News


ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను విక్రయించనున్న బీఎన్‌పీ పారిబా

Tuesday 25th June 2019
Markets_main1561437921.png-26545

ఫ్రాన్స్‌ మల్టినేషనల్‌ బ్యాంక్‌ బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌ 2.5 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌  షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా మంగళవారం, బుధవారం విక్రయించనుంది. గత సెషన్‌ ధరతో పోలిస్తే 8.5 శాతం రాయితీతో షేర్‌ను రూ.650 వద్ద విక్రయించనున్నారు. ఈ ఆఫర్‌ను జూన్‌ 25న నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచగా, జూన్‌ 26న రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం షేర్లను బీఎన్‌పీ పారిబా కేటాయించింది. ఈ ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.1775 కోట్లను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. గత సెషన్‌లో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌ షేరు విలువ 1.5 శాతం పెరిగి రూ.710.45 వద్ద ముగిసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌ సంస్థలు కలిసి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది మార్చిలో బీఎన్‌పీ పారిబా 5కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను రూ.2,889 కోట్లకు షేరు రూ.577.93 వద్ద  విక్రయించిన సంగతి తెలిసిందే.  2017 అక్టోబర్‌లో ఎస్‌బీఐ లైఫ్‌ రూ.700 వద్ద ఐపీఓకి వచ్చి స్టాక్‌ మార్కెట్‌లో నమోదయ్యింది. 
 



You may be interested

వ్యక్తిగత కారణాలు... ఇక సెలవు!

Tuesday 25th June 2019

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాల్‌ ఆచార్య రాజీనామా ఆరు నెలల ముందుగానే బాధ్యతల విరమణ  వ్యక్తిగత కారణాలవల్లేనని స్పష్టీకరణ కేంద్రంతో విబేధాలే కారణమన్న పుకార్లు న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్‌ విరాల్‌ ఆచార్య రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు.  ఇదే కారణంగా చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన

ఆగని పసిడి పరుగు

Tuesday 25th June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి పరుగు ఆగడం లేదు. ఆసియాలో ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి మరో 24డాలర్లు ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు, కీలక వడ్డీరేట్లపై పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు మెతక వైఖరి ఇందుకు తోడ్పాటును అందిస్తున్నాయి. ఈ వారంతాన జరిగే జీ-20 సదస్సులో అగ్రరాజ్యాలైన అమెరికా - చైనా దేశాధ్యక్షులైన ట్రంప్‌-జింగ్‌పిన్‌ల మధ్య ట్రేడ్‌ వార్‌ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు

Most from this category