News


ప్రపంచ మార్కెట్ల తీరు... టాప్‌లో బ్రెజిల్‌...దిగువన ఇండియా

Friday 27th December 2019
Markets_main1577431755.png-30477

ఈ కేలండర్‌ ఏడాది(2019)లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. వర్ధమాన మార్కెట్‌ బ్రెజిల్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే దేశీ మార్కెట్లు రిటర్నుల జాబితాలో టాప్‌-10లో దాదాపు అట్టడుగున నిలిచాయి. ఇందుకు పలు అంశాలు కారణమైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఏడాది ప్రారంభం‍లో 2018 ఒడిదొడుకులు కొనసాగగా.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, బ్రెక్సిట్‌పై కొనసాగిన అనిశ్చితి, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి అంశాలు తొలుత మార్కెట్లకు సవాళ్లు విసిరినట్లు తెలియజేశారు. దీనికితోడు ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ విధింపు కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు పేర్కొన్నారు. తదుపరి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు నుంచి తగ్గింపు బాటకు మళ్లడం, ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ తొలగింపు వంటి అంశాలతో కొంతమేర సెంటిమెంటు మెరుగుపడినట్లు తెలియజేశారు. ఆపై దేశీయంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను పలుమార్లు తగ్గించడం ద్వారా దశాబ్దకాలపు కనిష్టానికి చేర్చడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య మైత్రి, యూకే ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వడంతో ద్వితీయార్థంలో మార్కెట్లు పుంజుకన్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం..

యూఎస్‌, యూరప్‌ బెస్ట్‌
ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో బ్రెజిల్‌ దాదాపు 32 శాతం రిటర్నులు అందించగా.. యూరోపియన్‌ మార్కెట్లు ఫ్రాన్స్‌, జర్మనీ 26 శాతం స్థాయిలో లాభపడటం​ ద్వారా తదుపరి ర్యాంకులలో నిలిచాయి. ఇక ఇటీవల సరికొత్త గరిష్టాలను సాధిస్తున్న యూఎస్‌ మార్కెట్లు 22 శాతం పుంజుకోగా.. గత వారం చరిత్మాత్మక గరిష్టాలను అందుకున్న దేశీ మార్కెట్లు 2019లో 14 శాతం బలపడ్డాయి.

టాప్‌-10 మార్కెట్స్‌

దేశం పేరు లాభం(%)
బ్రెజిల్‌     32
ఫ్రాన్స్‌     27
జర్మనీ 26
యూఎస్‌ 22
చైనా 21
కెనడా     20
జపాన్‌     20
ఇండియా 14
యూకే 14
హాంకాంగ్‌ 8You may be interested

2019: ఎఫ్‌పీఐల పెట్టుబడుల రికార్డ్‌

Friday 27th December 2019

2019లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల దూకుడు దేశీ కేపిటల్‌ మార్కెట్లో రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎఫ్‌పీఐల బాటలో నడిచిన దేశీ ఫండ్స్‌ పెట్టుబడుల్లో బ్యాంకింగ్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ కేలండర్‌ ఏడాది(2019)లో దేశీ కేపిటల్‌ మార్కెట్లపట్ల అత్యంత ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. ఫలితంగా ఈ నెల మూడో వారం వరకూ పరిగణిస్తే.. అటు  స్టాక్స్‌, ఇటు రుణ సెక్యూరిటీలలో కలిపి రూ. ఒక ట్రిలియన్‌కుపైగా పెట్టుబడులను కుమ్మరించారు. ఈ ట్రెండ్‌

జనవరి సిరీస్‌ ఎలా ఉండొచ్చు?!

Friday 27th December 2019

నేడు(శుక్రవారం) ప్రారంభమైన జనవరి డెరివేటివ్‌ సిరీస్‌లో మార్కెట్ల నడక ఎలా ఉండవచ్చన్న అంశంపై సాంకేతిక నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండటంతో రానున్న రెండు నెలలు మార్కెట్లకు కీలకంగా నిలిచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాంకేతిక విశ్లేషణలు ఎలా ఉన్నాయంటే.. బడ్జెట్‌ ఎఫెక్ట్‌ జనవరి సిరీస్‌పై బడ్జెట్‌ అంచనాలు ప్రభావం చూపనున్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం నిలుపుకునే అంశంతోపాటు.. మందగిస్తున్న ఆర్థిక

Most from this category