News


ఆరామ్‌కో ఆసక్తి.. బీపీసీఎల్‌ ర్యాలీ

Friday 18th October 2019
Markets_main1571390309.png-28983

దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌(భారత పెట్రోలియం)లో 53.29 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు, కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడంతో ఈ కంపెనీ షేరు గత కొన్ని సెషన్‌ల  నుంచి ర్యాలీ చేస్తోంది. దీనితో పాటు బీపీసీఎల్‌ వాటాను విక్రయించేందుకు, వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ కోసం ప్రభుత్వం వివిధ అంతర్జాతీయ ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీలకు బిడ్‌లు దాఖలు చేయమని ఆహ్వానం పంపింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రఖ్యాత చమురు కంపెనీ సౌదీ ఆరాంకో, బీపీసీఎల్‌లోని ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడంతో బీపీసీఎల్‌ షేర్లు శుక్రవారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ కంపెనీ షేరు మధ్యాహ్నం 2.37 సమయానికి 3.54 శాతం లాభపడి రూ. 531.45 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 513.30 వద్ద ముగసిన ఈ షేరు, రూ. 510.00 వద్ద ప్రారంభమై, రూ. 534.90 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.
‍ప్రభుత్వం ఆహ్వానం పలికన కంపెనీలు...
   హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్‌)లో ఓఎన్‌జీసీ వాటాను, బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయడానికి బిడ్‌లు దాఖాలు చేయాలని, ఎక్సాన్ మొబిల్, చెవ్రాన్ అండ్‌ కోనోకో ఫిలిప్స్ (యుఎస్), రాయల్ డచ్ షెల్, బీపీ పీఎల్‌సీ (యూకే), రోస్‌నెఫ్ట్, లుకోయిల్ (రష్యా), పెట్రో చైనా, సీఎన్‌పీసీ, సినోపెక్ (చైనా), టోటల్ ఎస్‌ఏ (ఫ్రాన్స్), సౌదీ అరామ్‌కో  వంటి అంతర్జాతీయ కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించింది. 



You may be interested

డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికతో పీఎస్‌యూ షేర్లకు డిమాండ్‌

Friday 18th October 2019

కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక ఆచరణకు రంగం సిద్ధం చేసిందనే వార్తలు వెలుగులోకి రావడంతో శుక్రవారం పలు ప్రభుత్వరంగ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే  బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ మధ్యాహ్నం 3:00ల సమయానికి 2.50శాతం లాభంతో 6,857.84 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పలు పీఎస్‌యూ షేర్లు అధిక పరిమాణంతో ట్రేడవుతూ దాదాపు ర్యాలీ చేశాయి. భెల్‌, హిందుస్థాన్‌ కాపర్‌, ఎంఎంటీసీ, న్యూ ఎస్యూరెన్స్‌ షేర్లు 11శాతానికి

బడాషేర్లే బెటర్‌ అంటున్న ఎల్‌ఐసీ

Friday 18th October 2019

స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ విక్రయం లార్జ్‌క్యాప్స్‌పై ఫోకస్‌ దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ క్రమంగా లార్జ్‌క్యాప్స్‌పై ఎక్కువ మక్కువ చూపుతోంది. మార్కెట్‌ పరిస్థితులు అంతగా బాగాలేకపోవడంతో తన పోర్టుఫోలియోలోని చిన్న, మధ్యతరహా షేర్లను అమ్మేస్తోంది. గత త్రైమాసికంలో సిమెంట్‌, నిర్మాణం, రియల్టీ, ఇంజనీరింగ్‌, గ్యాస్‌ సరఫరా, టెక్స్‌టైల్స్‌ సహా వివిధ రంగాలకు చెందిన తనవద్దున్న చిన్న షేర్లను ఎల్‌ఐసీ వదిలించుకుంటోందని గణాంకాలు చూపుతున్నాయి.  ఎల్‌ఐసీ వాటాలు తగ్గించుకున్న కంపెనీలు... గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, లక్ష్మీమెషెన్‌వర్క్స్‌,

Most from this category