News


ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 10th May 2019
Markets_main1557470410.png-25649

మార్చి త్రైమాసిక ఫలితాలను ఎస్‌బీఐ శుక్రవారం ప్రకటించనుంది. నికర వడ్డీ ఆదాయంలో రెండంకెల వృద్ధి, ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంకు మంచి లాభాలను చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్యు4లో బ్యాంకు రూ.5-7వేల కోట్ల లాభాలన్ని ‍ప్రకటించవచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంతకుముందేడాది ఇదే కాలానికి బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

బ్యాంకు ఫలితాలపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
- నార్నోలియా సెక్యూరిటీస్‌: లాభం 53 శాతం పెరిగి రూ. 6034 కోట్లకు చేరవచ్చు. అసెట్‌క్వాలిటీ మెరుగుపడుతుంది.
- కోటక్‌ సెక్యూరిటీస్‌: లాభం 70 శాతం వృద్ధి చెంది రూ. 6759 కోట్లను తాకుతుంది. స్లిపేజ్‌లు 2.5 శాతం దిగువకు వస్తాయి. స్థూల ఎన్‌పీఏలు సైతం క్షీణిస్తాయి. 
- ప్రభుదాస్‌ లీలాధర్‌: లోన్‌గ్రోత్‌ 11-12 శాతం, ఎన్‌ఐఐ వృద్ధి 16- 17 శాతం వరకు ఉంటాయి. ఎన్‌ఐఎం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల నాణ్యత బాగుపడుతుంది. స్లిపేజ్‌లు పెరగకపోవచ్చు. 
- మోతీలాల్‌ ఓస్వాల్‌: రుణ వృద్ధిలో 11 శాతం పెరుగుదల ఉండొచ్చు. రిటైల్‌ రుణాల్లో మెరుగుదల కనిపిస్తుంది. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి ఉంటుంది. ఎన్‌ఐఐలో 15 శాతం పెరుగుదల కనిపిస్తుంది. అయితే వడ్డీయేతర ఆదాయం తగ్గవచ్చు. 
కీలకంగా పరిశీలించాల్సిన అంశాలు..
రిటైల్‌, ఎస్‌ఎంఈ, అగ్రి స్లిపేజ్‌లపై అప్‌డేట్స్‌
ఎన్‌సీఎల్‌టీ అకౌంట్ల నుంచి రికవరీలు
పవర్‌ అసెట్స్‌పై అవుట్‌లుక్‌
ఆస్తుల నాణ్యతపై కామెంట్స్‌.



You may be interested

క్లాస్ యాక్షన్ దావా మార్గదర్శకాలు విడుదల

Friday 10th May 2019

న్యూఢిల్లీ: చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతినేలా వ్యవహరించే కంపెనీలపై క్లాస్ యాక్షన్ దావా వేసేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. వీటి ప్రకారం కంపెనీలోని మొత్తం సభ్యుల సంఖ్యలో అయిదు శాతం మంది లేదా 100 మంది (ఏ సంఖ్య తక్కువైతే అది) క్లాస్ యాక్షన్ దావా వేయొచ్చు. డిపాజిటర్లు, డిపాజిట్లు స్వీకరించే సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. అన్‌లిస్టెడ్ కంపెనీ అయితే.. ఇష్యూడ్

జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు?

Friday 10th May 2019

కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశం నిబంధనల ఉల్లంఘనను గుర్తించిన ఆర్‌వోసీ న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాలకు సంబంధించి దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ముంబై విభాగం... కంపెనీల చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు

Most from this category