News


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఫలితాల బూస్ట్‌...5 శాతం అప్‌

Monday 11th November 2019
Markets_main1573447251.png-29498

  • 5శాతం లాభపడి షేరు

మెరుగైన రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 5.50శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.94.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.లాభదాయకమైన క్యూ2 ఫలితాలను ప్రకటించడం‍తో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా ఒక దశలో 5.50శాతం లాభపడి రూ.98.90 వద్ద గరిష్టస్థాయిని తాకింది. ఉదయం గం.10.00లకు షేరు గత ముగింపు ధర (రూ.93.80)తో పోలిస్తే రూ.3.62శాతం లాభంతో రూ.97.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.85.70, రూ.143.60లుగా ఉన్నాయి. బ్యాంక్‌ శుక్రవారం క్యూ2 ఫలితాలను ప్రకటించింది. రెండో త్రైమాసిక కాలంలో రూ.737 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.425 కోట్ల నికర లాభం ఆర్జించామని, 73 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,430 కోట్ల నుంచి రూ.22,098 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 11.78 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 10.25 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.86 శాతం నుంచి 3.91 శాతానికి చేరాయి. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, కేటాయింపులను ఈ బ్యాంక్‌ పెంచింది. కేటాయింపులు రూ.2,430 కోట్ల నుంచి రూ.4,209 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 77.88 శాతానికి పెరిగింది.



You may be interested

ప్రైవేట్‌ బ్యాంక్‌లు, మెటల్స్‌కే మా ప్రాధాన్యం!

Monday 11th November 2019

‘దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ, గత వారంలో మరోసారి 12000 స్థాయి వద్ద పరీక్షను ఎదుర్కొంది. నిఫ్టీ ర్యాలీకి వివిధ రంగాలు తోడ్పాటునందినప్పటికి, బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ షేర్లు వీటి ప్రదర్శనను మరుగునపరిచాయి’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌, వీపీ రీసెర్చ్‌, అజిత్‌ మిశ్రా అన్నారు. అయినప్పటికి ఇప్పటికి కూడా విస్తృత సూచీలు ఒత్తిడిలోనే ఉన్నాయని అన్నారు. ‘మధ్యస్థ కన్సాలిడేషన్‌ జరగడంతో గత ఐదు వారాలలో నిఫ్టీ, 11,100 స్థాయి నుంచి 12,000

స్థిరంగా పసిడి

Monday 11th November 2019

గత వారాంతపు రోజున 3నెలల కనిష్టానికి పతనమైన పసిడి ఫ్యూచర్‌ ధర సోమవారం స్థిరంగా కదలాడుతుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం లాభంతో 1463.50డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా ‘‘మొదటి దశ ఒప్పందం’’ సఫలం దిశగా సాగుతుందనే ఆశావహన అంచనాలతో పాటు,  డాలర్ ఇండెక్స్‌ సైతం 3వారాల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి ధర 3నెలల కనిష్టస్థాయి 1,459

Most from this category