News


12000 మద్దతు కోల్పోతే కరెక‌్షన్‌?!

Monday 17th February 2020
Markets_main1581927224.png-31857

రాబోయే కొన్ని సెషన్లలో నిఫ్టీ 12వేల పాయింట్ల మద్దతు కోల్పోతే కొత్త షార్ట్స్‌ పెరగడం లేదా లాంగ్‌ అన్‌వైండింగ్‌ స్పీడవడం జరుగుతుందని టెక్నికల్‌ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో పుట్స్‌, ఐటీ స్టాక్స్‌లో లాంగ్స్‌ను పరిశీలించవ్చని సూచించారు. నిఫ్టీ ప్రస్తుతం సందిగ్ధ స్థితిలోకి జారిందన్నారు. సూచీ చార్టుల్లో డోజీ క్యాండిల్‌స్టిక్‌ ఏర్పడిందని, ఇది సందిగ్ధతకు సంకేతమని చెప్పారు. మరోవైపు బ్యాంకు నిఫ్టీలో భారీ అమ్మకాలు ప్రధాన సూచీపై ఒత్తిడి పెంచుతున్నాయన్నారు. కేవలం ఐటీ సూచీ మాత్రమే పాజిటివ్‌గా ఉంటోందని చెప్పారు. నిఫ్టీ మెటల్‌ సూచీ బేరిష్‌గా మారిందన్నారు.

బ్యాంకు నిఫ్టీకి 30వేల పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుందని, 31500 పాయింట్ల వద్ద నిరోధం ఉండొచ్చని తెలిపారు. నిఫ్టీకి 12వేల పాయింట్ల వద్ద మద్దతు, 12200 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతాయన్నారు. వీఐఎక్స్‌ సూచీ శుక్రవారం ఒక్కమారుగా పైకి ఎగిసిందని, ఇది స్వల్పకాలిక ఆటుపోట్లకు సూచనని తెలిపారు. నిఫ్టీ 12వేల పాయింట్ల దిగువకు వస్తే పుట్స్‌, 12270 పాయింట్లపైన కాల్స్‌ తీసుకోవచ్చని సూచించారు. కానీ ఈ వారం బేర్స్‌దే పైచేయిగా ఉండొచ్చని అంచనా వేశారు. బ్యాంకు నిఫ్టీలో 30500 పుట్స్‌ను 30వేల పాయింట్ల టార్గెట్‌కు పరిశీలించవచ్చన్నారు. టెలికంలో దిగ్గజ కంపెనీలపై మిడ్‌ టర్మ్‌కు పాజిటివ్‌గా ఉండొచ్చని సూచించారు. 



You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌ టార్గెట్ రూ.650: మోతీలాల్‌ ఓస్వాల్‌

Monday 17th February 2020

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ సోమవారం టెలికాం శాఖకు తక్షణ చెల్లింపుగా రూ.10 కోట్లను చెల్లించింది. మిగిలిన ఏజీఆర్‌ బకాయిలను మదింపు చేసుకొని మార్చి 17లోగా చెల్లిస్తామని టెలికాం శాఖకు తెలిపింది.  ఫలితంగా నేటి మధ్యాహ్నం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎయిర్‌టెల్‌ షేరు అరశాతం పెరిగి రూ.568 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గణాంకాల ప్రకారం టెలికాం శాఖకు భారతీ ఎయిర్‌టెల్‌ మొత్తం రూ.35,586 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌

మిధానీ .. రెండేళ్లలో 3 రెట్లు

Monday 17th February 2020

ప్రస్తుత ధర రూ. 216 సరికొత్త గరిష్టమిది క్యూ3 ఫలితాలతో జోరు గత 3 రోజుల్లో 31 శాతం ప్లస్‌ ఐపీవో ధర రూ. 90 రూ. 87 వద్ద లిస్టింగ్‌  ఐపీవోకు రెస్పాన్స్‌ తక్కువే ప్రభుత్వ రంగ దిగ్గజం మిశ్రధాతు నిగమ్‌(మిధానీ) లిమిటెడ్‌ షేరు ఇటీవల లాభాల దుమ్ము రేపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో తాజాగా ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ

Most from this category