News


44,500 పాయింట్లకు సెన్సెక్స్‌!

Tuesday 17th December 2019
Markets_main1576560477.png-30269

వచ్చే ఏడాదికి బీఎన్‌పీ టార్గెట్‌
కొత్త సంవత్సరంలో సెన్సెక్స్‌ 44,500 పాయింట్లను చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం బీఎన్‌పీ పారిబా అంచనా వేసింది. ఇండియా సహా చైనా, థాయ్‌లాండ్‌, సౌత్‌కొరియా మార్కెట్లపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపింది. ఇండోనేసియా మార్కెట్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు తెలిపింది. క్రూడాయిల్‌ ధర స్థిరంగా కొనసాగుతున్నందున ముడిపదార్ధాలు చౌకగా దొరకడం తగ్గవచ్చని, పామాయిల్‌ ధరలు పెరగడం కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. 
వివిధ షేర్లపై బ్రోకరేజ్‌ అంచనాలు ఇలా ఉన్నాయి...
= రిలయన్స్‌ షేరులో కనిపిస్తున్న జోరుకు కాస్త పగ్గాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రిఫైనింగ్‌ మార్జిన్లలో వెనుకంజ ఆర్‌ఐఎల్‌ షేరు జోరును కట్టడి చేయవచ్చని అభిప్రాయపడింది. 
= యూఎస్‌లో వ్యాపార వ్యయాలు పెరగడం దేశీయ ఐటీ కంపెనీలకు మేలు చేస్తుందని అంచనా వేసింది. ఐటీ లార్జ్‌ క్యాప్స్‌లో ఇన్ఫోసిస్‌ చౌకగా ఉందని తెలిపింది. 
= ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ కన్నా హెచ్‌డీఎఫ్‌సీపై ఎక్కువ పాజిటివ్‌గా ఉన్నామని తెలిపింది. ఇండస్‌ఇండ్‌ అసెట్‌క్వాలిటీపై భయాలు పెరుగుతున్నాయని విశ్లేషించింది. హెచ్‌డీఎఫ్‌సీ ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉందని పేర్కొంది.
= టారిఫ్‌ల పెంపు అనంతరం ఎయిర్‌టెల్‌ అత్యధిక ప్రయోజనం పొందవచ్చని తెలిపింది. టెలికం టారిఫ్‌ల పెంపుదల దేశీయ వినిమయ వ్యయంపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. 
= ఈ నేపథ్యంలో తన మోడల్‌ పోర్టుఫోలియో నుంచి ఆర్‌ఐఎల్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, మారికోను తొలగించి ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీలను చేరుస్తున్నట్లు తెలిపింది. 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 17th December 2019

గత వారం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వాణిజ్య ఒప్పందంపై నిరాశావాదం నెలకొనడంతో ఆసియాలో మంగళవారం పసిడికి డిమాండ్‌ పెరిగింది. నేటి ఉదయం ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు లాభపడి 1,482 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వైట్‌హౌస్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ లారీ కుడ్లీ చైనాతో వాణిజ్య ఒప్పందం ఖచ్చితంగా కుదిరిందని వివరణ ఇచ్చినప్పటికీ కొందరు ట్రేడర్లు బీజింగ్‌తో ఒప్పందం ఖరారుపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య

ఐటీ షేర్లు ఆకర్షణీయం!

Tuesday 17th December 2019

నిపుణుల సూచన కొత్త ఏడాది ఐటీ షేర్ల హవా కొనసాగుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ రంగంలో క్రమంగా రిస్కులు దిగివస్తున్నాయని తెలిపారు. ఈ షేర్ల సరాసరి డివిడెండ్‌ ఈల్డ్‌ బాగుండడం, సాధారణ సేవింగ్స్‌ డిపాజిట్స్‌ కన్నా అధికంగా ఉండడంతో వీటిపై ఇన్వెస్టర్లకు మక్కువ పెరుగుతోంది. బలమైన డివిడెండ్‌ ఈల్డ్‌తో పాటు వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడం కూడా వీటిలో కొనుగోళ్లకు కారణమవుతోంది. ఈ రంగం నుంచి ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎల్‌అండ్‌టీ

Most from this category