News


కోటక్‌పై అంచనాలు తగ్గించిన బ్రోకరేజ్‌లు

Wednesday 22nd January 2020
Markets_main1579674740.png-31097

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎర్నింగ్స్‌ అంచనాలను బ్రోకరేజ్‌లు తగ్గించాయి. క్యు3లో బ్యాంకు నికర లాభం 24 శాతం పెరిగి రూ. 1596 కోట్లకు చేరింది. అయితే ఇది అనలిస్టుల అంచనాల కన్నా తక్కువ. బ్యాంకు ఈ త్రైమాసికంలో రూ. 444 కోట్ల ప్రొవిజన్లు కేటాయించింది. దీంతో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితాల అనంతరం బ్యాంకు షేరు నెగిటివ్‌గా కొనసాగుతోంది. బ్యాంకు ప్రమోటర్‌ వాటా తగ్గింపు అంశంపై సందిగ్ధత, అధికవాల్యూషన్లు.. బ్యాంకు షేరుపై ఒత్తిడి పెంచుతాయని ఎమ్‌కే గ్లోబల్‌ పేర్కొంది. బ్యాంకు ఎర్నింగ్స్‌ అంచనాలను 3-9 శాతం మేర తగ్గించింది. ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థ తన అంచనాలను 3-4 శాతం మేర తగ్గించుకుంది. ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి పెరుగుతోందని, వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీర్ఘకాలానికి షేరు మంచి ఎంపికే ఐనా, వాల్యూషన్ల కారణంగా ప్రస్తుతం ఖరీదుగా కనిపిస్తోందని తెలిపింది. బలహీన రుణ వృద్ధి, అధిక వడ్డీ వ్యయాలతో బ్యాంకు క్యు3లో నిరాశపూరిత ప్రదర్శన జరిపిందని నోమురా వ్యాఖ్యానించింది. బ్యాంకు ఎర్నింగ్స్‌ అంచనాలను 6-9 శాతం మేర తగ్గించింది. స్వల్పకాలానికి బ్యాంకు షేరు కన్నా ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు బెటరని పేర్కొంది.


పై పట్టికలో వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలున్నాయి. 



You may be interested

తగ్గిన వాహన విక్రయ రిజిస్ట్రేషన్లు: నష్టాల బాటలో అటోషేర్లు

Wednesday 22nd January 2020

వరుసగా రెండోరోజూ అటో రంగ షేర్లు నష్టాల బాటపట్టాయి. డిసెంబర్‌లో అటో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. గతేడాది డిసెంబర్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు 15శాతం తగ్గినట్లు పట్టినట్లు మంగళవారం ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) గణాంకాలు వెల్లడించాయి. పండుగ సీజన్‌ సందర్భంగా 2019లో అక్టోబర్‌, నవంబర్‌లో వాహన అమ్మకాలుగా పెరిగాయి. ఈ తర్వాత నెల డిసెంబర్‌లో డిమాండ్‌ తగ్గడంతో అమ్మకాలు క్షీణించాయని ఎఫ్‌ఏడీఏ తెలిపింది. ఆఫర్లు అందుబాటులో ఉన్నా

ఈ షేర్లకు దూకుడెక్కువ!

Wednesday 22nd January 2020

జాబితాలో భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ రెండు రోజుల వరస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రారంభంలోనే బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. లాభాలను పోగొట్టుకోవడంతోపాటు.. నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు క్షీణించి 41,234ను తాకగా.. నిఫ్టీ 32 పాయింట్లు తక్కువగా 12,138 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ఇటీవల జోరు చూపుతున్న మొబైల్‌ రంగ దిగ్గజం భారతీ

Most from this category