News


సిమెంట్‌ స్టాకులపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 27th February 2020
Markets_main1582786415.png-32139

సిమెంట్‌ రంగంలోని కంపెనీల షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. దేశవ్యాప్తంగా సిమెంట్‌ వినియోగం పెరగడం, తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయన్న అంచనాలతో సిమెంట్‌స్టాకులపై బ్రోకింగ్‌ సంస్థలు పాజిటివ్‌గా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరం దేశీయంగా క్లింకర్‌ వినియోగం 80 శాతాన్ని దాటుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. దీంతో ఎబిటా పెరుగుదల ఆధారిత ధరల వృద్ధి నమోదవుతుందని తెలిపింది. పాజిటివ్‌ అంచనాలతో సిమెంట్‌ ధరలు స్థిరంగా ఉంటాయని, జనవరి- జూన్‌ కాలంలో సిమెంట్‌ వినిమయం పెరుగుతుందని తెలిపింది. ఇన్‌పుట్‌ వ్యయాల తరుగుదల కారణంగా సిమెంట్‌ కంపెనీలకు లాభం చేకూరుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏసీసీ, శ్రీసిమెంట్‌, జేకే సిమెంట్‌, జేకే లక్ష్మి సిమెంట్‌ షేర్లకు కొనొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. 
వచ్చేమూడేళ్లలో సిమెంట్‌ వినియోగం పెరుగుతుందని, దీంతో పాటు సిమెంట్‌ కంపెనీల సామర్ధ్య విస్తరణ జరుగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. సిమెంట్‌కు డిమాండ్‌ ఏటా 6 శాతం చొప్పున చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయగలదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏసీసీ, జేకే సిమెంట్‌, జేకీ లక్ష్మి సిమెంట్‌, దాల్మియా భారత్‌, బిర్లా కార్‌‍్ప, ప్రిసమ్‌ జాన్సన్‌ షేర్లకు కొనొచ్చు రేటింగ్‌ ఇస్తున్నానమని తెలిపింది. అయితే శ్రీసిమెంట్‌, రామ్‌కో సిమెంట్‌ షేర్లలో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. జనవరి ఫిబ్రవరిల్లో సిమెంట్ ధరలు పెరిగినందున మార్చిలో బస్తాకు 15-20 రూపాయల చొప్పున ధరలు తగ్గవచ్చని అంచనా వేసింది. 



You may be interested

2020ఏడాది కనిష్టానికి సూచీలు..!

Thursday 27th February 2020

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ వ్యాధి భయాలకు,  ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ కాంటాక్టు ముగింపు నేప‌థ్యంలో ఇన్వెస్టర్ల అప్రమ‌త్తత తోడవ్వడంతో గురువారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ 2020 ఏడాది కనిష్టం దిగువకు చేరుకున్నాయి. మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 465పాయింట్లు నష్టపోయి 39,423.27 వద్ద, నిఫ్టీ 141 పాయింట్లను కోల్పోయి 11,536 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. కేంద్ర బడ్జెట్‌ సమర్పణ తర్వాత ఫిబ్రవరి 3 నాటి

రైట్స్‌, మహీంద్రా సీఐఈ పతనం

Thursday 27th February 2020

ఆఫర్‌ ఫర్‌ సేల్‌తో రైట్స్‌ డీలా మహీంద్రా సీఐఈకి క్యూ3 ఫలితాల దెబ్బ సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు మరింత వాటాను కల్పించే బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ రైట్స్‌ లిమిటెడ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఓఎఫ్‌ఎస్‌)ను చేపడుతోంది. దీంతో ఈకౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఆటో విడిభాగాల కంపెనీ మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఈ రెండు

Most from this category