News


రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌తో వీటికి లాభం!

Friday 8th November 2019
Markets_main1573152789.png-29425

నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఏఐఎఫ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం రియల్‌ ఎస్టేట్‌ రంగంతోపాటు, ఇళ్ల నిర్మాణంతో అనుసంధానమైన ఉన్న పలు ఇతర రంగాల కంపెనీలకూ ప్రోత్సాహం ఇవ్వనుంది. విశ్లేషకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

 

‘‘నిలిచిపోయిన నివాసిత రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రాజెక్టులను వేగంగా ముందుకు కదిలించేందుకు రూ.25,000 కోట్లతో ఏఐఎఫ్‌ ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైతే మరింత నిధిని సమకూర్చనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడాన్ని మార్కెట్లు బలంగా స్వాగతించాయి’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ పీఎంఎస్‌ సీఈవో అజయ్‌బోడ్కే అన్నారు. ఈ సం‍స్కరణను ప్రభుత్వం సరిగ్గా అమలు చేస్తే ఒక్క రియల్‌ ఎస్టేట్‌ రంగమే కాకుండా, అనుబంధంగా ఉన్న ఆరు రంగాలకు, కంపెనీలకు లాభం కలుగుతుందనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. 

 

‘‘రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఒబెరాయ్‌ రియాలిటీ, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, సన్‌టెక్‌ రియాలిటీ, శోభ.. హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ, కెన్‌ఫిన్‌ హోమ్స్‌ ఇక ముందూ మంచి పనితీరు చూపించగలవు’’ అని ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈవో అమిత్‌గుప్తా పేర్కొన్నారు. హౌసింగ్‌ రంగంతో ముడిపడిన ఏషియన్‌ పెయింట్స్‌, కజారియా సిరామిక్స్‌, పిడిటైల్‌ ఇండస్ట్రీస్‌, రామ్కో సిమెంట్‌, శ్రీసిమెంట్‌ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చని నిపుణుల సూచన. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, జేఎం ఫైనాన్షియల్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌తోపాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎక్కవ ఎక్స్‌పోజర్‌ కలిగిన యస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీకు అధిక లాభం చేకూరుతుందని అజయ్‌బోడ్కే అంచనా వేశారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో డీఎల్‌ఎఫ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, శోభ, పురవంకర, కోల్టేపాటిల్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్‌బీసీసీ, అహ్లువాలియా కాంట్రాక్ట్స్‌, ఎల్‌అండ్‌టీపైనా దృష్టి సారించొచ్చని సూచించారు. You may be interested

భారీగా తగ్గిన బంగారం

Friday 8th November 2019

గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా పతనమయ్యింది. ఔన్సు పసిడి ధర ఒక్కసారిగా 32 డాలర్లు పతనమై 1,460 డాలర్లకు పడిపోయింది. కొద్దిరోజులుగా అమెరికా-చైనాల తొలిదశ వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న వార్తలు హోరెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపినప్పటికీ, బంగారం స్థిరంగా 1,500 డాలర్లపైన ట్రేడవుతూ పలువురు బులియన్‌ విశ్లేషకుల్ని ఆశ్చర్యపర్చింది. సాధారణంగా రిస్క్‌తో కూడిన ఈక్విటీల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంటే, రక్షణాత్మక పెట్టుబడిగా భావించే

లార్జ్‌క్యాప్స్‌ మార్కెట్‌ ఇది: అజయ్‌ శ్రీవాస్తవ

Friday 8th November 2019

దీర్ఘకాలం పాటు మిడ్‌క్యాప్‌నకు ‘డెడ్‌ ఎండ్‌ స్ట్రీట్‌’ (ముగింపు వీధి)గా పేర్కొన్నారు డైమెన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సీఈవో అజయ్‌ శ్రీవాస్తవ. ఇండియన్‌ మార్కెట్‌ లార్జ్‌క్యాప్స్‌ మార్కెట్‌గా అభివర్ణించారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.    ప్రస్తుత మార్కెట్లలో ఎలా వ్యవహరించాలి? రికవరీ దశలోకి వెళ్లాం. ఈ మార్కెట్‌ ఏ ఒక్కరికీ అద్భుతమైన రాబడులను ఇచ్చింది లేదు. ఎందుకంటే భారీ పతనం నుంచి ఇది బయటపడింది. ఆ తర్వాత వెనక్కి

Most from this category