News


బీఓఏ ఏఎక్స్‌ఏ స్కీమ్‌ ఎన్‌ఏవీ 26.25 శాతం పతనం

Friday 28th June 2019
Markets_main1561700649.png-26647

డెట్‌ మూచ్యువల్‌ ఫండ్‌ స్కీమ్‌ అయిన బీఓఐ ఏఎక్స్ఏ క్రెడిట్‌ రిస్క్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌ అనుబంధ సంస్థ అయిన సింటెక్స్‌ బీఏపీఎల్‌లోని మొత్తం పెట్టుబడులను ఫండ్‌ రైట్‌డౌన్‌ చేశాక ఈ స్కీము నికర ఆస్తి విలువ బుధవారం 26.25 శాతం తగ్గింది. ఈ నెల 15వ తేదిన బీఓఐ ఏఎక్స్ఏ రిస్క్‌ స్కీమ్‌ సింటెక్స్‌లో చేసిన పెట్టుబడులలో 55 శాతాన్ని రైట్‌డౌన్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు దీని నికర ఆస్తి విలువ ఒకే రోజు 15.34శాతం పడిపోవడం చూశాం. అంతేకాకుండా సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ 90కోట్ల బాండ్ల చెల్లింపులు చేయలేకపోయింది.  2019 మేనాటికి...రూ.533 కోట్ల నిర్వహణా ఆస్తులున్న (ఏయూఎం) ఈ  స్కీమ్‌లో 25.78 శాతం వాటా సింటెక్‌​‍్సకు చెందిన బాండ్లే వున్నాయి. ఈ ఫండ్‌ వద్ద సింటెక్స్‌ బీఏపీఎల్‌కు చెందిన వివిధ కాలపరిమితులు కలిగిన నాలుగు రకాల బాండ్లు ఉన్నాయి. అవి 2020, 2021, 2022 లో మెచ్యుర్‌ అవ్వనున్నాయి. ‘ముందు 55 శాతం పెట్టుబడులను వ్రైట్‌ డౌన్‌ చేశాం. ప్రస్తుత పరిసి​‍్థతుల్లో కంపెనీ సరియైనా ఆస్తి విలువను అంచనా వేయలేకపోతున్నాం. మా ఇన్వెస్టర్లను రక్షించుకోడానికి సింటెక్స్‌ బీఏపీఎల్‌లోని మా పెట్టుబడులు మొత్తాన్నిరైట్‌డౌన్‌ చేస్తున్నాం’ అని సీఐఓ, బీఓఐ ఏఎక్స్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ అలోక్‌ సింగ్‌ అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు చెందిన రూ.105కోట్ల తన ప్రమాదకర రుణాలను ఈ స్కీము రైటాఫ్‌ చేసింది. You may be interested

ఈ నెల కూడా బుల్లిష్‌ రోలోవర్లే అధికం!

Friday 28th June 2019

జూలై సీరిస్‌లోకి ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో బుల్లి్‌ష్‌ రోలోవర్లు అధికంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గురువారం జూన్‌ సీరిస్‌ ముగిసిపోవడంతో లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు తమ పొజిషన్లను జూలై సీరిస్‌కు మార్చుకున్నారు. అంతర్జాతీయ టెన్షన్లు, రుతుపవనాల జాప్యం, మందగమన భయాల నేపథ్యంలో మార్కెట్లో ఆశావహ ధృక్పథం తక్కువగా ఉంది. ఈ వారం బడ్జెట్‌ రానున్న నేపథ్యంలో రోలోవర్లు అధికంగా జరిగాయని నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్లో వచ్చే కీలక ప్రకటనల ఆధారంగా తదుపరి

త్వరలో పేమెంట్‌ సర్వీసులు ప్రారంభించనున్న వాట్సాప్‌

Friday 28th June 2019

బెంగళూరు: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపుల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించినట్లుగా పేమెంట్‌ డేటాను భారత్‌లోనే భద్రపర్చేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా వాట్సాప్‌ ఈ సేవలు అందించనుంది. ఈ సర్వీసుల కోసం ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత

Most from this category