News


52 వారాల గరిష్ఠానికి బీపీసీఎల్‌!

Tuesday 1st October 2019
Markets_main1569902709.png-28644

  బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌) లోని ప్రభుత్వం మొత్తం వాటాను విక్రయించేందుకు సెప్టెంబర్‌ 30న సమావేశమైన డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్యానెల్‌ అంగీకరించడంతో  మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో  బీపీసీఎల్‌ షేరు 8 శాతం లాభపడి రూ. 511.55 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. దీంతోపాటు గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోవడంతో కూడా ఈ షేరు ర్యాలీ చేస్తోంది. గత సెషన్‌లో రూ.470.10 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం రూ. రూ. 498.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఉదయం 9.28 సమయానికి బీపీసీఎల్‌ 7.25 శాతం, ఐఓసీ(ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌) 4.61 శాతం, హిందుస్తాన్‌ పెట్రోలియం 3.3 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.  



You may be interested

11500 పైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 1st October 2019

జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., మార్కెట్‌ మంగవారం లాభంతో ప్రారంభమైంది. రెండు రోజుల నష్టాల ముగింపునకు స్వస్తి సెన్సెక్స్‌ 150 పాయింట్లు లాభంతో 38,910 వద్ద మొదలైంది. నిఫ్టీ 41 పాయింట్లు 11500పైన 11515 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 123 పాయింట్లు పెరుగుదలతో 29,226.15 వద్ద మొదలైంది. బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఐటీ,

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 1st October 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వాహన కంపెనీలు నేడు ఆగస్ట్‌ నెల విక్రయ గణాంకాలను విడుదల చేయనున్న నేపధ్యంలో అటో రంగ షేర్లులో యాక్టివిటీ అధికంగా ఉండే అవకాశం ఉంది. బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా:- గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ప్యానెల్ బీపీసీఎల్‌,  షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో మొత్తం వాటాను విక్రయించడంతో సహా 5 కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం

Most from this category