News


ఫలితాల ఎఫెక్ట్‌: బ్రిటానియా 5% అప్‌

Wednesday 13th November 2019
Markets_main1573623207.png-29553

బ్రిటానియా సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో బుధవారం సెషన్లో ఈ కంపెనీ షేరు ర్యాలీ చేస్తోంది. ఉదయం 10.55 సమయానికి బ్రిటానియా  5.21 శాతం లాభపడి రూ. 3,282.20 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 లో ఈ షేరు టాప్‌ గెయినర్‌గా ఉండడం గమనార్హం.  గత సెషన్‌లో రూ. 3,119.55 వద్ద ముగిసిన ఈ షేరు, ఫలితాల ప్రభావంతో బుధవారం సెషన్‌లో రూ. 3,271.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. 
క్యూ2 ఫలితాలు..  
బ్రిటానియా కంపెనీ ఏకికృత నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో  ఏడాది ప్రాతిపదికన​32.90 శాతం పెరిగి రూ. 402.73 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 303.03 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 5.88 శాతం పెరిగి రూ. 3,022.91 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ అమ్మకాలు రూ. 2,854.81 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన రూ. 2,454.58 కోట్లు నుంచి 6.64 శాతం పెరిగి రూ. 2,617.64 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితా 



You may be interested

4రోజుల నష్టాల తరువాత లాభాల్లోకి పసిడి

Wednesday 13th November 2019

నాలుగు రోజుల వరుసగా నష్టాల ముగింపు అనంతరం బుధవారం ఉదయం సెషన్‌లో లాభాల బాట పట్టింది. గత రెండు రోజులుగా 3నెలల కనిష్టం వద్ద ట్రేడైన పసిడి ధర బుధవారం లాభపడింది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 6.50డాలర్ల పెరిగి 1,460.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో చైనాతో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో

ఆల్‌టైం హై వద్ద ఎంటర్‌ కావడం తప్పా?

Wednesday 13th November 2019

ఇన్వెస్టర్లలో భయాలు... నిపుణుల సమాధానాలు, సూచనలు... దేశీయ మార్కెట్‌, ఎకానమీ రెండూ భిన్న ప్రదర్శన చూపుతున్నాయి. ఒకపక్క మార్కెట్స్‌ ఆల్‌టైమ్‌ హైల వద్ద కదలాడుతుంటే, మరోపక్క ఎకానమీలో పరిస్థితి మందగమనం దిశగా కదులుతోందని గణాంకాలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు ఎంటరైన ఇన్వెస్టర్లలో అనవసరంగా ఎంటరయ్యామన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయమై నిపుణుల సమాధానాలు, సూచనలు ఇలా ఉన్నాయి.. = ఎకానమీ ఎలా ఉన్నా, ఆల్‌టైమ్‌ హైల వద్ద

Most from this category