News


బీపీసీఎల్‌ జోరు..లాభాల్లో ఇంధన షేర్లు

Friday 20th September 2019
Markets_main1568970313.png-28458

కేంద్ర ఆర్థిక మంత్రి, అనూహ్యంగా దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్యలను ప్రకటించడంతో దేశీయ మార్కెట్‌లు అమాంతం పెరిగాయి. ఇటువంటి పరిస్థితులలో బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌)లోని ప్రభుత్వ వాటాను కూడా కేంద్ర ప్రభుత్వం విక్రయించనుందనే అంచనాలు మార్కెట్‌లో మొదలయ్యాయి. మొత్తంగా శుక్రవారం ట్రేడింగ్‌లో బీపీసీఎల్‌ షేరు​మధ్యాహ్నాం 2.14 సమయానికి 13.37 శాతం లాభపడి రూ. 429.65 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్‌ 4.70 శాతం లాభపడి 14,953.70 పాయింట్ల వద్ద ఉంది. ఈ ఇండెక్స్‌లో మిగిలిన షేర్లయిన హిందుస్తాన్‌ పెట్రోలియం 11.39 శాతం, ఐఓసీ(ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌) 6.66 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6.57 శాతం, ఓఎన్‌జీసీ 5.95 శాతం, టాటా పవర్‌ 4.63 శాతం, గెయిల్‌ 1.62 శాతం లాభపడి ట్రేడవుతుండగా, పవర్‌గ్రిడ్‌ 0.75 శాతం, ఎన్‌టీపీసీ 2.05 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 
  మధ్యాహ్నాం 2.23 సమయానికి నిఫ్టీ 50 621.85 పాయింట్లు లాభపడి 11,319.60 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 2,156.23 పాయింట్లు లాభపడి 38,216.37 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ ఇదే..!

Friday 20th September 2019

2279 లాభపడ్డ సెన్సెక్స్‌ 578 పాయింట్లు పెరిగి నిఫ్టీ మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో గురువారం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు దశాబ్దంలోనే అతిపెద్ద ర్యాలీని చేశాయి. దేశీయ కంపెనీల కార్పోరేట్‌ పన్ను 33శాతం నుంచి 22శాతం తగ్గించడం, కొత్త కంపెనీల కార్పోరేట్‌ పన్ను 25శాతం నుంచి 15శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం మార్కెట్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో

గంటలో రూ.5లక్షల కోట్లు..!

Friday 20th September 2019

దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ పన్ను తగ్గించడంతో గురువారం సూచీలు లాభాల మోత మోగించాయి. నిఫ్టీ సూచీ పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ చేసింది. సెన్సెక్స్‌ 1956 పాయింట్లు ఎగిసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువత్తడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక గంటలో రూ.రూ.5లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే  బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గురువారం మార్కెట్‌ ముగిసే సరికి రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి

Most from this category