News


ఫలితాల తర్వాత టీసీఎస్‌ షేరు చాలా ఖరీదు: బ్రోకరేజ్‌లు

Monday 20th January 2020
Markets_main1579512854.png-31051

దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.  ప్రకటించిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే షేరు విలువ అధికంగా ఉంది. కాబట్టి ఈ షేరు కొనుగోలు పట్ల కొంత అప్రమత్తత వహించాలని దేశీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నాయి. 

ఈ క్యూ3లో రూ. 8,118 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన రూ.8,105 కోట్ల నికర లాభంతో పోలిస్తే 0.16శాతం తక్కువ. అలాగే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆదాయ వృద్ధి సాధించే అవకాశం లేదని టీసీఎస్‌ ముందస్తు అంచనాల్లో స్పష్టంగా తెలిపింది. త్రైమాసిక ఫలితాలు, గైడెన్స్‌ మార్కెట్‌ వర్గాలను ఆకట్టుకోకపోవడంతో సోమవారం షేరు నష్టాల బాట పట్టింది. 

ఈ నేపథ్యంలో కంపెనీ షేరుపై వివిధ బ్రోకరేజ్‌ సంస్థల విశ్లేషణలను ఇప్పుడు చూద్దాం...

ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌:- గతంలో షేరుకు కేటాయించిన ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాము. టార్గెట్‌ ధరను రూ.2,175గా యధావిధిగా ఉంచుతున్నాం ‘‘ఆర్డర్లను పూర్తి చేసే అంశంలో టీసీఎస్‌ అత్యు‍త్తమ సామర్ధ్యాలను కలిగి ఉంది. అయితే షేరు విలువ అధికంగా ఉండటం, మార్జిన్ల పెంచుకునే అవకాశాలు లేకపోవడం నిరుత్సాహపరించింది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఆర్డర్లను దక్కించుకోవడంద్వారా  మధ్యంతర కాలంలో కోలుకోవచ్చని ఆశిస్తున్నాము.

హెచ్‌డీఎప్‌సీ సెక్యూరిటీస్‌:- ఇంతకు ముందు షేరుకు కేటాయించిన ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను యధావిధిగా ఉంచడంటో పాటు షేరు టార్గెట్‌ ధర రూ.2,025గానే కొనసాగిస్తున్నాము. బ్రెగ్జిట్‌ లాంటి రాజకీయ ఉద్రిక్తతల కారణంగా డిమాండ్‌ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 

కంపెనీ మొత్తం ఆదాయం రూపాయి పరంగా ఐఎఫ్‌ఆర్‌ఎస్ వ్యవస్థలో 6.7 శాతం పెరిగి రూ. 39,854 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 4.3 శాతం పెరిగి రూ .9,564 కోట్లకు చేరుకుంది. 

కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌:- గతంలో కేటాయించిన ‘‘తగ్గింపు’’ రేటింగ్‌ను కొనసాగించింది. అయితే, సరైన వాల్యూవేషన్‌తో పోర్ట్‌ఫోలియోలో టీసీఎస్‌ తప్పనిసరిగా ఉండాలి అని తెలిపింది. ‘ఏదిఏమైన ప్రస్తుత షేరు అధిక వ్యాల్యూవేషన్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాబట్టి షేరు కొనుగోలుకు మరింత సమయం తీసుకుంటే మంచిది.

మధ్యాహ్నం గం.3:00లకు షేరు మునుపటి ముగింపు ధర(రూ.2218.05)తో పోలిస్తే రూ.2.75శాతం నష్టంతో రూ.2158.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

రికార్డుస్థాయి నుంచి పతనం..!

Monday 20th January 2020

సెన్సెక్స్‌ 416 పాయింట్లు డౌన్‌ 128 పాయిం‍ట్లు కోల్పోయిన నిఫ్టీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు ఊపందుకోవడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్‌ 416 పాయింట్లు కోల్పోయి 41,529 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128 పాయింట్లు క్షీణించి 12,224 వద్ద స్థిరపడింది. అయితే తొలుత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 42,274 వద్ద సెన్సెక్స్‌, 12,430 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. తదుపరి సమయం గడిచేకొద్దీ అమ్మకాలు

నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు జూమ్‌

Monday 20th January 2020

చెన్నై పెట్రోలియం హైజంప్‌ గోవా కార్బన్‌ అప్పర్‌ సర్క్యూట్‌ పాలీకేబ్‌ ఇండియా కొత్త గరిష్టం తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు  పతన బాట పట్టాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో సెన్సెక్స్‌ 333 పాయింట్లు పతనమై 41,612ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 12,245 వద్ద ట్రేడవుతోంది. ఈ పరిస్థితుల్లోనూ విభిన్న వార్తల కారణంగా చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌, గోవా కార్బన్‌, పాలీకేబ్‌ ఇండియా

Most from this category