20 మిడ్‌క్యాప్స్‌పై బ్రోకరేజ్‌ల సిఫార్సులు
By Sakshi

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20 వ తేదిన కార్పోరేట్ ట్యాక్స్‌ను 34.9 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుస రెండు (సెప్టెంబర్ 20,22) సెషన్లలో ఈక్విటీ మార్కెట్లు భారీ స్థాయిలో ర్యాలీ చేశాయి. ఈ రెండు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్లు పెరిగింది. నిఫ్టీ 50, సెన్సెక్స్ 8 శాతం చొప్పున లాభపడగా, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 9.5 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 7 శాతం ఎగిశాయి. కానీ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో తర్వాత సెషన్లలో ఈ సూచీలు 1-2 శాతం దిద్దుబాటుకు గురవ్వడం గమనార్హం. సాధరణంగా మార్కెట్లు భారీగా పెరిగినప్పుడు దిద్దుబాటును ఊహించుకోవచ్చని విశ్లేషకులు తెలిపారు. కానీ మార్కెట్లో మొన్న జరిగిన ర్యాలీ గత ర్యాలీల కంటే బలంగా ఉందని విశ్లేషకులు తెలిపారు. వివిధ బ్రోకరేజీల మిడ్‌క్యాప్ స్టాక్ సిఫార్సులు:
మిడ్‌క్యాప్‌లు నిలకడగా ఉండగలవా?
ఈ ఏడాది ప్రారంభంనుంచి సెప్టెంబర్ 19 వరకు గల కాలాన్ని పరిశీలిస్తే, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 13 శాతం చొప్పున నష్టపోయాయి. అదే గత ఏడాది ఫిబ్రవరి 1 2018 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 19 వరకు గల కాలంలో, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 23 శాతం మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 32 శాతం మేర పతనమయ్యాయి. కానీ మొన్న చేసిన ర్యాలీ తర్వాత మిడ్ క్యాప్ స్టాకులు నిలకడగా రాణించగలవా? ఈ సమయంలో మిడ్ క్యాప్ స్టాకులను కొనుగోలు చేయవచ్చా? ఈ ర్యాలీతో ఈ ఇండెక్స్‌లో ఏర్పడిన నష్టాలు తిరిగి కవర్వుతాయా? అనే అంశాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి.
తగ్గిన కార్పోరేట్ ట్యాక్స్ కారణంగా కంపెనీల లాభాలు, ఆర్థిక వృద్ధి అంచనాలు మధ్యస్థ కాలానికి గాను బాగున్నాయని, ప్రస్తుతం నాణ్యమైన మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లను కొనుగోలు చేయడం మంచిదేనని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని ఆర్థిక చర్యలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.
మిడ్‌క్యాప్స్‌లో పతనదశ పూర్తయ్యింది..
‘ప్రస్తుతం మిడ్‌క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ప్రయత్నించవచ్చు. ఈ రంగంలోని స్టాకులు ఇప్పటికే అధ్వాన్న స్థితిని ఎదుర్కొన్నాయి. కార్పోరేట్ ట్యాక్స్ కట్‌ను ప్రభుత్వం ప్రకటించక ముందే, మిడ్‌క్యాప్స్ స్టాక్స్‌లో పెట్టుబడులు రావడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇవి ఆకర్షణీయమైన వాల్యుషన్ వద్ద ట్రేడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మిడ్‌క్యాప్స్‌లో లాభాల రికార్డు బాగున్న, మేనేజ్మెంట్ బలంగా ఉన్న అధిక నాణ్యత కలిగిన స్టాకులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు’ అని గ్లోబ్ క్యాపిటల్, రీసెర్చ్ హెడ్ హీమాన్సు గుప్తా అన్నారు. కానీ వార్తలకు అనుగుణంగా అనిశ్చితిలో కదిలే స్టాకులకు ఎప్పుడూ దూరంగా ఉండాలని ఆయన సలహాయిచ్చారు.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు గత కొన్ని సెషన్ల నుంచి రికవరి సంకేతాలనిస్తున్నాయని రిలయన్స్ సెక్యురిటీస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ అరుణ్ కుమార్ అన్నారు. ‘ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇతర షేర్లతో పోలిస్తే చౌకగా ఉండి, తక్కువగా నష్టపోయే షేర్లను తమ పోర్టుపోలియోలకి కలుపుకోవాలి. వచ్చే రెండుమూడేళ్ల కాలానికి గాను వచ్చే కొన్ని నెలలో నాణ్యమైన స్టాకులను కూడబెట్టుకోవాలి’ అని ఆయన సలహాయిచ్చారు.
మందగమన ప్రభావం కొనసాగుతుంది..
వచ్చే రెండు త్రైమాసికాలకుగాను రెండెంకల లాభాల వృద్ధిని విశ్లేషకులు అంచనావేస్తున్నాప్పటికి, లాభాలు, అమ్మకాల దృష్ట్యా ఆర్థిక మందగమన ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. రాయితీలను ప్రకటిస్తున్నప్పటికి వాహనాల విక్రయాలు గత కొన్ని నెలల నుంచి తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికిగాను దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇవన్ని ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న మందగమనాన్ని తెలుపుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.
మారుతున్న లాభాల అంచనాలు..
‘కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించడం వలన పెట్టుబడుల గమ్యస్థానంగా ఇండియా మారుతుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక ప్రయోజనాలు వ్యవస్థలో సెంటిమెంట్‌ను, వృద్ధి పథాన్ని రానున్న రోజుల్లో మారుస్తాయని అంచనావేస్తున్నాం. మాకు పూర్తి స్పష్టత వచ్చాక లాభాల వృద్ధి అంచానాలు మారుస్తాం. వచ్చే 12-18 నెలలకు గాను మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. అంతేకాకుండా వ్యవస్థీకృత సంస్కరణలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం’ అని ప్రభుదాస్ లిలాధర్ అన్నారు.
‘కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడంతో వృద్ధి తిరిగి పుంజుకుంటుంది. అంతేకాకుండా వ్యవస్థలో సెంటిమెంట్ తిరిగి బలపడుతుంది. ఈ చర్య వలన ఇండియా కార్పోరేట్ వరల్డ్‌లో నగదు లభ్యత తక్షణమే పెరుగుతుంది. ఇది రుణాలను తగ్గించుకోడానికైనా లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టి కంపెనీ సామర్ధ్యాన్ని పెంచుకోడానికైనా ఉపయోగపడుతుంది. దీంతోపాటు అక్టోబర్ 1 లేదా ఈ తేది తర్వాత ఏర్పాటయి, 2023 మార్చి నాటి ఉత్పతిని ప్రారంభించే తయారిరంగ కంపెనీలపై కార్పోరేట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం 15 శాతం తగ్గించడంతో పెట్టుబడులు పెరుగుతాయి’ అని ఐసీఐసీఐ డైరక్ట్ తెలిపింది. ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించడంతో వచ్చే ఏడాది కాలానికి గాను నిఫ్టీ టార్గెట్ అంచనాలను 12,300-13,500 కు ఈ బ్రోకరేజి పెంచింది.
‘ప్రస్తుతానికి మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నప్పటికి కొంత జాగ్రత్తతో కూడా ఉన్నాం. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడంతో ఆర్థిక సంవత్సరం 20-21 కి గాను నిఫ్టీ ఈపీఎస్(షేరుపై లాభం) అంచనాలను 6.5 శాతం పెంచాం. ఏడాది కాలానికి గాను నిఫ్టీ టార్గెట్ అంచనాలను 13,100 పెంచాం’ అని యాంటిక్యూ స్టాక్ బ్రోకింగ్ తెలిపింది.
యాంటిక్యూ స్టాక్ బ్రోకింగ్:
టీవీఎస్ మోటర్స్, ఫెడరల్ బ్యాంక్, గుజరాత్ గ్యాస్, నాట్కో ఫార్మా, కజరియా సిరమిక్స్, నేషనల్ అల్యుమినియం, జాన్సన్ కంట్రోల్, సీసీఎల్ ప్రోడెక్ట్స్ ఇండియా, మొయిల్, ట్రాన్స్పోర్ట్ కార్ప్ ఆఫ్ ఇండియా, ధనుకా అగ్రిటెక్.
ఐసీఐసీఐ డైరక్ట్:
రామ్‌కో సిమెంట్, పీవీఆర్, ఎం అండ్ ఎం ఫైనాన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, వీఎస్టీ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్.
ప్రభుదాస్ లిలాధర్:
శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, స్పైస్‌జెట్, కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్.
You may be interested
లాభాల్లో ప్రభుత్వరంగ షేర్లు
Thursday 26th September 2019ప్రభుత్వరంగ షేర్లు గురువారం మిడ్‌సెషన్‌లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్ నేడు 2శాతం పెరిగింది. ప్రభుత్వ రంగానికి చెందిన పెట్రోమార్కెటింగ్ కంపెనీల్లోని ప్రధాన షేర్లైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం పెరిగాయి. బ్యాంకింగ్ రంగ సెక్టార్‌ల్లోని ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు 1.10శాతం నుంచి 3శాతం పెరిగాయి. అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 3శాతం లాభపడింది. భారత్
ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు
Thursday 26th September 2019లాభాల మార్కెట్లో ఆటో రంగ షేర్ల లాభాల బాట పట్టాయి. వరుసగా రెండురోజుల పాటు నష్టాల్లో ట్రేడైన అటో షేర్లకు నేటి ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్ఎస్ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్ 2.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా టీవీఎస్ మోటర్స్ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఎంఅండ్ఎం, అశోక్ లేలాండ్, భారత్ పోర్జ్స్ షేర్లు 3.50శాతం పెరిగాయి. మారుతి 2.50శాతం,