News


సిటీ టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 27th November 2019
Markets_main1574831094.png-29890

మిడ్‌క్యాప్‌ స్టాకులు ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ మంగళవారం సెషన్‌లో కొత్త గరిష్ఠాలకు చేరుకోవడంతో, ఈ ర్యాలీ అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తున్న మిడ్‌క్యాప్‌ స్టాకుల వైపు మరలుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 30 శాతం అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తుండడంతో, ఈ సమయంలో మిడ్‌క్యాప్‌లను కొనుగోలుచేయడం మంచిదని సిటీ పేర్కొంది.‘సాధరణంగా ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు మిడ్‌క్యాప్‌లు మంచి ప్రదర్శన చేస్తుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం కష్టం. కానీ అండర్‌పెర్ఫార్మన్స్‌ చేయడంతో మంచి రిస్క్‌ రివార్డు ఉంటుంది. అందుకే నిర్ధిష్టమైన మిడ్‌క్యాప్‌ స్టాకులను మా పోర్టుఫోలియోకి జత చేసుకుంటున్నాం’ అని సిటీ తెలిపింది. మిడ్‌క్యాప్‌లు, లార్జ్‌క్యాప్‌లతో పోల్చుకుంటే 10 ఏళ్ల గరిష్ఠ రాయితీతో ట్రేడవుతున్నాయి. ‘లార్జ్‌క్యాప్‌లు 2017 లో అధిక ప్రీమియంతో కదిలిన సందర్భానికి ఇది పోలి ఉంది. మిడ్‌క్యాప్‌లపై తీవ్రంగా ఉన్న ఆశావాదం ఈ రెండేళ్లలో అతి పెద్ద నిరాశవాదంగా మారింది’ అని సిటీ తెలిపింది. 



You may be interested

అటోరంగ షేర్ల పరుగు

Wednesday 27th November 2019

మార్కెట్‌ ప్రారంభంలో అటోరంగ షేర్లు పరుగులు పెడుతున్నాయి. నేడు జరగనున్న కేంద్ర కేబినేట్‌ సమావేశంలో.... కాలం చెల్లిన వాహనాలను వినియోగం నుంచి తొలిగించేందుకు ప్రభుత్వం రూపొందించిన వెహికిల్ స్క్రాప్ పాలసీకి ఆమోదం లభించవచ్చనే అంచనాలు అటో రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. భారత్‌ ఫోర్జ్‌ 3శాతం, టాటామోటర్స్‌, ఎంఅండ్‌ఎం, అశోక్‌లేలాండ్‌ షేర్లు 2.50శాతం లాభపడ్డాయి. మారుతి, ఐషర్‌ మోటర్స్‌,

హిండాల్కో, ఎయిర్‌టెల్‌.. తదుపరి ర్యాలీకి లీడర్స్‌?!

Wednesday 27th November 2019

నిపుణుల అంచనా నిఫ్టీ సెప్టెంబర్‌ 19 నుంచి 1360 పాయింట్లు ర్యాలీ జరిపి మంగళవారం ఆల్‌టైమ్‌ హైని తాకింది. అయితే ఈ ర్యాలీ విస్తృతమైనది కాదని కేవలం కొన్ని స్టాకుల ప్రదర్శనే సూచీలను నడిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలలు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు షేర్ల దూకుడుతో మార్కెట్లు జీవిత కాల గరిష్ఠాలను చూశాయి. అయితే క్రమంగా ఈ జోరు అన్ని విభాగాల షేర్లకు పాకుతున్న సూచనలు

Most from this category