News


10 శాతం పతనానికి సిద్దంగా ఉండండి!

Thursday 6th September 2018
Markets_main1536212582.png-20011

ఇన్వెస్టర్లకు ఎడెల్‌వీజ్‌ సూచన
దేశ ఎకానమీ వృద్ది రేటు ఆశించినట్లే పరుగులు తీస్తోంది కానీ కంపెనీల ఎర్నింగ్స్‌ మాత్రం ఇంకా అస్థిరంగానే ఉన్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం ఎడెల్‌వీజ్‌ అబిప్రాయపడింది. మార్కెట్లో పెరిగిన వాల్యూషన్లకు తగినట్లు ఫలితాలు లేవని తెలిపింది. దీంతో ఎప్పుడైనా సూచీల్లో 10 శాతం కరెక‌్షన్‌ తప్పకపోవచ్చని అంచనా వేసింది. 
దేశీయ సూచీలపై ఎడెల్‌ వీజ్‌ నివేదికలో ముఖ్యాంశాలు..
- కంపెనీల ఫలితాలు మెరుగైతే ఇతర నెగిటివ్‌ అంశాలన్నీ మరుగునపడతాయి. 
- కానీ పరిస్థితులు ఆవిధంగా కనిపించడంలేదు, గత ఆర్థిక సంవత్సరాల్లో మాదిరే డౌన్‌గ్రేడ్‌ సైకిల్‌ ఆరంభమయింది. 
- నిఫ్టీ ప్రస్తుతం తన ఫార్వర్డ్‌ ఎర్నింగ్స్‌ కన్నా 20 రెట్లు అధికంగా ట్రేడవుతోంది. 
- ఇది చాలా అధిక వాల్యూషన్‌, అందువల్ల ఎప్పుడైనా 10 శాతం వరకు పతనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
-  గత రెండేళ్లుగా లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్స్‌ వాల్యూషన్లు బాగా పెరిగాయి. నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీల నిష్పత్తి సరాసరి కన్నా తక్కువకు చేరింది. 
- ఇవన్నీ సూచీల్లో ఓవర్‌బాట్‌కు సంకేతాలు, అందువల్ల కరెక‌్షన్‌ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. 
- ఎకానమీ మాత్రం ప్రపంచ ఎకానమీ కన్నా మంచి మెరుగుదల చూపుతోందని తెలిపింది. ప్రస్తుతం గ్లోబల్‌ ఎకానమీ పెళుసుగా ఉందని అభిప్రాయపడింది. 
- యూఎస్‌ఏ వృద్ధి వలయంలో టాప్‌కు చేరిందని పేర్కొంది. 
- డాలర్‌ బలపడడంతో వర్ధమాన మార్కెట్లు నానా ఇబ్బందులు పడుతున్నాయని, ట్రేడ్‌ వార్‌ ముదిరితే ఈ ఇబ్బందులు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. You may be interested

ఎకానమీలో రికవరీ

Thursday 6th September 2018

భారత ఆర్థిక వ్యవస్థపై ఎడెల్‌వీజ్‌ అంచనా నాలుగు త్రైమాసికాలుగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి పథాన పయనిస్తోందని ఆర్థిక సేవల దిగ్గజం ఎడెల్‌వీజ్‌ తెలిపింది. వృద్ధి వివిధరంగాల్లో విస్తరించిందని గణాంకాలు వివరిస్తున్నాయని వెల్లడించింది. జీఎస్‌టీ, నోట్లరద్దుతో ఏర్పడిన ఆటుపోట్లు తగ్గాయని తెలుస్తోందని పేర్కొంది. ప్రపంచ ఎకానమీతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఆరోగ్యవంతమైన ప్రగతి సాధిస్తోందని తెలిపింది. వర్ధమాన మార్కెట్లలో భారత్‌ బాగుందని కొనియాడింది. కంపెనీ ఎర్నింగ్స్‌లో పురోగతి రావాల్సిఉందని

స్వల్పం పెరిగిన పసిడి

Thursday 6th September 2018

ముంబై:- డాలర్‌ బలహీనతతో పసిడి ధర గురువారం స్వల్పంగా బలపడింది. బ్రెగ్జిట్‌ వార్తలు తెరపైకి రావడంతో బ్రిటీష్‌ పౌండ్‌, యూరో కరెన్సీల విలువ పెరుగుదల కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించింది. ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు మారక విలువ నేడు 0.11శాతం నష్టపోయి 94.97శాతానికి పతనమైంది. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ విలువకు విలోమానుపాతంగా ట్రేడ్‌ అయ్యే పసిడి ధర పుంజుకుంటుంది. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్‌

Most from this category