మరింత ర్యాలీ కష్టమే!
By D Sayee Pramodh

బడా బ్రోకరేజ్‌ల అంచనాలు
దేశీయ ఎకానమీలో మందకొడితనం దేశీయ స్టాక్ సూచీలను నిలువరించలేకపోతోంది. ఒకపక్క ఎకానమీ నానాటికీ మందగమనంలోకి పయనిస్తుండగా, స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైలను తాకుతున్నాయి. ఈ విధమైన వ్యత్యాస ప్రవర్తన ఇకపై ముగిసిపోనుందని, మార్కెట్లో మరింత ర్యాలీ ఇకముందు కష్టమేనని బీఎన్పీ పారిబా అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో పలువురు విధాన నిర్ణేతలు, పరిశ్రమ నిపుణులతో సమావేశం జరిపామని, ఆర్థిక గణాంకాలు వెనువెంటనే మెరుగుపడకపోవచ్చని వీరిలో ఎక్కువమంది అంచనా వేస్తున్నారని బీఎన్పీ పారిబా ప్రతినిధి అభిరామ్ ఏలేశ్వరపు చెప్పారు. అందువల్ల ఇకపై సూచీల్లో ర్యాలీ కథ ముగిసినట్లేనన్నారు. మరో దిగ్గజ బ్రోకింగ్ సంస్థ క్రెడిట్ సూసీ సైతం ఇదే అంచనాలో ఉంది. అనుకున్నదానికన్నా ఎక్కువకాలం వృద్ధిలో మందగమనం కొనసాగవచ్చని క్రెడిట్ సూసీ ఇప్పటికే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎస్‌లో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది కూడా ఇలాగే ఉండొచ్చని ఇటీవలి నివేదికలో తెలిపింది. కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆర్థిక మందగమనాన్ని పెద్దగా లెక్కచేయడంలేదు. ముఖ్యంగా ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో సూచీలు ఆల్‌టైమ్ హైని తాకాయి. విత్తలోటు పట్టించుకోకుండా వృద్ది ఉద్దీపనలు ఇవ్వడమా? మందగమనం పట్టించుకోకుండా లోటు కట్టడికి ప్రాధాన్యమివ్వడమా? అని ప్రభుత్వం పెద్ద డైలమాలో పడనుందని బీఎన్పీ పారిబా పేర్కొంది.
బీఎన్పీ పారిబా ఇతర అంచనాలు..
- దేశీయ ఎకానమీ వచ్చే ఏడాది రికవరీ బాట పడుతుంది. 2021 ఆర్థికసంవత్సరంలో ఈపీఎస్ 16 శాతానికి పెరగవచ్చు.
- వచ్చే ఏడాది అంతర్జాతీయ వృద్ది చక్రీయ వలయం దేశీయ ఎకానమీనపై పాజిటివ్ ప్రభావం చూపుతుంది. దీనికి స్థానిక ప్రభుత్వ ఉద్దీపనా చర్యలు సహకరిస్తాయి.
- 2020 చివరకు నిఫ్టీ 13000 పాయింట్లను చేరుతుంది. రెండుమూడేళ్లుగా మందకొడిగా ఉన్న స్టాకులు టర్నెరౌండ్ చూపుతాయి.
జేపీ మోర్గాన్ అంచనాలు..
- వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రికవరీ ఉండొచ్చు. వడ్డీరేట్ల తరుగుదల, వర్షపాతం బాగుండడం, ప్రభుత్వ వ్యయం పెరగడం.. కలిసివస్తాయి.
- వాల్యూషన్లు ఆసియాలో అన్ని మార్కెట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. సంస్కరణలు కొనసాగడమే ఈక్విటీల్లో ర్యాలీకి కీలకం.
- లాంగ్‌టర్మ్‌కు ఐసీఐసీఐబ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అశోక్లేలాండ్ను పరిశీలించవచ్చు.
You may be interested
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
Thursday 28th November 2019మిడ్‌సెషన్ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్ 3.50 శాతం లాభపడింది. ఓరియంటల్ బ్యాంక్ అత్యధికంగా 7.50శాతం లాభపడింది. యూనియన్ బ్యాంక్ 7శాతం, ఇండియన్ బ్యాంక్ 6.50శాతం, సిండికేట్ బ్యాంక్ 6శాతం, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్ 6.50శాతం ర్యాలీ చేశాయి. సెంట్రల్ బ్యాంక్ 5శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.50శాతం, అలహదాబాద్
పాజిటివ్‌గా టెల్కోలు..వొడా-ఐడియా 11% అప్
Thursday 28th November 2019టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపుపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని ప్రభుత్వం అధికారులు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఈ పెంపు వచ్చే నెల నుంచి అనివార్యం కానుంది. కాగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో గురువారం సెషన్లో టెలికాం కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వొడాఫోన్-ఐడియా ఉదయం 11.23 సమయానికి ఏకంగా 11.03 శాతం పెరిగి రూ. 6.55 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 5.90 వద్ద ముగిసిన ఈ