‌ సీట్‌ అనుకూలంగా  ఉండడం.
5) కార్యచరణ ధన ప్రవాహం వృద్ధి చెందుతుందడంతో క్యాపిటల్‌ ఎక్స్‌పెండెచర్స్‌లో సహాయపడతాయనే అంచనా’ అని తెలిపింది 
సిఫార్సు: జేఎమ్‌ ఫైనాన్సియల్‌ బ్రోకరేజి
ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ : కొనుగోలు; టార్గెట్‌ ధర: రూ. 160
ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ ఆల్కాహాల్‌ తయారిలో, బీర్‌ల తయారిలో,  వ్యర్థ నీటిని మంచి నీటిగా మార్చే ప్రక్రియలో పనిచేస్తోంది. కంపెనీ మొదటి జనరేషన్‌లో ఇథనాల్‌ సాంకేతికతో లీడర్‌గా ఎదిగింది. దీని తరువాత సెకెండ్‌ జనరేషన్‌ లిగ్నో సెల్యూలోజిక్‌ ఇథనాల్‌ కార్యక్రమాన్ని విజయవంతగా మొదలు పెట్టింది. కంపెనీ 1జీ, 2జీలా ద్వారా 2019 ఆర్థిక సంవత్సరంలో  రూ.1,394 కోట్ల ఇన్‌ఫ్లోలను పొందగలిగింది. ఇండియాలోని 1జీ, 2జీ మార్కెట్‌లో కంపెనీకి 60 శాతం వాటాలను కలిగి ఉంది. 2019-21 ఆర్థిక సంవత్సరపు సంపాదనలలో కంపెనీ 17.8శాతం ఆదాయం  , 29.1 శాతం పీఏటీ సీఏజీఆర్‌లను సాధిస్తుందని జేఎమ్‌ ఫైనాన్సియల్‌ అంచనా వేసింది.
నాట్కో పార్మా: కొనుగోలు; టార్గెట్‌ ధర: రూ.640
1)‘కంపెనీ మార్జిన్‌లు మిగిలిన కంపెనీల కంటే బాగున్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఈబీఐటీడీఏ మార్జిన్‌ 33.6 శాతం, నికర లాభాలు 28.1 శాతంగా ఉన్నాయి. 
2)అమెరికాలోని తక్కువ ప్రమాదం గల వ్యాపార విధానాంలో ఈ కంపెనీకి అక్కడి మార్కెటింగ్‌ భాగస్వామియే వ్యాజ్యాలను, ఏఎన్‌డీఏ ఫైలింగ్‌లను చూసోకోనుంది.
3)బలమైన బ్యాలెన్స్‌ సీట్లు’ అని జేఎమ్‌ ఫైనాన్సియల్‌ వివరించింది.
సిపార్సు: ఎడెలవైస్‌ బ్రోకరేజి
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: కొనుగోలు; టార్గెట్ ధర: రూ. 880
ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో బలమైన వారసత్వంతో ఈ కంపెనీ ఎటువంటి ఆస్థి నాణ్యత సంఘటనలు లేకుండా అధిక సంఖ్యలో రుణాలను ఇస్తోంది. 30 శాతం ఆస్ధి విలువను పెంచుకోవడంతో పాటు, ఆస్థీ సీఏజీఆర్‌ మరికొద్ది కాలం వరకు స్థిరంగా ఉండనుందని ఎడెలవైస్‌ తెలిపింది. 

 You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలో బజాజ్‌ ఫైనాన్స్‌ రూటు వేరు!

Friday 21st June 2019

ఇండియా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ) రుణాల చెల్లింపులు జరగక ఎన్‌బీఎఫ్‌సీ రంగం కుదేలయిపోతుంటే బజాజ్‌ ఫైనాన్స్‌ మాత్రం ఈ ఏడాది టాప్‌ స్టాక్‌లో ఒకటిగా నిలిచింది.  2018 అగష్టు నుంచి ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు 25 శాతం మేర నష్టపోయాయి. కొన్ని కంపెనీలు 89శాతం నష్టపోయాయి కూడా. కానీ బజాజ్‌ ఫైనాన్స్‌ 36శాతం లాభంతో సెన్సెక్స్‌లో ముందుంది. వినియోగ ఆధారిత రంగాలలో రుణాలను ఇవ్వడం, రూరల్‌, మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు

3 ఫార్మా షేర్లను సిఫార్సు చేసిన డాయిష్‌ బ్యాంక్‌

Friday 21st June 2019

నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఒకశాతం క్షీణించినప్పటికీ.., ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ డాయిష్‌ బ్యాంక్‌ ఫార్మా రంగం నుంచి 3 షేర్లును సిఫార్సు చేస్తుంది. ఫార్మా రంగ వ్యాపారం నుంచి రానున్న రెండేళ్లలో దేశీయ మొత్తం ఆదాయంలో 13శాతం సీఏజీఆర్‌ను అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఇండియా కంపెనీలకు ప్రిస్క్రిప్షన్ వాటా లాభాలు కొనసాగుతాయి. లాభదాయకమైన ఆపరేటింగ్‌ పరమితితో మరో 3ఏళ్లలో కంపెనీల ఆదాయ వృద్ధి 20శాతం పెరుగుతుందని  బ్రోకరేజ్‌

Most from this category