దేశీ షేర్లపై విదేశీ బ్రోకరేజ్‌ల సిఫార్సులు
By D Sayee Pramodh

జూన్ త్రైమాసికంలో ఇండియా కార్పొరేట్లు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి. దీంతో పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు పలు కంపెనీల షేర్లపై ధృక్పథాలను మార్చుకున్నాయి. వీటి వివరాలు ఇలా ఉన్నాయి...
1. గ్లెన్మార్క్పై సీఎల్ఎస్ఏ: అమ్మొచ్చు రేటింగ్. టార్గెట్ రూ. 500 నుంచి 350కి తగ్గింపు. ఎర్నింగ్స్ గ్రోత్ ఒత్తిడిలో ఉందని వ్యాఖ్యానిస్తూ ఈపీఎస్ టార్గెట్‌ను 15- 18 శాతం మేర తగ్గించింది.
2. ఐబీరియల్ఏస్టేట్పై సీఎల్ఎస్ఏ: కొనొచ్చు రేటింగ్ కొనసాగింపు కానీ టార్గెట్‌ను రూ. 150 నుంచి రూ. 120కి తగ్గించింది. ఇది షేరు ఎస్ఓటీపీ వాల్యూషన్ కన్నా 40 శాతం తక్కువ.
3. ఐజీఎల్పై సీఎల్ఎస్ఏ: కొనొచ్చు రేటింగ్. టార్గెట్ రూ. 390. వాల్యూంలు, మార్జిన్లు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది.
4. ఐజీఎల్పై మోర్గాన్‌స్టాన్లీ: ఓవర్‌వెయిట్ రేటింగ్. టార్గెట్ రూ. 351. వాల్యూం వృద్ధి పెరుగుదల కొనసాగించింది. రాబోయే రెండుమూడేళ్లలో 12 శాతం డిమాండ్ గ్రోత్ కనిపిస్తుందని అంచనా.
5. గ్రాసిమ్పై సిటీ: కొనొచ్చు రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 1150 నుంచి 975కు తగ్గించింది. సబ్సిడిరీల హోల్డ్కో డిస్కౌంట్‌ను(అనుబంధ కంపెనీ కారణంగా వచ్చే డిస్కౌంట్) మరీ ఎక్కువగా అంచనా వేశారు.
6. థైరోకేర్పై గోల్డ్‌మన్‌సాక్స్: కొనొచ్చు రేటింగ్. టార్గెట్ రూ. 570. ఈ ఏడాది నికర విక్రయాల్లో 15 శాతం వృద్ధి ఉండవచ్చు.
7. పీఈఎల్పై సిటీ: న్యూట్రల్ రేటింగ్. టార్గెట్ రూ. 1990. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్లో 25 శాతం వృద్ధి ఉంటుంది.
8. ఇప్కాపై యూబీఎస్: అమ్మొచ్చు రేటింగ్. టార్గెట్ రూ. 900. వివాదాల పరిష్కారంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫార్మలేషన్స్లో బలహీనత కనిపిస్తోంది.
You may be interested
నష్టాల్లో కోల్ ఇండియా, జిందాల్ స్టీల్..
Friday 16th August 2019అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో కదులుతున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మధ్యాహ్నాం 12.49 సమయానికి 0.87 శాతం నష్టపోయి 2,390.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 3.53 శాతం లాభపడి రూ. 1,321.00 వద్ద ట్రేడవుతుండగా, మిగిలిన షేర్లయిన జిందాల్ స్టీల్ 1.01 శాతం, కోల్ ఇండియా 0.67 శాతం, జిందాల్ స్టెయిన్లెస్ లి.(హిసార్) 0.07
బేర్ మార్కెట్లో నేనొక బుల్‌ని
Friday 16th August 2019‘నేను బేర్ మార్కెట్లో బుల్‌ని. నేను ఇప్పటికీ కూడా బుల్లిష్‌గానే ఉన్నాను. అంతేకాకుండా పూర్తిగా పెట్టుబడులు కూడా పెట్టాను. నా స్థితి మారలేదు కానీ మార్కెట్లోని పరిస్థితులు స్పష్టంగా మార్పు చెందాయి’ అని మోతీలాల్ ఓస్వాల్, ఎండి సహ వ్యవస్థాపకుడు, రామ్‌దేవ్ అగర్వాల్ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... దీర్ఘకాల బేర్ మార్కెట్.. దేశియ మార్కెట్లు బుధవారం భారీ నష్టాన్ని చూశాయి. ప్రస్తుతం మార్కెట్లు దీర్ఘకాల బేర్