News


బీఎన్‌పీ పారిబా నుంచి 30 సిఫార్సులు

Thursday 28th November 2019
Markets_main1574931431.png-29928

దేశీయ మార్కెట్‌,  ఎకానమీ వ్యతిరేక దిశల్లో కదులుతున్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది. క్యు2లో కార్పొరేట్‌ ఫలితాలు చాలా వరకు అంచనాలకు మించాయని కానీ దీనివల్ల భవిష్యత్‌ అంచనాలు మరింత పెరిగాయని తెలిపింది. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎస్‌ అంచనాలు 11 శాతం, వచ్చే ఏడాదికి 19 శాతానికి చేరాయని పేర్కొంది. ప్రస్తుతం ఇండియా మార్కెట్‌పై ఓవర్‌వెయిట్‌గానే ఉన్నామని తెలిపింది. ఈఏడాది చివరకు సెన్సెక్స్‌ టార్గెట్‌ 40500 పాయింట్లుగా నిర్ణయించామని తెలిపింది. ఇది ప్రస్తుత స్థాయిల కన్నా తక్కువ కావడం గమనార్హం. రెండు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం మరిన్ని స్టాకులు తమ ఐదేళ్ల వాల్యూషన్‌ సరాసరి కన్నా గరిష్టం వద్ద ట్రేడవుతున్నాయని పారిబా తెలిపింది. ఎకానమీలో మందగమనం, వాల్యూషన్లు పెరగడం వంటి స్పీడుబ్రేకర్లున్నా అంతర్జాతీయ పాజిటివ్‌ మూడ్‌, ఎఫ్‌ఐఐ నిధులు దేశీయ సూచీలను ముందుకే నడిపిస్తాయని తెలిపింది. వచ్చే ఏడాది జూన్‌ నాటికి యూఎస్‌ ఫెడ్‌ మరో 75 బీపీఎస్‌ మేర వడ్డీరేట్లు తగ్గించవచ్చని అంచనా వేసింది. ఈసీబీ మరో 10 బీపీఎస్‌ రేట్లను తగ్గించి క్యుఈని కొనసాగించవచ్చని, దీంతో ఆర్‌బీఐకి మరో 25 బీపీఎస్‌ మేర రేట్లు తగ్గించే ఛాన్సు వస్తుందని తెలిపింది. 
మోడల్‌ పోర్టుఫోలియో..
తమ నమూనా పోర్టుఫోలియోలో ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని బీఎన్‌పీ పారిబా తెలిపింది. వీటితో పాటు హైక్వాలిటీ కన్జూమర్‌ కంపెనీలు, నాణ్యమైన పీఎస్‌యూలను పరిశీలించవచ్చని తెలిపింది. సంస్థ సిఫార్సు చేసే లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఇలా ఉన్నాయి..


పైవన్నీ బ్రోకింగ్‌ సం‍స్థ అంచనాలు మాత్రమే. పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి. You may be interested

పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు

Thursday 28th November 2019

దేశీయ మెటల్‌ షేర్లు గురువారం సెషన్లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.23 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.80 శాతం లాభపడి 2,649.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్యూ స్టీల్‌ 4.05 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 3.43 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 3.29 శాతం, జిందాల్‌ స్టీల్‌ 3.20 శాతం, టాటా స్టీల్‌ 2.23 శాతం, సెయిల్‌ 2.19 శాతం, కోల్‌ ఇండియా

‘‘టైమ్స్‌ గ్రూప్‌’’ చేతికి అంబానీ మీడియా ఆస్తులు..!?

Thursday 28th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన న్యూస్‌ మీడియా ఆస్తులను ఇండియా టైమ్స్‌ గ్రూప్‌నకు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నారని వార్తలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నష్టాల్లో నడుస్తున్న మీడియా వ్యాపారాన్ని వదిలించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని, అందులో భాగంగా తన న్యూస్‌ మీడియా ఆస్తులను ఇండియా టైమ్స్‌ గ్రూప్‌నకు అమ్మేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. గతవారంలో నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌లో కొంతవాటాను జపాన్‌

Most from this category