News


10670 పాయింట్ల మద్దతు కోల్పోతే కల్లోలమే!

Tuesday 15th January 2019
Markets_main1547531123.png-23588

కోటక్‌ సెక్యూరిటీస్‌
కొన్నాళ్లుగా ట్రేడ్‌వార్‌, యూఎస్‌ షట్‌డౌన్‌, ఐటీ కంపెనీల పేలవ ఫలితాలు, నీరసమైన ఆటో అమ్మక గణాంకాలు, రాబోయే ఎన్నికలపై రాజకీయ రచ్చ తదితర ఇబ్బందికర వార్తల నడుమ నిఫ్టీ సమతూకం కోల్పోకుండా జాగ్రత్తగా బాలెన్స్‌అవుతూ వస్తోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. స్వల్పరేంజ్‌లోనే కదలాడుతున్నా, నిఫ్టీ పెద్దగా పతనాలను చూడలేదు. ఈ నెగిటివ్‌ వార్తలన్నింటినీ సూచీలు ప్రైస్‌ఇన్‌ చేసినట్లు కనిపిస్తోంది. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ రివర్సల్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. హామర్‌, బుల్లిష్‌ హామర్‌ పాటర్న్‌ కూడా కనిపిస్తోంది. ఇలాంటి ఫార్మేషన్లు ఆరంభంలో అమ్మకాల ఒత్తిడిని, ముగింపులో కొనుగోళ్ల జోరును సూచిస్తున్నాయి. ఈ పాటర్న్‌లు అన్నీ కలిపి ఒక త్రిభుజాకృతిని ఏర్పాటు చేశాయి. ఈ త్రిభుజాకృతి అవధులే మార్కెట్‌ శ్రేణిని నిర్ధారిస్తున్నాయి.

పైస్థాయిలో 10870, 10930 పాయింట్లు, దిగువన 10730, 10680 పాయింట్లు చాలా కీలకం. ముఖ్యంగా దిగువన 10730 పాయింట్లను కోల్పోతే 10670- 10680 పాయిం‍ట్ల వద్ద మద్దతు లభించాలి. ఒకవేళ ఈ స్థాయి దిగువకు నిఫ్టీ వస్తే మాత్రం సూచీల్లో అమ్మకాలు వెల్లువెత్తుతాయి. ఈ స్థాయికి కింద 10550 పాయింట​‍్ల వద్ద మరో మద్దతు లభిస్తుంది. దీన్ని కూడా కోల్పోతే 10300 పాయింట్ల వరకు పతనమయ్యే ఛాన్సులున్నాయి. పైస్థాయిలో 10930 పాయింట్లను దాటితే 11200- 11300 పాయిం‍ట్ల వరకు ర్యాలీ ఉండొచ్చు. 



You may be interested

బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి

Tuesday 15th January 2019

క్రమంగా తగ్గించుకోనున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్‌ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్‌ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్‌

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 15th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు.. సైయంట్‌:- కంపెనీ చరిత్రలో తొలిసారి షేర్ల బైబ్యాక్‌ ప్రకటించనుంది. ఈ నెల 17న జరిగే బోర్డు సమావేశంలో క్యూ3 ఫలితాలతో పాటు షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకూ ప్రకటించనుంది. యునైటెడ్‌ స్పిరిట్‌:- తన అనుబంధ సంస్థ ఫోర్‌ సీజన్స్‌ వైన్స్‌ లిమిటెడ్‌ను గ్రోవర్‌ జంపా వినియార్డ్స్‌ లిమిటెడ్‌, క్వింటెలా అసెట్స్‌ లిమిటెడ్‌ విక్రయించేందుక ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.32 కోట్లు

Most from this category