News


‘బై’ ఎన్‌ఎండీసీ...‘సెల్‌’ మైం‍డ్‌ట్రీ

Wednesday 24th July 2019
Markets_main1563939793.png-27262

ఎడెల్వీస్ బ్రోకరేజి సంస్థ నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎండీసీ) షేరు టార్గెట్‌ ధరను రూ. 135గా కొనసాగిస్తు ‘బై’ కాల్‌ రేటింగ్‌ను ఇచ్చింది. డోనిమలై వద్ద  మైనింగ్‌ను ఎన్‌ఎండీసి తిరిగి ప్రారంభించడంతో ఈ షేరు సానుకూలంగా ఉందని  తెలిపింది. కాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రుతుపవనాలు  తర్వాత ఈ మైనింగ్‌ వద్ద ఉత్పత్తిని ప్రారంభిస్తే ఈపీఎస్‌(షేరు పై లాభం) 6 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎన్‌ఎండీసీ షేరు విలువ మంగళవారం(జులై 23) ట్రేడింగ్‌లో 0.31 శాతం లాభపడి రూ.113.90 వద్ద ముగిసింది.   
 

ఫిలిప్ క్యాపిటల్ కోల్‌గేట్ పామోలివ్‌ ఇండియా టార్గెట్‌ ధరను రూ.1,170 నుంచి రూ .930కు తగ్గించి,  ‘కాల్‌’ రేటింగ్‌ను ఇచ్చింది.  స్వర్ణ వేద్‌శక్తి పాన్ ఇండియా(నేచురల్స్ ప్రొడక్ట్), కోల్‌గేట్ డెంటల్ క్రీమ్ కోసం అధిక ప్రచారం, కోల్‌గేట్ టోటల్ (ప్రీమియం సమర్పణ) ను తిరిగి ప్రారంభించడం వంటి ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ వాల్యూమ్ల వృద్ధి పోకడలు  దిగజారతాయని ఫిలిప్ క్యాపిటల్ తెలిపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించడం వలన ఆర్థిక సంవత్సరం 2020లో ఈ కంపెనీ వృద్ధి మరింత నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. కోల్‌గేట్ అధిక గ్రామీణ ఆధారిత (అమ్మకాలలో 50 శాతం) ,టోకు అమ్మకాలపై ఆధారపడి ఉండడం వలన ఈ క్షీణన ఉందని తెలిపింది.  ఈ స్టాక్ మంగళవారం ట్రేడింగ్‌లో 0.23 శాతం లాభపడి  రూ .1,167.00 వద్ద ముగిసింది.
 

హెచ్‌ఎస్‌బిసి హెచ్‌డిఎఫ్‌సీ ఏఎంసీ స్టాకు రేటింగ్‌ను ‘హోల్డ్’  నుంచి ‘బై’ కు అప్‌గ్రేడ్ చేసింది. ఈ షేరు టార్గెట్‌ ధరను రూ .1,400 నుంచి రూ .2,280 కు పెంచింది. హెచ్‌డిఎఫ్‌సి ఎఎమ్‌సి మొదటి త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్‌ఎస్‌బిసి తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ వాటా దాని ముఖ్య ప్రత్యర్థుల కంటే చాలా ఎక్కువని వివరించింది. దీని అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ అధికంగా ఉందని అందువల్ల లాభదాయకత కూడా ఎక్కువగా ఉందని ఈ బ్రోకరేజ్ తెలిపింది. ఈ స్టాక్ మంగళవారం ట్రేడింగ్‌లో 2.14 శాతం నష్టపోయి  రూ.2,140.00 వద్ద ముగిసింది.

 

ఇన్వెస్టెక్ బ్రోకరేజీ సంస్థ మైండ్‌ట్రీ రేటింగ్‌ను ‘హోల్డ్’ నుంచి ‘సెల్‌’కు తగ్గించింది. అంతేకాకుండా టార్గెట్ ధరను రూ .1,012 నుంచి రూ. 670 కు తగ్గించింది. కంపెనీ మేనేజ్‌మెంట్‌ చుట్టూ అనిశ్చితి చర్చనీయాంశంగా ఉండడంతో పాటు, ఆదాయాల తగ్గడం చూశామని తెలిపింది. పీఈ(లాభ సంపాదన నిష్పత్తి) మల్టిపుల్స్‌ క్షీణించి  ఈ స్టాకు ముందటి పీఈ 16.8 మల్టిపుల్స్‌కు 15 శాతం తగ్గుతుందని ఈ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. ఈ స్టాక్ మంగళవారం ట్రేడింగ్‌లో 1.52 శాతం పెరిగి రూ.692.30 వద్ద ముగిసింది.
 You may be interested

సెన్సెక్స్‌ ప్లస్‌..నిఫ్టీ మైనస్‌

Wednesday 24th July 2019

అమెరికా-చైనాల మధ్య వచ్చేవారం నుంచి వాణిజ్య చర్చలు పునర్‌ ప్రారంభమవుతున్నాయన్న వార్తలతో బుధవారం ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నా, భారత్‌ సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 37,985 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 11,322 పాయింట్ల వద్ద మొదలయ్యింది. 

మిడ్‌క్యాప్స్‌ కచ్చితంగా ఎందుకు ర్యాలీ చేస్తాయంటే...?

Tuesday 23rd July 2019

నిఫ్టీ 10,000 పాయింట్లకు ఈ ఏడాది పతనం అవుతుందని తాము భావించడం లేదని ఐఐఎఫ్‌ఎల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. స్వల్పకాలానికి కనిష్ట స్థాయి అన్నది 200డీఎంఏకు దగ్గర్లో 11,125 వద్ద ఇప్పటికే ఏర్పాటైందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. మరీ పడితే 11,000 కనిష్ట స్థాయిని నమోదు చేయవచ్చన్నారు. డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల నేపథ్యంలో వచ్చే కొన్ని రోజుల్లోనే ఇది జరగొచ్చన్నారు. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌

Most from this category