బీపీసీఎల్ 4 శాతం అప్
By Sakshi

కంపెనీలో కేంద్రం వాటా విక్రయ వార్తలతో గత కొద్దిరోజులుగా ర్యాలీ చేస్తున్న బీపీసీఎల్ షేరు బుధవారం అదే జోరును కనబరుస్తుంది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో రూ.519.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడంతో పాటు నేడు జరిగే కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయం అంశంపై చర్చించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. అందులో భాగంగా బీపీసీఎల్ షేరు ఒకదశలో 4.50శాతం లాభపడి రూ.542.05 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు క్రితం ముగింపు(రూ.519.35)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.533.95 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.261.00, రూ.547.50లుగా నమోదయ్యాయి.
You may be interested
2 నెలల గరిష్టానికి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్
Wednesday 20th November 2019మార్కెట్ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఫార్మా షేర్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2నెలల గరిష్టాన్ని అందుకుంది. అమెరికా చైనాల మధ్య తొలగని అనిశ్చితి దేశీయ ఫార్మా రంగానికి మరింత డిమాండ్‌ను పెంచుతుందనే విశ్లేషకుల అశావహన అంచనాలు, ఫార్మా కంపెనీల ఆదాయాలపై ప్రభావాన్ని చూపే రూపాయి డాలర్
టారీఫ్‌లు పెంచితే...వొడాఫోన్ఐడియా మల్టిబ్యాగర్!
Wednesday 20th November 2019‘టెలికాం సెక్టార్‌కు సంబంధించి నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం, టెలికాం కంపెనీలు, ఈ సెక్టార్ దీర్ఘకాల వృద్ధి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి’ అని మార్కెట్ విశ్లేషకులు సమీర్ నారయణ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. టెలికాం కంపెనీలు..యస్ బ్యాంక్ యస్ బ్యాంక్‌కు టెలికాం సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యలకు స్వల్ప పోలిక ఉంది. ఒకటి నిర్థిష్టమైన బ్యాంక్ గురించి చెబుతుంటే, మరోకటి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై పడే