News


డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలు...బీపీసీఎల్‌ 13 శాతం అప్‌

Monday 23rd September 2019
Markets_main1569233700.png-28497

ట్యాక్స్‌ తగ్గింపుతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాల్లో ట్రేడయ్యాయి.  ప్రభుత్వం, ఈ ట్యాక్స్‌ తగ్గింపు వలన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనుందని, ఈ ఒత్తిళ్లను తగ్గించుకోడానికి ప్రభుత్వ రంగ సం‍స్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పక్రియను వేగతరం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో భారత్‌పెట్రోలియం సోమవారం భారీగా పెరిగింది. ఈ షేరు 13.66 శాతం లాభపడి రూ. 459.00 వద్ద ముగిసింది. కాగా సోమవారం రూ. 413.00 వద్ద ప్రారంభమైన ఈ షేరు రూ. 463.00 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకడం గమనార్హం. దీంతోపాటు ఇతర ప్రభుత్వ పెట్రోమార్కెటింగ్‌ కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) 8.45 శాతం లాభపడి రూ. 143.75 వద్ద, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) 3.70 శాతం లాభపడి రూ. 287.50 వద్ద ముగిశాయి. 
  దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు నిఫ్టీ 50 329.20 పాయింట్లు లాభపడి 11,603.40 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 1,075.41 పాయింట్లు లాభపడి 39,090.03 పాయింట్ల వద్ద ముగిశాయి.



You may be interested

రెండోరోజూ అదే జోరు..!

Monday 23rd September 2019

39000పైన సెన్సెక్స్‌, 11600 పైన ముగిసిన నిఫ్టీ సూచీల చరిత్రలో రెండురోజుల్లో అతిపెద్ద ర్యాలీ మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు గత వారాంతంలో కేంద్రం ప్రకటించిన ఉద్దీపనల ఉత్సాహంతో మార్కెట్లో రెండోరోజూ బుల్‌రన్‌ కొనసాగింది. సోమవారం సెన్సెక్స్‌ 1,075 పాయింట్లు పెరిగి 39000 స్థాయిని అధిగమించిన 39090.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 329.20 పాయింట్లు 11,600 పైన 11,603.40 వద్ద స్థిరపడింది. సూచీల చరిత్రలో రెండురోజుల పాటు జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదే

మరో నాలుగు ఆర్థిక సంస్కరణలపై మోర్గాన్‌స్టాన్లీ దృష్టి

Monday 23rd September 2019

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన ఇండియాలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతాయని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా మేనేజింగ్‌ డైరక్టర్‌ రిధమ్‌ దేశయ్‌ అన్నారు. ‘ప్రైవేట్‌ సైకిల్‌ పుంజుకోనప్పటికి పన్ను తగ్గింపు చర్య వలన దేశంలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకుంటాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ట్యాక్స్‌ తగ్గింపు వలన ఆదాయాల వృద్ధి పెరిగే అవకాశం ఉందని, సెన్సెక్స్‌ ఆదాయాల వృద్ధి అంచనాలను 2020కి గాను 25 శాతానికి, 2021 కి గాను

Most from this category