News


ప్రైవేటీకరణ..నష్టాల్లో బీపీసీఎల్‌, కాంకర్‌, ఎస్‌సీఐ

Thursday 21st November 2019
Markets_main1574308965.png-29748

చమురు దిగ్గజం బీపీసీఎల్(భారత పెట్రోలియం కార్పోరేషన్‌), షిప్పింగ్‌ సం‍స్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనరి సం‍స్థయిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29 శాతం వాటాను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. అంతేకాకుండా షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)లో మొత్తం 63.75 శాతం వాటాను, అలాగే కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాన్‌కర్‌)లో 30.9 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి. కేం‍ద్ర కెబినేట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో గురువారం సెషన్‌లో ఈ కంపెనీల షేర్లు ప్రభావితమయ్యాయి. ఉదయం 9.19 సమయానికి బీపీసీఎల్‌ 1.26 శాతం నష్టపోయి రూ. 537.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 544.65 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం సెషన్‌లో రూ. 549.70 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది.
 అదేవిధంగా షిప్పింగ్‌ కార్పోరేషన్‌ షేరు 3.14 శాతం నష్టపోయి రూ. 66.35 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో ఈ షేరు రూ. 68.50 వద్ద ముగియగా, నేటి సెషన్‌లో రూ. 69.50 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. కంటైనర్‌ కార్పోరేషన్‌ షేరు 0.04 శాతం పడిపోయి రూ. 577.90 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 578.15 వద్ద ముగిసిన ఈ షేరు, రూ. 603.00 వద్ద ప్రారంభమైంది.



You may be interested

ఒడిదుడుకుల ప్రారంభం

Thursday 21st November 2019

పలు ప్రతికూల, సానుకూల సంకేతాల నడుమ గురువారం ప్రారంభంలో స్టాక్‌ సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 40,737 పాయింట్ల వద్ద ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే స్వల్ప నష్టాల్లోకి మళ్లింది. ఇదే రీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,025 పాయింట్ల వద్ద మొదలై, వెనువెంటనే 12,000 లోపునకు పడిపోయింది. దేశీయంగా టెలికాం కంపెనీలకు స్పెక్ర్టం చెల్లింపుల్లో ప్రభుత్వం ఊరటనివ్వడం, కొన్ని ప్రభుత్వ

డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు

Thursday 21st November 2019

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌ వెల్లడించారు. 2018-19 ఏడాదిలో ఈ మొత్తం  3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016-17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. 

Most from this category