News


మిడ్‌క్యాప్‌లో వీటిపట్ల బ్రోకరేజీలు బుల్లిష్‌

Thursday 10th October 2019
Markets_main1570730771.png-28811

సెప్టెంబర్‌ క్వార్టర్‌ టీసీఎస్‌ ఫలితాలు అంచనాలను అందుకోలేదు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఆస్తుల నాణ్యత క్షీణించింది. ఇక ఇన్ఫోసిస్‌ ఫలితాలు శుక్రవారం రానున్నాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించి కంపెనీల ఫలితాల్లో ఏమంత వృద్ధి ఉండకపోవచ్చనే బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. కాకపోతే కార్పొరేట్‌ పన్న తగ్గింపు అంశం కొన్ని కంపెనీలకు సానుకూల ఫలితాలను ఇవ్వనుందని భావిస్తున్నాయి. డిమాండ్‌ క్షీణిస్తూ ఉండడం కంపెనీల ఫలితాలపై ‍ప్రభావం చూపిస్తుందని, అదే సమయలో క్రితం ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో తక్కువ బేస్‌ కారణంగా కొన్ని కంపెనీల ఫలితాలు బాగుండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వెలుగు చూసి ఏడాదవుతోంది. 

 

‘‘రెండో త్రైమాసికం ఫలితాలు పెద్ద ప్రాముఖ్యమైనవి కావు. ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. దేశ ఆర్థిక రంగంలో క్షీణించిన డిమాండ్‌, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు బలహీనంగా ఉండడం ఫలితాలపై ప్రభావం చూపించనున్నాయి. ఆశాజనక ఫలితాలను కేవలం కొన్నే ప్రకటించొచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. బలహీన నిర్వహణ వాతావరణం కారణంగా ఎన్నో రంగాల్లో ఆదాయాల క్షీణత ఉండొచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సైతం అంచనా వేస్తోంది. ‘‘త్రైమాసికం వారీగా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ ఫలితాలను, మొదటి క్వార్టర్‌ ఫలితాలతో పోల్చి చూడడం సరికాదు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల లాభాలు 11 శాతం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద నిర్వహణ లాభంలో వృద్ధి ఉండకపోవచ్చు’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. 

 

పన్ను ముందస్తు లాభం వార్షికంగా చూస్తే 2 శాతం, నికర లాభం మాత్రం 6 శాతం వరకు తగ్గొచ్చన్నది మోతీలాల్‌ ఓస్వాల్‌ తాను అధ్యయనం చేసిన కంపెనీలకు సంబంధించి అంచనా వేసింది. ప్రైవేటు బ్యాంకులు, కన్జ్యూమర్‌, సిమెంట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ ఫలితాలు కొంచెం ఉపశమనం కల్పించొచ్చని పేర్కొంది. రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అయితే బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ఫార్మా తక్కువ బేస్‌ కారణంగా మంచి ఫలితాలు ప్రకటించొచ్చని పేర్కొంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ ఇండియన్‌ హోటల్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌, అశోక్‌లేలాండ్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, కోల్గేట్‌ పామోలివ్‌ స్టాక్స్‌ పట్ల చాలా బుల్లిష్‌గా ఉంది. రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అయితే, ఫెరల్‌ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, హెక్సావేర్‌, సోనాటా సాఫ్ట్‌వేర్‌, జేకే సిమెంట్‌, ఆల్కెమ్‌ ల్యాబ్స్‌, టోరెంట్‌ ఫార్మా, మహానగర్‌ గ్యాస్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ పట్ల చాలా సానుకూలతతో ఉంది. You may be interested

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌..

Friday 11th October 2019

- క్యూ2లో లాభం 1.8 శాతం అప్‌; రూ. 8,042 కోట్లు - ఆదాయం 6 శాతం వృద్ధి; రూ. 38,977 కోట్లు - షేరుకి రూ. 40 ప్రత్యేక డివిడెండ్‌ ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. గురువారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం

నిఫ్టీకి 11,250 కీలకం.. దిగువన మరింత బలహీనత

Thursday 10th October 2019

నిఫ్టీ-50 11,300 స్థాయి నుంచి గురువారం 11,200 స్థాయి దిశగా పడిపోయింది. రోజంతా ఎక్కువగా అమ్మకాలు ఒత్తిడిని సూచీలు ఎదుర్కొన్నాయి. 200 రోజుల డీఎంఏ 11,250పైన నిలదొక్కుకుంటేనే 11,333, 11400 దిశగా నిఫ్టీ పెరిగేందుకు అవకాశం ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు. నిఫ్టీకి 11,100 మద్దతు స్థాయిగా వ్యవహరిస్తుందన్నారు. బుధవారం 11,300పైన క్లోజ్‌ అయినా కానీ, కొనసాగింపుగా కొనుగోళ్ల మద్దతు తర్వాతి

Most from this category